Sri Sankara Jayant  Chapters    Last Page

శ్రీ శంకరజయంతి.

'యం యం లోకం మనసా సంవిభాతి

విశుద్ధసత్త్వః కామయ తే యాంశ్చ కామా9 |

తం తం లోకం జయతే తాంశ్చ కామా9

తస్మా దాత్మజ్ఞం హ్యర్చ యే ద్భూతికామః |'

(ముండకోపనిషత్‌ 3-1-10)

శాంకరభాష్యమ్‌ - య ఏవం ఉక్త లక్షణం సర్వాత్మానం ఆత్మత్వన ప్రతిపన్నస్య సర్వాత్మత్వా దేవ సర్వావాప్తిలక్షణం ఫల మాహ- యం యం లోకం పిత్రాది లక్షణం మనసా సంవిభాతి సంకల్పయతి మహ్యం అన్యసై#్మ వా భ##వే దితి | విశుద్ధసత్త్వః క్షీణక్లేశః ఆత్మవిత్‌ నిర్మలాంతః కరణః కామయతే యాంశ్చ కామాన్‌ ప్రార్థయ తే ఖోగాన్‌ తస్మాత్‌ విదుషః సత్యసంకల్పత్వాత్‌ ఆత్మజ్ఞం ఆత్మజ్ఞానేన విశుద్ధాంతఃకరణం హ్యర్చయేత్‌ పూజయేత్‌ పాదప్రక్షాలన శుశ్రూషానమస్కారాదిభిః భూతికామో విభూతికామః | తతః పూజార్హ ఏవాసౌ ||

తా|| సర్వవ్యాపకమైన పరమాత్మను ఆత్మరూపమున సాక్షాత్కరించుకొనిన బ్రహ్మ వేత్తకు సమస్త కోరికలు సిద్ధించుచున్నవి. ఆనిర్మలాంతఃకరణుడు ఏయే లోకములను, ఏయే భోగములను తనకుగాని, తనభక్తులకు గాని కోరుచున్నాడో అవి యన్నియు పొందుబడుచున్నవి. కనుక ఐశ్వర్యకాముడు ఆత్మజ్ఞానసంపత్తి గలిగిన యతిని పాదుప్రక్షాలనశుశ్రూషా నమస్కారాదులద్వారా పూజించవలెను. అనగా బ్రహ్మవేత్త తప్పక పూజింపదగినవాడు.

'స వే దై త త్పరమం బ్రహ్మధామ

యత్ర విశ్వం నిహితం భాతి శుభ్రమ్‌ |

ఉపాసతే పురుషం యే హ్యకామా

తే శుక్ర మేత దతివర్తన్తి ధీరాః |'

(ముం|| 3-2-1)

సర్వోత్కృష్టమగు నా బ్రహ్మము సర్వకామముల కాశ్రయము. ఈసమస్తజగత్తు దానియం దర్పితమయి యున్నది. బ్రహ్మము స్వయంప్రకాశము. దానిని తెలిసికొనిన పురుషుని నిష్కామభావనతో పూజించిన జన్మరాహిత్యము కలుగును. బ్రహ్మను తెలిసినవాడు బ్రహ్మమేగాన బ్రహ్మోపాసనవలన గలుగు ఫలము బ్రహ్మవిదుని యుపాసించిన గలుగును.

తైత్తిరీయమందునూ, "బ్రహ్మవి దాప్నోతి పరం| త దేషాభ్యుక్తా | సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ | యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్‌ | సోశ్నుతే సర్వాన్‌ కామాన్‌ సహ | బ్రహ్మణా విపశ్చితేతి||" (2-1)

బ్రహ్మవేత్త పరమాత్మను పొందుచున్నాడు. ఆబ్రహ్మము సత్యము, జ్ఞానము, అనంతము నైయున్నది. ఏ పురుషుడు ఆబ్రహ్మమును బుద్ధిరూపగుహయందు హార్దాకాశమున సాక్షాత్కరించుకొనునో అతడు సమస్త భోగములను పొందుచున్నాడు (ఈశ్రుతికి చక్కని శాంకరభాష్యము గలదు. విశేషజిజ్ఞాసగలవారు దానిని గురుముఖతః చదవ వలెను)

' స యో హ వైత త్పరమం బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి'

(ముం || 3-2-9)

పరమోత్కృష్టమైన బ్రహ్మను తెలిసికొనినవాడు బ్రహ్మస్వరూపుడే. "బ్రహ్మవి ద్బ్రహ్మైవ భవతి" బ్రహ్మావేత్త బ్రహ్మయే యగుచున్నాడు. పరమాత్మను యుపాసించిన ఎట్టి ఫలములు గలుగునో బ్రహ్మవేత్తను యుపాసించిననూ అట్టి ఫలములే కలుగగలవు. సందేహము లేదు. ఛాందోగ్యమున 8వ అధ్యాయమున ద్వితీయఖండ మంతయు బ్రహ్మవేత్త సంకల్పబలమును సూచించును.

"యం కామం కామయతే సో7స్య సంకల్పాదేవ సముత్తిష్ఠతి | తేన సంపన్నో మహీయతే|"

(ఛాం|| 8-2-10)

ఇత్యాదిగా బ్రహ్మవేత్త నారాధించినవారికి అష్టైశ్వర్యములు కలుగునని ఉపనిషత్తులు పలుతావుల పలికినవి. అష్టైశ్వర్యము లనగా "విభూతి ర్భూతి రైశ్వర్య మణి మాదిక మష్టధా" యని యమరకోశము - అణిమాద్యష్టసిద్ధులు భూతిశబ్దముచే చెప్పబడుచున్నవి.

'అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా |

ప్రాప్తిః ప్రాకామ్య మిశిత్వం వశిత్వం చాష్టభూతయః ||'

యను శ్లోకముచే చెప్పబడుచున్నవి. అష్టైశ్వర్యములనగా ఇంకొక యర్థము కూడ గలదు.

'దాసో భృత్య స్సుతో బంధుః వస్తువాహన మేవ చ |

ధనధాన్యసమృద్ధి శ్చాప్యష్టభోగాః ప్రకీర్తి తాః ||'

దాసులు, భృత్యులు, సుతులు, బంధువులు, వస్తువులు, వాహనములు, ధనములు, ధాన్యములు ఇవి అష్టభోగములనబడును. ఇందేది కావలసినను బ్రహ్మవేత్త నుపాసించిన బడయవచ్చును. ఇచ్చటనే అష్టకష్టములు కూడ తెలియుట యవసరము. ఈ కష్టనివృత్తినికూడ బ్రహ్మవేత్త నుపాసించిన పొందవచ్చును.

'ఋణం యచ్నా చ వృద్ధత్వం జారచోరదరిద్రతా |

రోగశ్చ భుక్త శేష శ్చాప్యష్టకష్టాః ప్రకీర్తితాః ||'

తా|| 1 అప్పులపాలగుట 2 లేదని యాచించుట 3 వార్థక్యము 4 జారత్వము 5 చోరత్వము 6 దారిద్ర్యము 7 రోగములు 8 ఎంగిలివస్తువులు తినుట. ఈ కష్టములన్నియు బ్రహ్మవేత్తల నుపాసించి తొలగించుకొనవచ్చును. ఇచ్చట మరికొన్ని విశేషములు కూడ తెలిసియుండుట మంచిది.

క|| దయయు జుగుప్సయు మోహము

భయమును సంశయము గులము బలశీలము ల

న్నియు గూడ నష్టపాశము

లయి వెలయును వాని నాత్ము డంటక యుండున్‌.

ఈ యష్ట పాశములు బ్రహ్మవేత్త నుపాసించిననే తొలగును. ఈశ్వరు నుపాసించిననూ దొలగవు. ఇవియే శ్లోకమునందిట్లు గలవు.

'ఘృణా లజ్జా భయం శంకా జుగుప్సా చేతి పంచమీ |

కులం శీలం చ జాతి శ్చేత్యష్టౌ పాశాః ప్రకీర్తి తాః ||'

ఈ యష్టపాశములు బ్రహ్మవేత్తయైన గురుదేవుని యనుగ్రహమువలన దొలగవలయునేగాని వేరొక మార్గము లేదు. ఆత్మ అష్టపాశము లను బంధములనుండి విడివడవలయును. అదియే మోక్షము. అదియే శుద్ధస్వరూపమైన యాత్మ.

"త ద్విజ్ఞానార్థం స గురు మేవాభిగచ్ఛేత్‌ సమిత్పాణి

శ్శ్రోత్రియం బ్రహ్మనిష్ఠమ్‌| " (ముం || 1-2-12)

ఆ బ్రహ్మను తెలిసికొనుటకు కానుకల చేత నుంచుకొని వేదప్రామాణ్యము గలిగి బ్రహ్మనిష్ఠుడైన యతీశ్వరుని గురువుగా స్వీకరించి యుపాసించవలయును. 'బ్రహ్మసంస్థో అమృతత్వ మేతి' యను వాక్యమున బ్రహ్మసంస్థశబ్దము యత్యాశ్రమమందు రూఢముగా గ్రహించిరి. శంకరభగవత్పాదులు ఈపైన వివరింపబడిన శ్రుతు లన్నియు అష్టైశ్వర్యములు కావలసినను, జ్ఞానము పొందగోరినను, జన్మ రాహిత్యము మోక్షమునందభిలాష, గలిగినను, అష్టకష్టములు దొలగించదలచినను బ్రహ్మవేత్తల నుపాసించవలయునని యుపనిషత్తులు పలుకుచున్నవి. వీటికన్న పరమప్రమాణములు ప్రపంచమున లేవు. కాన బ్రహ్మవేత్తలైన శంకరభగవత్పాదులు పూజించుచు శంరజయంతి చేసికొనుట ఎంతయు ఉచితము. లోకమున శ్రీరామనవమినాడు రామజయంతి, కృష్ణాష్టమినాడు కృష్ణ జయంతి, శివరాత్రినాడు శివజయంతి, దసరానవరాత్రులలో దేవీజయంతి ఇత్యాదిగా సంవత్సరము పొడుగునా అనేకయవతారజయంతులు పంచాంగమందు వ్రాయబడియుండును. వాటి యన్నిటికన్న శంకరజయంతి కొక విశిష్టత యున్నదేమో యని నేను భావింతును. కారణమేమనగా-

'బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ శక్రో లోకోపసంయుతః |

వస్వాద్యాశ్చ గణా స్సర్వే యతిదేహే వసంతి హి ||

పూజితే పూజితా ఏతే సర్వ ఏవ సురోత్తమాః|

తా|| బ్రహ్మవిష్ణుమహేశ్వరులు, ఇంద్రుడు, ఇంద్రలోకమందలి బృహస్పత్యాదులు, ఇంద్రసభాసదులు, వస్వాది దేవతాగణములు,

"ఆదిత్య విశ్వవసవ స్తుషితా భాస్వరానిలాః |

మహారాజకసాధ్యాశ్చ రుద్రాశ్చ గణదేవతా||"

ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, తుషితులు, భస్వరులు, 49 మరుద్గణము, మహారాజకులు, సాధ్యులు, ఏకాదశరుద్రులు, వీరందరూ యతీశ్వరుల శరీరము నాశ్రయించియుందురు. యతీశ్వరులను పూజించిన వీరందరూ పూజింపబడుదురు. శంకరభగవత్పాదులవారు పరమహంసపరివ్రాజకాచార్యవర్యులుగాన వారిని పూజించిన సమస్త దేవతలను పూజించినట్లే. వారిజయంతి సమస్త దేవతాజయంతి.

యతీశ్వరులను పూజించవలెనా? యని కొందరు తరచు ప్రశ్నించుచుందురు. పూజించవలెననియే శాస్త్రము చెప్పుచున్నది. "తస్మా చ్ఛాస్త్రం ప్రమాణం తే" యని భగవద్గీతలో భగవంతుని సూక్తి.

'తురీయః పరమో హంస స్సాక్షా న్నారాయణో యతిః |'

తా|| కుటీచక బహూదకహంసపరమహంసలలో నాలుగవవాడైన పరమహంసయతి సాక్షాన్నారాయణుడే యని తెలియవలెను.

'భవంతి చ తిరస్కారాత్‌ సర్వే7పి చ తిరస్కృతాః |'

యతిదేహమందు త్రిమూర్త్యాదిసమస్త దేవతలు నుందురు గాన వారిని తిరస్కరించిన, అవమానించిన దేవతలందరు అవమానితులు, తిరస్కృతులు నగుదురు.

1 'దేహః పరమహంసస్య జీవన్‌ విష్ణు రయం స్వయమ్‌ |

2 దండగ్రహణమాత్రేణ నరో నారాయణో భ##వేత్‌ ||'

(బ్రహ్మవైవర్తం)

3 'యెవిప్రో ధారయే ద్దండం సతునారాయణః స్వయమ్‌|

చతుర్భుజాః ప్రజాయంతే దండధారణమాత్రతః ||'

1. పరమహంసశరీరము జీవించినంతకాలము శ్రీమహా విష్ణుస్వరూపమే.

2. దండమును గ్రహించినంతమాత్రమునే (యత్యాశ్రమము స్వీకరించినంతమాత్రముననే) నరుడు నారాయణుడగుచున్నాడు.

3. దండమును ధరించిన విప్రుడు స్వయముగా నారాయణుడే . అతనికి నాలుగు చేతులు నిగూఢముగా నుండును

'యథా రాజా జనైః సర్వైః పూజ్యతే మునిసత్తమ |

తథా జ్ఞానీ సదా దేవై ర్మునిభిః పూజ్య ఏవ హి ||'

తా || సాధారణమానవు లందరూ రాజును (ఉన్న తాధికారిని) పూజించినటులనే జ్ఞానియైన యతి దేవతలచే, మునులచే పూజింపదగినవాడు.

'యతేర్దర్శనమాత్రేణ విముక్తో సర్వపాతకాత్‌ |

తీర్థవ్రతతపోదానసర్వయజ్ఞ ఫలం లభేత్‌ ||'

తా|| యతీశ్వరుని దర్శించినంతమాత్రముననే సర్వపాపములనుండి విముక్తుడై తీర్థవ్రతతపోదానము లను సర్వయజ్ఞ ఫలమును పొందును.

'యతే ర్దర్శనమాత్రేణ తీర్థకోటిఫలం లభేత్‌|'

తా || యతీశ్వరుని దర్శించినంతమాత్రమున కోటితీర్థము లందు స్నానము చేసిన ఫలము కలుగుచున్నది.

'బ్రహ్మష్ఠః పరమో హంసో సాక్షాన్నారాయణః స్మతః |

యస్తు సంపూజయే న్నిత్యం విష్ణు స్తేన ప్రపూజితః |'

తా || బ్రహ్మిష్ఠుడైన పరమహంస సాక్షాన్నారాయణుడే యని తెలియవలె. అతనిని నిత్యమూ పూజించుటచే శ్రీ మహావిష్ణువు పూజింపబడుచున్నాడు.

(టిప్పణి- దండమును ధరించిన విప్రుడు యనుటచే దండగ్రహణమునకు బ్రాహ్మణులే యధికారులని తెలియవలెను. ఇతరసాధువులు పూజార్హులు కారు)

'యతి రూపేణ సర్వత్ర విష్ణుః పర్యటతే మహీమ్‌ |

భక్తానా మనుకంపార్థం మహాధర్మవివృద్ధయే|'

తా || శ్రీమహావిష్ణువే యతిరూపమును ధరించి భక్తుల ననుగ్రహించుటకొరకు సర్వత్ర పర్యటించుచుండును. మహాధర్మమైన త్యాగమును ప్రచార మొనరించుటకే అతడట్లు తిరుగును.

'యతిభిః పూజ్యమానై స్తు సర్వే దేవా స్సుపూజితాః |

అమానే చకృతే తేషాం దేవా స్సర్వే 7పమానితాః ||'

యతీశ్వరులను పూజించినందువలన దేవత లందరూ పూజింపబడుదురు. వారి నవమానించిన దేవతలందర నవమానించినట్లే యగును. (దేవ హేళనమువలన నరకప్రాప్తి.)

'జన్మకోటిసహస్రేషు పూజిత స్తేన శంకరః |

గృహే యస్య సమాయాతి మహాభాగవతో యతిః |'

తా|| మహాభాగవతోత్తముడైన యతి యెవరియింటికి వచ్చునో వారు పూర్వమందు వెయ్యికోట్ల జన్మలలో శంకరుని పూజించియుండి రని గ్రహించవలెను. అంతపుణ్యమున్నగాని యతులు ఇంటికి రారు.

'యతి రూపో హి యో విష్ణుః భక్తా యేన ప్రపూజితః|

యతిప్రాప్యం ప్రాప్య లోకం సో7నంతం సుఖ మశ్ను తే|'

తా || శ్రీమహావిష్ణుస్వరూపుడైన యతిని పూజించిన వాడు యతి పొందు లోకమును పొంది అనంతసుఖము ననుభవించుచున్నాడు.

'ఏకదండీ త్రిదండీ వా శిఖీ ముండీ తథైవ చ |

కాషాయమాత్ర ధారో7పి యతిః పూజ్యో యుధిష్ఠిర||'

తా || ధర్మనందనా! కుటీచకాదిచతురాశ్రమములందున్న వారిని కాషాయవస్త్రధారణమాత్రమున పూజింపదగినదే.

'ఆసనం శయనం యానం యతిం దృష్ట్వాన యస్త్య జేత్‌ |

స మృతో7పి హి దుష్టాత్మా శ్వయోనా వేవ జాయతే'

(జాబాలః)

తా|| యతీశ్వరులను చూచుటతోడనే- ఆసనమును (కుర్చీ ఇత్యాది) శయనమును (మంచము మొదలైనవి) యానమును (సైకిలు గుర్రము మొదలైనవి ) దిగి నమస్కరించని యెడల వాడు కుక్కగా పుట్టుచున్నాడు.

'దేవతాప్రతిమాం దృష్ట్యా యతిం దృష్ట్వైవ దండినమ్‌|

నమస్కార మకుర్వాణో రౌరవం నరకం ప్రజేత్‌||

తా|| దేవతాప్రతిమలను చూచిగాని, దండమును ధరించిన యతీశ్వరుని చూచిగాని నమస్కారము చేయనివాడు రౌరవాదినరకములను పొందును.

'ద్వే రూపే వాసుదేవస్య చలం చాచల మేవ చ |

చలం సన్న్యాసినో రూపం అచలం ప్రతిమాదికమ్‌||

తా|| వాసుదేవునకు రెండు రూపములు గలవు. అందు సన్న్యాసులే చలరూపము. గుళ్లలో ప్రతిమాదికము అచలరూపము.

సాక్షా ద్విష్ణ్వాకృతి ర్విప్రో నమస్యో7యం సురాసురైః |

వర్ణాశ్రమైః సమసై#్తశ్చ పరం హంసో ద్విజోత్తమః ||

తా|| పరమహంసాశ్రమము స్వీకరించిన బ్రాహ్మణశ్రేష్ఠుడు సాక్షాద్విష్ణుస్వరూపుడే యగుచున్నాడు. కనుక సమస్త వర్ణాశ్రమములవారిచేతను, సురాసులచేతను నమస్కరింపదగినవాడు, పూజార్హుడు. లోకమున పీఠాధిపతులనే పూజించవలెనుగాని, సాధారణయతులను పూజించ నమసరములేదని భ్రాంతి కొందరిలో వ్యాపించియున్నది. అట్టి భావనకు శాస్త్రమునం దాధారము లేదు. పీఠములు శంకర భగవత్పాదులవారు స్థాపించి రని అందరూ యెరిగినదే. వాటి వయసు యెంత వెనుకకు పోయినను 3 వేలకు మించదు. శ్రుతిస్మృతులందు యతులను పూజించవలె నని మాత్రమున్నది. పీఠాధిపతులుమాత్రమే పూజార్హులని లేదు. ఎందువల్లననగా శ్రుతిస్మృతులు పుట్టిననాటికి పీఠములు లేనే లేవు. కనుక వాటి ప్రాప్తి లేదు. వాటి పరామర్శ లేదు. పీఠాధి పతులు కూడ యతులే గాన పూజార్హులు. అటులనే సాధారణ యతులు కూడా పూజార్హులే- శ్రుతిస్మృతు లనాదులని గదా వైదికుల విశ్వాసము. అట్టి అనాదిత్వము పీఠముకు లేదు. దానికి చరిత్రే సాక్ష్యము. సన్న్యాము అనాది. పీఠములు నిన్న మొన్నటివి. పైనుదహరించిన వాక్యము లన్నియు పీఠములు పుట్టక పూర్వమునందున్నవే. శంకరులకు పూర్వమే గలవుగాన వాటిలో పీఠము లుండుటకు వీలులేదు. కనుక శాస్త్రప్రమాణము ననుసరించి యతులందరూ పూజార్హులే యని తెలియవలె. శంకరాచార్యులవారు పీఠములు ధర్మప్రచారమునకై స్థాపించిరనిగదా యందరి విశ్వాసము- వారు మొదట పీఠములు స్థాపించునపుడు ఆడంబరములు వాటికి అంటగట్టలేదనియు రాజమర్యాద లన్నియు, విద్యారణ్యస్వామి ఏర్పరచిరనియు పీఠ చరిత్రలు చెప్పుచున్నవి. బ్రహ్మవేత్తలైన విద్యారణ్యస్వామివారు స్థాపించిన వ్యవస్థయు శిరోధార్యమే. ఈనా డొక బ్రహ్మవేత్త క్రొత్తగా ధర్మప్రచారకేంద్రము స్థాపించిననూ ఆమోదించుట కర్హమైనదే. బ్రహ్మవేత్త లేది చసిననూ అది వారి కలంకారమే. దూష్యము కాదు.

శంకరజయంతి వంద సంవత్సరముక్రిందటి పంచాంగములలో కానరాదు. సుప్రసిద్ధపీఠాధిపతు లొకరు శంకర జయంతి చేయవలసిన దని ప్రచారము గావించి పంచాంగ కర్తలను ప్రోత్సహించి శంకరజయంతి వైశాఖశుద్ధపంచమి నాడు వ్రాయవలసినది శాసించిరి. జ్యోతిష్కులు (వారి యానతిని శిరసా వహించిరి. శంకరవిజయము లనేకములు గలవు. వాటిలో శంకరులవారి కాలము భిన్నభిన్నముగా నుండును. పీఠముల పరంపరలోకూడ నైకమత్యము లేదు. చరిత్ర సాక్ష్యము భిన్నముగా నున్నది. ఈవ్యతిరేకభావములతో జోక్యము లేకుండగనే శంకరజయంతి చేసుకొనవచ్చును. ఏదినమైననూ బాధ లేదు. బ్రహ్మవేత్తలు సర్వకాలములకు, సర్వదేశములకు చెందినవారు.

సాధారణరాజకీయనాయకుల జయంతులు, కవులు, గాయకులు, చిత్రకారులు ఇత్యాదికళాకారుల జయంతులు ప్రజానీకమున జరుగుచుండ వారందరి కన్నను అన్నివిధముల గొప్పవారైన శంకరభగవత్పాదుల జయంతి చేసికొనుటలో విశేషమైన ఔచిత్యము గలదని నేను భావింతును. పరిచ్ఛిన్నులైన జీవుల జయంతులకన్న దేశకాలవస్తుపరిచ్ఛేదరహితులైన బ్రహ్మవేత్తల జయంతి ఉత్కృష్టమైన దని యొప్పక తప్పదు.

శంకరభగవత్పాదులు పుట్టిన గ్రామందు (కాలటియందు ) వంద యేళ్ల క్రిందట వారి యాలయముగాని, చిహ్నములుగాని యేవియు లేకపోగా బ్రహ్మవేత్తలైన పీఠాధిపతులు అచ్చట ఆలయాదికము నెలకొల్పి దాని నొక తీర్థస్థానముగ తీర్చి దిద్దిన చర్యను ప్రశంసించక యుండగలమా! కనుక బ్రహ్మవేత్తలు చేసిన కార్యక్రమము లన్నియు ప్రశంసార్హములే- అది నాడైనను నైడైనను యొకటే.

శంకరభగవత్పాదులవారు ప్రస్థానత్రయమునకు భాష్యములు రచించి శంకరాచార్యులవారైరి. జగద్గురుస్థానము నలంకరించిరి. మూడవప్రస్థానమైన గీతాభాష్యభూమికయందే "తస్యాస్య గీతాశాస్త్రస్య సంక్షేపతః ప్రయోజనం పరం నిశ్శ్రేయసం- సహేతుకస్య సంసారస్య అత్యంతోపరమ లక్షణం తచ్చ సర్వకర్మసన్యాసపూర్వకాత్‌ ఆత్మజ్ఞాననిష్ఠా రూపాత్‌ ధర్మాత్‌ భవతి" అని సిద్ధాంతీకరించిరి. అనగా ఈగీతాశాస్త్రమునకు సంక్షేపముగా చెప్పిన మోక్షమే ప్రయోజనము. అయ్యది సర్వకర్మసన్న్యాసపూర్వకఆత్మజ్ఞాన నిష్ఠారూపమైన ధర్మమువలన కల్గుచున్నది. కేవలాత్మజ్ఞానము వలన కాదు. దీనికుపోద్బలకముగ అనుగీతలలోని భగవద్వచనములను 'జ్ఞానం సన్న్యాసలక్షణం'ఇత్యాదుల నుదహరించిరి. భూమికాంతమున 'సంసారబీజభూతౌ శోకమోహౌ తయోశ్చ సర్వకర్మసన్న్యాసపూర్వకా దాత్మజ్ఞానా న్నాన్యతో నివృత్తిః' సంసారమునకు శోకమోహములే బీజములు- వాటి, నివృత్త సర్వకర్మసన్న్యాసపూర్వకాత్మజ్ఞానమువలననేగాని ఇతరము వలన గాదు. అని నొక్కి వక్కాణించిరి.

వైదికధర్మరక్షణ కావలె ననిన బ్రాహ్మణత్వమును రక్షించవలె ననిరి. ఇచ్చట కూడ 'బ్రాహ్మణత్వస్య హి రక్షణ రక్షితః స్యాత్‌ వైదికో ధర్మః' అను వాక్యమున బ్రాహ్మణత్వశబ్దము కేవలజాతిపరముగాదు. బ్రాహ్మణుడుగా పుట్టినంతమాత్రమున మోక్ష మెవ్వరికిని సిద్ధించదు. బ్రాహ్మణ జాతిని కేవలము రక్షణ చేయుటవలన వైదికధర్మము పూర్తిగా రక్షింపబడదురు. కారణ మేమనగా వివరింపబడుచున్నది. శంకరభగవత్పాదుల యవతారమునకు పూర్వమందే కుమార స్వామి కుమారిలభట్టుగా నవతరించి అనేకకష్టములకు లోనై వైదికధర్మమును బౌద్ధధర్మమునుండి రక్షించెను. ధర్మమీ మాంసాసూత్రములకు, శాబర భాష్యమునకు వార్తికమములు రచించి తన శిష్యుడైన మండనమిత్రునకు తన సిద్ధాన్తమును బోధచేసి తాను తన శరీరమును తుషాగ్నిలో దహింపజేసుకొను సమయమున (ప్రయాగలో) శంకరాచార్యులవారు తమ భాష్యమును వారికి వినిపించి సవరణలను కోరగా అతడు తన శిష్యుడైన మండనమిశ్రునితో వాదము చేసి యభీష్టమును పొందు డనెను. శంకరవిజమున ఈగాధ అందరూ యెరిగినదే. శంకరభగవత్పాదులు నర్మాదాతీరము గల మాహిష్మ తీనగరమున కరిగి మండనమిశ్రుని భార్యయగు ఉభయభారతి మాధ్యస్థ్యమున కొప్పుకొని వాదించగా మండననుని మెడలో పుష్పమాలిక వాడిపోయి ఓటమిని తెలుపగా పణము ప్రకారము ఓడిపోయిన మండనునకు సన్యాస మిచ్చి సురేశ్వరాచార్యు లను నామ మిడిరి. ఇదియూ అంద రెరిగినదే. తాత్పర్యమేమన: సన్న్యాసరహితమైన కేవలవైదికధర్మ రక్షణమున బ్రాహ్మణత్వరక్షణ జరుగదు. సన్న్యాసమువలననే అది పూర్తిగా సంరక్షింపబడి శోభించు నని గ్రహించవలెను.

బ్రాహ్మణత్వము త్యాగశీలతయందే గలదు. ప్రత్యక్ష అనుమానముల ద్వారా తెలియని విషయములను చెప్పుట లోనే వేదమున గల వేదత్వమని యెట్లు అంగీకరించుచున్నారో యటులనే బ్రాహ్మణత్వమునకు గల ప్రత్యేకత సన్న్యాసమే . దానియందు ఇంకెవ్వరికీ అధికారము లేదు. శ్రీమద్భాగవతమున ఏకాదశస్కంధమందు-

'బ్రాహ్మణస్య హి దేహోయం క్షుద్రకామాయ నేష్యతే|

కృచ్ఛ్రాయ తపసే చేహ ప్రేత్యానంతసుఖాయ చ |'

ఈ బ్రాహ్మణ శరీరము క్షుద్రములైన భోగముల ననుభవించుటకు పుట్టలేదు. మరేమని కృచ్ఛ్రచాంద్రాయణాది తపస్సులు చేయుటకు, మరణానంతరము (అనంతసుఖము) మోక్షము పొందుటకు ప్రాప్తించినది. గాన బ్రాహ్మణత్వము సన్న్యసించి మోక్షము పొందుటలో సార్థక మగుచున్నది. బ్రాహ్మణునకు ప్రత్యేకాధికారము గల సంన్యాసాశ్రమమును రక్షించి పోషించిన బ్రాహ్మణత్వము రక్షించినట్లగును. అర్థ కామసంపాదనలో బ్రాహ్మణత్వము రక్షించినట్లగును. అర్థ కామసంపాదనలో బ్రాహ్మణత్వము లేదు. అది అందరూ అన్ని దేశములలోను చేయుచునే యున్నారు. మోక్షమును సాధించుటలోనే బ్రాహ్మణత్వము గలదు.

ఎవరైన స్వాములవారిని దర్శించునపుడు ఈమంత్రమును పఠించి నమస్కరించుట యాచారము.

'న కర్మణా న ప్రజయా ధనేన త్యాగే నైకే7మృతత్వ మానశుః | పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశన్తి||'

తా|| కర్మచేతనుగాని, గృహస్థాశ్రమము నిర్వహించుచూ సంతానము కలిగియున్నందువలనగాని, దానాదుల కుపకరించు ధనముచేత గాని మోక్షసుఖమును పొందలేరు. కేవలత్యాగముద్వారా సన్న్యాసముద్వారాగానే ఎవరో కొంతమంది మాత్రమే పొందగలిగిరి. ఆయమృతత్వము స్వర్గము కన్న యుత్కృష్టమైనది. అది తన బుద్ధిగుహయందే విశేషముగ ప్రకాశించుచున్నది.

కుమారిలభట్టువంటి మహావిద్వాంసుడుకూడ ఈ సన్న్యాసవిషయమున పొరబాటు అభిప్రాయములను వెల్లడించెను. అతడు పూర్వమిమాంసాశాస్త్రమునకు వార్తిక కారుడే యైనను సన్న్యాసాశ్రమమును సరిగా అర్థము చేసి కొనలేదు. అతడు తన వార్తికములలో సన్న్యాసాశ్రమము కుంటివారికి, గ్రుడ్డివారికి, అంగవికలులకేగాని ఆరోగ్యముగా కర్మ నిర్వహించగలవారికి కాదని వ్రాసెను.

శ్లో || 'తత్రైవం శక్యతే వక్తుం యే7న్ధపంగ్వాదయో నరాః |

గృహస్థత్వం న శక్ష్యంతి కర్తుం తేషా మయం విధిః |

నైష్ఠికం బ్రహ్మచర్యం వా పారివ్రాజ్యకతాపి వా|

తై రవశ్యం గృహీతవ్యా తేనాదా వేత దుచ్యతే||'

ఈ వారిక్తములు పూర్తిగ శాస్త్రవిరుద్ధములు. సన్న్యాసగ్రహణమునకు అంగవైకల్యముగలవారు అసలే అధికారులు కారు. నారదపరివ్రాజకోపనిషత్తులో అనధికారులు పేర్కొన బడిరి. వారికి ఇది నిషిద్ధము. శుకునకు, నారదదత్తాత్రేయాదులకు అంగవైకల్య మేది, ఇట్టి పొరబాటును సవరణ చేయుటకే శంకరులవారి యవతారము. కుమారిలభట్టు శిష్యుడైన మండనమిశ్రునకే వాదమున జయించి సన్న్యాసమిచ్చి భట్టపాదుని వార్తికములు తప్పుత్రోవను ప్రవర్తించిన వని ఆచరణ రూపమునకూడ నిరూపించిరి. కనుక సన్న్యాసాశ్రమరక్షణమే బ్రాహ్మణత్వరక్షణ మని, భగవత్పాదుల యభిప్రాయ మని గ్రహించవలయును.

వేదరక్షణకు, వేదార్థనిర్ణయమునకు పూర్వమీమాంసాశాస్త్రము ప్రవర్తించియే యున్నది. 'అథాతో ధర్మజిజ్ఞాసా'యని ధర్మమీమాంస చేసియే యున్నది. దానితోనే వేదార్థము పర్యవసాయన మైనచో వ్యాసులవారు బ్రహ్మసూత్ర రచనకు (గడంగియే యుండరు) ప్రవృత్తులు కావలసిన పనియే లేదు. పూర్వమీమాంశాస్త్రముద్వారా వేదార్థమును పూర్తిగా సరియయిన పద్ధతిలో నిర్ణయించుట కవకాశము లేదని గ్రహించియే వ్యాసులవారు బ్రహ్మమీమాంస కుపక్రమించిరి. శంకరభగవత్పాదులవారు కూడ కుమారిలభట్టు వ్రాసిన వార్తి కములను గౌరవించి 'వ్యవహారే భాట్టనయః' వ్యవహారమందు భట్టసిద్ధాంతమే యనుసరణీయమని నుడువుచూ ఉపనిషదర్ధనిర్ణయమున మాత్రము పూర్వమీమాంసాపద్ధతి చాలదని సవరించిరి. భాష్యమున 'యద్యపి అన్యత్ర వేదవాక్యానాం విధిసంస్పర్శ మంతరేణ ప్రమాణత్వం నదృష్టం, తథాపి ఆత్మవిజ్ఞానస్య ఫలపర్యంతత్వాత్‌ న తద్విష యస్య శాస్త్రస్య ప్రామాణ్యం శక్యం ప్రత్యాఖ్యాతుమ్‌' అని నుడివిరి. సన్యాసాశ్రమవిషయకవార్తికములు శాస్త్రవిరుద్ధములు గాన నుపేక్షింపదగినవి. శంకరులవారికిగాని, మండనమిశ్రునకుగాని యెట్టి అంగవైకల్యము గలదని వినము గదా! వ్యాసులవారు శుకమహర్షిని భాగవతమున అత్యంత సుందరముగా వర్ణించిరి. ఆతని కే యంగవైకల్యము లేనే లేదు. నాటినుండి నేటివరకు శంకరభగవత్పాదులవారు స్థాపించిన పీఠములందు అనేకమంది సన్న్యాసు లధిష్ఠించుచూ వచ్చుచున్నారు. వారిలో యెవరికినీ అంగవైకల్యమున్నటుల మనకు తెలియరాదే. కనుక అంగవికలులు గృహస్థాశ్రమనిర్వహణాసమర్థులు. కాన సన్న్యాసాశ్రమము గ్రహించవలె నను భట్టపాదుని భావములు శాస్త్రసమ్మతములు గావు. అనుభవ సమ్మతములును గావు.

భారతీయసంస్కృతిలో వ్యక్తి యెంత గొప్పవాడైనను శాస్త్రవిరుద్ధముగ మాటాడిన యావిరుద్ధాంశమును సవరింతురు. విరుద్ధము కాని మాటలను యనుసరింతురు. అట్టి సమరణ వ్యాసులవారికే జరిగినది. ఇంక తక్కినవారి మాట లెక్కయేమి. భాగవతమందుకే పుట్టినది. సాధారణముగ లోకమున యతీశ్వరుల నెందుకు పూజించవలెను? వారి గొప్పతనమేమి? వారునూ మనవంటి మానవులే కదా? ఏదో భిక్ష సరిపోదా? వారునూ మనవలెనె భోజనము చేయుదురు మనవలెన విణ్మూత్రములు విడుతురు. వారియింద్రియవ్యాసారము లన్నియు మనవలెనే యుండును. మరి వారి నెందుకు పూజించవలెను. అని కొంటివాదముతో అపప్రథ కొంత లోకమున వ్యాప్తి చెందియున్నది. సాలగ్రామాదిశిలలతో నున్న దేవతార్చన చేయుదురుగాని యతీశ్వరులను పూజచెయ్యరు. తద్దినంభోక్తలకు కాళ్ళు కడుగుదురుకాని యతీశ్వరులను ముట్టుకొనరాదని వారిలో వారే కల్పించుకొని తృప్తిపడుచుందురు. కాని ఈభావములకు శాస్త్రసమ్మతి లేదు. ఈ భావముల నన్నిటిని శాస్త్రము గర్హించును.

యతీశ్వరులను స్పృశించిన మహాఫలము. లోకమున మిడిమిడి జ్ఞానము గల పండితమ్మన్యులు తాము స్వయముగా శాస్త్రమును పెద్దవలన శ్రవణముచేయక, అక్కడాఇక్కడా ఏవో నాలుగు ముక్కలు విని శ్రుతపాండిత్యబలమున ఏదో వాగుచుందురు. అదియే ధర్మప్రచార మని వారనుకొను చుందురు. అట్టి జ్ఞానలవదుర్విదగ్ధులవలననే ధర్మప్రచారము కన్న అధర్మప్రచారమే యెక్కువగా సాగుచున్నది. ఒకటిన్నర కావ్యాలు చదివి పండితుడుగా చెలామణి యగు వ్యక్తి యతీశ్వరుల ధర్మము లన్నియు తనకే తెలిసినట్టు నటించుచూ శాస్త్రవిరుద్ధ విషయములనే ప్రచారముచేయుచుండును Half knowledge is dangerous అను సామెతను (మిడిమిడి జ్ఞానము చాల అపాయకరము) సార్థకపరచుచు వీరే వైదికధర్మవృక్షమునకు వేరుపురుగులుగా నున్నారు. మానవసమాజము వీరి వలననే అపమార్గము పట్టిపోవుచున్నది. యత్యాశ్రమముపై వీరు దాడి వెడలి 'యతీశ్వరులను యెవ్వరూ తాకరాదు. దూరము నుండియే నమస్కరించవలెను.' అని ప్రచారము గావించిరి. ఈప్రతిపాదన శాస్త్రమునకు పూర్తిగా విరుద్ధము. యతీశ్వరులు అనుమతి యివ్వనిచో తాకరాదుగాని శాస్త్రము మాత్రము వారిని తాకవచ్చు ననియే చెప్పుచున్నది. అనగా మడిలేక పవిత్రత లేనిచో తాకరాదు. ఉచితసమయమున పవిత్రతతో తాకవచ్చును. యతీశ్వరులను స్పృశించవచ్చుననుటలో శాస్త్రప్రమాణవచనము లిట్లున్నవి.

'దర్సనాత్‌ స్పర్శనా త్తస్య సర్వం నశ్యతి పాతకమ్‌|

తస్మా త్సర్వేషు కాలేషు పూజ్యః సన్న్యాస మాశ్రితః |' (సూ. సం. 78)

యతీశ్వరులను దర్శించుటవలన, స్పృశించుటవలన సమస్తపాతకములు నశించుచున్నవి. కనుక సర్వకాలములందు సన్న్యాసాశ్రమము స్వీకరించిన యతీశ్వరులు పూజించదగిన వారు (పూజావివరణ అన్యత్ర గలదు)

సూతసంహితను 18 సార్లు పారాయణ చేసి శంకరాచార్యులవారు భాష్యములు రచించి రవి ప్రవాదము గలదు. దీనికి విద్వారణ్యస్వామి వ్యాఖ్యకూడ గలదు. కనుకపరమప్రామాణమైన గ్రంధము- ఇంకను అనేక ప్రమాణములు గలవు.

'సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనమ్‌|

సంభాషణం కోటితీర్థం వందనం మోక్షదాయకమ్‌|'

సాధువులనగా ముఖ్యార్థమున సన్న్యాసులో ('సాధవోన్యాసినః శాంతాః బ్రహ్మిష్ఠాః లోకపావనాః' (భాగవతం 9-9-6) హరంత్యఘం తే7ఙ్గసంగాత్‌ తేష్వాస్తే హ్యఘభిద్ధరిః) వీధిలో తిరుగు కాషాయవేషము ధరించువారు కారు. శాస్త్రీయమైన పద్ధతిలో దండగ్రహణము చేసినవారే అసలైన సాధువులు. తక్కినవారు గౌణసాధువులు. యతీశ్వరుల దర్శనమువల పుణ్యము కలుగును. స్పృశించిన పాపము నశించును. వారితో సంభాషణ జరిపిన కోటితీర్థములందు స్నానము చేసిన ఫలము కలుగును. వందనము చేసిన మోక్షము నివ్వగలదు.

'దర్శనాత్‌ స్పర్శనా చ్చైవ భాషణా దర్చనా ద్యతేః |

తత్‌ క్షణా దేవ పూతః స్యాత్‌ కాశ్యాం గంగోదకే యదా || (గీతామాహాత్మే)

యతీశ్వరులను దర్శించుటవలన, తాకుటవలన, వారితో సంభాషించుటవలన, వారిని పూజించుటవలన తత్‌ క్షణమే పవిత్రుడగును. కాశీనగరము గంగలో మునిగిన వెంటనే పవిత్రుడగునటులే వారు పవిత్రులగుదురు.

యథా లోకే యతిం స్పృష్ట్వా దృష్ట్వా చైవ మనశ్శుచిః |

శాస్త్రమధ్యె తథా గీతాం దృష్ట్వా స్పృష్ట్వా మనశ్శుచిః ||

లోకమునందు యతీశ్వరులను స్పృశించి దర్శించి మనోనైర్మల్యమును పొందినటులే శాస్త్రములలో భగవద్గీతనుతాకి దర్శించి మనశ్శుద్ధిని పొందును.

'సన్న్యాసినశ్చ స్పర్శేన నిష్పాపో జాయతే నరః |

భుక్త్వా సన్న్యాసినం లోకా శ్చాశ్వమేధఫలం లభేత్‌||

నత్వా చ కామతో దృష్ట్వా రాజసూయఫలం లభేత్‌|'

సన్న్యాసుల స్పర్శవలన నరుడు పాపరహితు డగును. వారికి భిక్ష పెట్టిన అశ్వమేధయాగము చేసిన ఫలము కలుగును. వారికి నమస్కరించి కామముతో చూచిన రాజసూయ యాగము చేసిన ఫలమును పొందుచున్నాడు.

శ్రీమద్భాగవతమున పరీక్షిన్మహారాజు శాపవశమున ప్రాయోపవేశము చేసి గంగాతీరమున నున్న సమయమున అతని యదృష్టముకొలది శ్రీశుకయోగీంద్రుడు యాదృచ్ఛికముగ అచటికి వచ్చెను. అప్పుడు పరీక్షిన్మహారాజు

'అహో అద్య వయం బ్రహ్మన్‌ సత్సేవ్యాః క్షత్రబంధవః |

కృపయా7తిధిపేణ భవద్భిః తీర్థకాః కృతాః || 34

యేషాం సంస్మరణాత్పుంసాం సద్యః శుద్ధ్యంతి వైగృహాః |

కింపున ర్దర్శనస్పర్శ పాదశౌచాసనాదిభిః ||' (1-19-35)

బ్రహ్మవిద్వరిష్ఠా! శుకయోగీంద్రా! నేడు నాభాగ్యమేమని చెప్పుదును. బ్రాహ్మణశాపదగ్ధుడ నైన నాబోటి క్షత్రబంధువునకు నేడుగదా సత్పురుషుల సేవించు యోగ్యత గలిగినది. తమరు దయ తలచి అతిథి రూపమున దయచేసి నన్ను పవిత్రునిగా జేసితిరి. తమబోటి మహాత్ముల సంస్మరమ మాత్రమున గేస్తుల గృహముల పవిత్రము లగుచున్నవి. ఇక వారి దర్శనమున స్పర్శమున పాదప్రక్షాలనమున ఆనినదానాది కముచే పావనము లగు నని వేరె చెప్పవలయునా!

'సన్న్యాసినః పదస్పర్శాత్‌ సద్యః పూతా వసుంధరా |

సద్యః పూతాని తీర్థాని వైష్ణవస్య యధా వ్రజః ||'

పరివ్రాజకుల పాదస్పర్శవలన పృథివి పవిత్ర మగుచున్నది. తీర్థములు పవిత్రము లగుచున్నవి. ప్రజభూమి వైష్ణవునివలన పవిత్రమైనట్లు.

'తత్రోపజగ్ముః భువనం పునానా,

మహానుభావా మునయ స్స శిష్యాః |

ప్రాయేణ తీర్థాభిగమాపదేశైః ,

స్వయం హి తీర్థాని పునంతి సంతః ||'

తా || పరీక్షిన్మహారాజు ప్రాయోపవేశము చేసిన స్థలమునకు మహానుభావులైన మునులు అనేకమంది శిష్యసహితులై భూమిని పవిత్రముచేయుచూ వచ్చిరి. సాధారణముగ తీర్థాటన మను మిష యొకటి కల్పించుకొని తీర్థములను పవిత్రము చేయుటకే వారు సంచారము చేయుచుందురు. వారు తీర్థము లందు స్నానమాడి వాటిని పావనములుగా జేతురుగాని వారు పవిత్రులగుటకు గాదు. వారు నిత్యపవిత్రులు. (ఇక ముందు చాల ప్రమాణములు వచ్చును)

కపిల మహర్షి విషయమున యపరాధ మొనరించి దగ్ధులైన అరువదిఆరువేలమంది సగరపుత్రులను తరింపజేయుటకు ఆవంశమున చాలమంది ప్రయత్నించిరి. అందు భగీరథుడు విశేషముగ తపమాచరించగా గంగాదేవి ప్రత్యక్షమై-

కించాహం న భువం యాస్యెనరా మయ్యామృజం త్యఘం |

మృజామి తదఘం కుత్ర రాజన్‌ తత్ర విచింత్యతాం|| (9-9-5 భాగ)

భగీరథమహారాజా! నేను భూమిమీదకు రాదలచలేదు. కారణమేమన: మానవు లందరూ తమ పాపమును నాయందు కడుగుదురు. ఆమాలిన్యమును నేనచ్చట శోధించుకొందును. ఈ విషయమున నీవే ఆలోచించుము. అంత భగీరథుడు-

భగీరథుడు--

'సాధవో న్యాసినః శాంతాః బ్రహ్మిష్ఠాః లోకపావనాః |

హరం త్యఘం తే7ంగసంగాత్‌ తేష్వాస్తే హ్యఘభి ద్ధరిః |'

తా|| సాధువులు, సన్న్యాసులు, శాంతస్వభావులు, బ్రహ్మనిష్ఠులు-సమస్తలోకములను పవిత్రము చేయుచుందురు. వారిశరీరస్పర్శవలన నీపాపములు హరించుకొనిపోవును. వారి హృదయములందు భగవంతుడు విరాజిల్లియుండును. అతడును నీపాపములు పోగొట్టగలడు. ఈ విధముగా సన్న్యాసుల స్పర్శవలన పవిత్రత గలుగును. పాపములు నశించును. అని శాస్త్రము చెప్పుచుండ యతుల స్పృశించరాదని ప్రచారము చేయువారు తుచ్ఛులుగ పరిణింపబడుదురు.

పీఠాధిపతులవద్దకు జనసమాజము అధికముగ వచ్చును గాన అందరూ పాదములనంటి నమస్కరించుటకు ప్రయత్నించిన తొడితొక్కిడి యెక్కు వగును. అందరికీ దెబ్బలు తగులును. గాన వ్యవహారసౌకర్యార్థము ముట్టుకొనరాదని ప్రచారము సాగినను ఏకాంతమున వారిని స్పృశించి నమస్కరించవచ్చును. అది శాస్త్రవిహితమేగాని, నిషిద్దముమాత్రము గాదు. స్పృశించవచ్చుగదా యని- మడిలేనివారు, వారియనుమతిని పొందని వారు స్పృశించరాదు. మడితో పవిత్రమైనవారు వారి యనుమతిని పొంది స్పృశించిన మహాఫలము గలదు- సందేహము లేదు. స్త్రీలు, పురుషులు, బాలురు, వృద్ధులు, యవతులు యువకులు అందరూ తాకవచ్చు. భక్తి యుండవలెను.

వాస్తవమున స్పృశించకుండ చేయు వందనము వందినమే కాదు. నేను యావద్భారతదేశమున గల సాధువులను సన్న్యాసులను చూచితిని. ఎచ్చటను స్త్రీలుగాని, పురుషులు గాని, యతులను స్పృశించరా దను నియమము చూడలేదు. కాని కూపస్థమండూకములవలెనుండు దేవానాంప్రియులే యట్టి ప్రచారము గావించి స్పృశించదలచువారి కడ్డు తగులు చుందురు. రాత్రిందివములందు సన్న్యాసుల సేవ జేయు గృహస్థులను అనేకమందిని నేను చూచియున్నాను. ఆంధ్రదేశమున దేవకీనందనస్వామికి అనేకమంది స్త్రీలు, పురుషులు శిష్యులు గలరు. వారందరూ రాత్రి వారి పాదసేవ చేయువారే. పగలు స్నానాదులు చేయువారే. నెలల తరబడి వారి యాశ్రమమున పడియుండి స్త్రీలు వారి సేవ చేయుచునే యుందురు. ఆసేవచేయువారుగాని, ఆసేవను పొందు స్వామివారుగాని దోష భాక్కులు గారు గాని వారిని యాక్షేపించువారు మాత్రము పరమపాపాత్ములు. గృహస్థులకు యత్యాశ్రమసంరక్షణము అవశ్యకర్తవ్య మని శాస్త్రము విధించుచున్నది.

'దయాం సర్వేషు భూతేషు కుర్యా ద్గార్హస్థ్య మాశ్రితః |

యతిసంరక్షణం కుర్యా దన్న పానాదిభి స్సదా ||'

(జ్ఞాన 4-15)

'యతిశ్చ బ్రహ్మచారీ చ పక్వాన్న స్వామినా వుభౌ |

తయో రన్న మదత్వా తు భక్త్వా చాంద్రాయణం చరేత్‌||' 16

తా || గృహస్థాశ్రమమందుండువాడు అన్ని ప్రాణుల యందు దయ గలిగి యుండవలెను. అన్న సానాదులచే యతిసంరక్షణము చేయవలెను యతికి, బ్రహ్మచారికి వండుకోనుటకు ముడి పదార్థముల నిత్తుమనరాదు- సిద్ధాన్నమునే వారికి పెట్టవలయును. వారు ప్రాప్తించునపుడు వారికి అన్నము పెట్టకతాను తినిన మహాపాపాత్ము డగును. ఆపాపము చాంద్రయణవ్రతము చేసినగాని పోదు.

యతులకు భిక్ష పెట్టిన నేమి ఫలమని కొందరడుగుదురు. దానికి సమాధాన మీక్రింది శ్లోకములలో గలదు.

'యతి ర్యస్య గృహే భుంక్తే తస్య భుంక్తే హరిః స్వయమ్‌

హరి ర్యస్య గృహే భుంక్తే తస్య భుంక్తే జగత్తయః ||'

యతీశ్వరుడు యెవరియింట భిక్షచేయుచున్నాడో వారియింట సాక్షాత్‌ శ్రీమహావిష్ణువు భుజించినట్లు భావించవలెను. శ్రీహరి యెవరి యింట్లో తినునో దానివలనను మూడులోకములు తిననట్లే. అనగా యతీశ్వరుని భిక్షవలన మూడు లోకములందలి ప్రాణికోటి యంతయు తృప్తి పడుచున్నది.

శాస్త్రపరిజ్ఞానశూన్యులు ఏమాట మాటాడినను అవకతవకగా యుండును, వారు యతీశ్వరులపై శ్రద్ధ ప్రదర్శించుటకూడ అవమానముగానే యుండును. వారివద్ద పరిమితమైన భాష యుండును. ఆభాషలోనే అన్ని విషయముల నిమిడ్చి చెప్పుటకు ప్రయత్నింతురు. వారిమాటలలోనే వారికి శాస్త్రీయపరిజ్ఞానము లేదని తేలిపోవుచుండును. ఉదాహరణకు ఒక్క యతికి భిక్షపెట్టిన వందమంది బ్రాహ్మణులకు భోజనముపెట్టిన ఫలము వచ్చు నని యొక డనిన, ఇంకొకడు వెయ్యి మందికి పెట్టిన ఫల మనును. వేరొకడు లక్షమందికి అన్నదానం చేసిన ఫలము ఒక్కసన్న్యాసికి భిక్షపెట్టిన కలుగుననును. మరియొకడు కోటిమందిదాకా ప్రాకును. వీరందరూ శాస్త్ర పరిజ్ఞానశూన్యులే. వారు వాడిన వాక్యరచన శాస్త్రసమ్మతము కానే కాదు. శాస్త్రీయమైన భాష యెటులున్నదో చూడుడు.

'యతిహస్తే జలం దద్యాత్‌ పునర్జలమ్‌|

త ద్భైక్షం మేరుణా తుల్యం తజ్జలం సాగరోపమమ్‌ |

(సూ|| సం 4-1)

సాంప్రదాయసిద్ధమైన భిక్షలో యతీశ్వరుల చేతిలో మొదట హస్తోదకము నిచ్చి స్ధలశుద్ధి చేసినతరువాత పత్రశోధనము చేయబడును. తరువాత భిక్ష వడ్డింతురు. తరువాత మరల హస్తోదకము. ఈవిధమున క్రమము తప్పకుండునట్లు చేయుదురు. మేరుపర్వత మంత యన్నరాశిని దానము చేసిన ఫలము అభిక్షాదానమువలన కలుగుచున్నది. వారి చేతియందుంచిన జలము సాగరముతో సమానమైనది. ఎన్ని దానములు చేసిన జలధార సాగరమంత యగునో అంత యన్నమాట.

'యతిర్యస్య గృహే భుంక్తె తస్య భుంక్తె జగత్త్రయం'

అను శ్లోకమున మూడులోకము లందలి ప్రాణికోటిని ఎన్ని కోటులనిన సరిపోవును. కనుక పామరులు వాడు భాష పరిమిత మైనది- భావశుద్ధి లేనిది.

ప్రపంచ మంతయు భావనామయము- మానవుని యోగ్యత అతని భావపరంపరవలననే ప్రస్పుటిత మగును. ఉన్నతమైన భావములు కలిగియుండవలెనవి యందరూ వప్పుకొందరు. విశాలమైన భావము లుండవలెనందురు. మనసులో పాలు త్రాగుటకు వెండిగిన్నెకన్న బంగారుగిన్నె నయము కాదా గీతలో 'యో యచ్ఛ్రద్ధస్స ఏవ సః'- ఎవనికి యెట్టి శ్రద్ధయుండునో అత డాశ్రద్ధాస్వరూపుడే. 'క్రతుమయోయం పురుషః' అని యుపనిషద్వాణి- పురుషుడు సంకల్పమయుడు. ఆధునికులు కొన్ని భావముల సంపుటియే మానవు డందురు. శాస్త్రము మానవునకు విశాలదృక్పధమును అలవరచును. 'యదేవ విద్యయా కరోతి తదేవ వీర్యవత్తరం భవతి' యేది తెలిసి (గొప్పతనము) చేయుదురో ఆ కర్మకు ఫల మధికము శాస్త్రప్రమాణముద్వారా తెలిసిన భావములను అనుసంధానము చేయుచూ భిక్ష చేసిన అధికఫలము. భావమునకు భౌతిక మైన మదుపు లేవియూ అవసరము లేదుకదా. శాస్త్రము కూడా ఊరక వాగలేదు. ' బ్రాహ్మవిద్బ్రహ్మైవ భవతి' అను సిద్ధాంతరీత్యా బ్రహ్మవేత్తయైన యతి ప్రపంచ మంతయు తన యందే పుట్టి లయించుచున్న దని యనుసంధానము చేయును. కనుక అతడు తృప్తుడైన మూడు లోకములు తృప్త మైనటులే.

పామరుని భాషలో వంద, వెయ్యి, లక్ష, కోటి యని యెంత రెట్టించుకుపోయినను మూడులోకములందలి అనంతమైన జీవరాశి రాదు. వాస్తవమున పామరుని భాష ప్రశంసారూపమున లేదు. ఒక కోటీశ్వరుని చూపి ఇతడు లక్షాధికారి యనిన ప్రశంసక్రింద చేరదు. 'శ##తే పంచా' శన్న్యాయమున అతని వద్ద లక్షలేవని కాదు. ఇంకా అధికముగానే గలదు. ఆ ఆధిక్యతకు న్యూనత వచ్చును. నిందతో సమానముగ నుండును. పామరునిబుద్ధి అంతవరకే ఊహించగలదు. అతని బుద్ధి శాస్త్రముచే సంస్కారము పొందలేదని తెలియును. హనుమంతుని భాషలో త్రయీవిద్యకు చెందిన సంస్కారములు వేదాంగ నిష్ణాతత్వము గోచరించినటులనే పామరుని భాషలో శాస్త్ర సంస్కారశూన్యత కొట్టవచ్చినట్లు గోచరించును. ఇది వ్యతిరేకో దాహరణము.

యతిభిక్షాప్రశంస అనేకవిధముల చేయబడినది. భిక్ష చెయ్యనివారిని నిందించినది. ప్రమాణశ్లోకములివిగో-

'యతిభ్య శ్ర్శద్ధయా దద్యాత్‌ భిక్షాం పాత్రప్రపూరణీమ్‌|

న క్షీయతే చ తత్తస్య కల్పకోటిశ##తై రపి"

యతీశ్వరులకు శ్రద్ధతో భిక్షాపాత్ర నిండుగా కడుపు నిండుగా భిక్ష పెట్టవలెను. ఆభిక్షాదానపుణ్యము శతకోటి కల్పములకైననూ క్షీణించదు.

'భిక్షాకాలే యతి ర్యస్య గృహం ప్రాప్తో యదా భ##వేత్‌ |

దేయా స్సర్వే రసాః స్తసై#్మ ఆత్మన శ్శుబ మిచ్ఛతా||'

భిక్షాసమయమున యతీశ్వరుడు తన యింటికి రాగానే సర్వరసవర్గముతో అనగా అన్ని రుచులతో కూడిన యాహారమును అతనికి పెట్టవలెను. ఆత్మశ్రేయస్సును కోరు గేస్తు యతనికి భిక్ష లేదన రాదు.

'పూరయత్వా హవిష్యేణ యతయే యః ప్రయచ్ఛతి |

పాత్రం స ఉద్ధరే త్పూర్వానపి యే నరకాశ్రితాః |'

పవిత్రమైన యాహారముతో యతీశ్వరుని పాత్రను నింపి యెవడిచ్చుచున్నాడో యతడు నరకమందు బాధపడుచున్న తన పూర్వపురుషులనుకూడ ఉద్ధరించుచున్నాడు.

'యవన్తి యతిపాత్రాణి యావ చ్ఛాన్నం ప్రయచ్ఛతి|

తావ ద్వర్షసహస్రాణి స్వర్గే లోకే మహీయతే||'

యతీశ్వరులకు యెన్ని సార్లు భిక్ష పెట్టుచున్నాడో, లేక అతని భిక్షలో అన్న మందెన్ని మెతుకులు గలవో అన్ని వేల సంవత్సరములు స్వర్గలోకమున సుఖమును పొందును.

'పూజయిత్వా యతిం భక్త్యా నిర్వికల్పో భ##వే న్నరః |

తతో భిక్షాం ప్రయచ్ఛే ద్యః స్వాత్మనా శుభ హేతునా|'

యతీశ్వరులను మొదట పుజ చేసి తరువాత భిక్ష పెట్టుటయే తన శుభమునకు హేతువు. అట్టి నరుడు పరమాత్మలో నైక్య మగుచున్నాడు. అనగా మోక్షమును పొందుచున్నాడు.

'నక్రియా గోత్ర మాచారం శౌచాశౌచం శుభాశుభమ్‌,

పృచ్ఛే న్మాధుకరాయతే కులం శీలం శ్రుతం యతేః |

పృష్ట్వా యతిం యో యచ్ఛేద్వా నరకానేవ కేవలాన్‌,

పశ్యేత్‌ స జ్ఞాతిభి స్సాకం అన్యధా స్వర్గతో భ##వేత్‌ |'

మధుకరమునకు వచ్చిన యతిని గోత్రాదులు, ఏపీఠానకి చెందినవారు? 'మీరేమి పని చేస్తూవుంటారండీ' 'మీ యాచార మేమి' 'స్నానం చేశారా' 'మడికట్టినారా' 'మైల బట్టలతోనే వచ్చినారేమి? స్వాములవారికి ఆచారమే లేదు. మడి మైల విభాగమే లేదు' అని ఇత్యాదిగా నేమియు అడుగరాదు. వారి శుభాశుభములను, కులమును (ఆచార్యకులము, గురువు పేరు) శీలమును వారి విద్యాయోగ్యతలను గూర్చి ప్రశ్నించరాదు.అట్లు ప్రశ్నించి భిక్షపెట్టినచో యతడు తన జ్ఞాతివర్గముతోసహా నరకమున బడుచున్నాడు. ప్రశ్నించక భిక్ష పెట్టిన స్వర్గమును పొందుచున్నాడు.

'యతి ర్యోగీ బ్రహ్మచారీ శతాయు స్సత్యవా క్సతీ |

సత్రీ వదాన్య శ్శూరశ్చ స్మృతాః శ్శుద్ధాశ్చ తే సదా ||'

యతీశ్వరులు, యోగి, బ్రహ్మచారి, శతవృద్ధు (సహస్రమాసజీవి) సత్యవాక్యపరిపాలకుడు, పతివ్రతయైన స్త్రీ- సత్రయాగము చేయువాడు, దానశీలుడు. శూరుడు వీరందరూ నిత్యమూ పవిత్రులే. గాన యతులను స్నానముచేసినారా యని యడుగరాదు. 'కాషాయం సర్వదా శుచిః' యనుసూక్తి ననుసరించి యతులు ధరించునట్టి కాషాయవస్త్రములు, శాటీలు ఎల్లప్పుడూ పవిత్రమైనవే. వాటికి మైల లేదు. పట్టు బట్టలకన్న - ధావళికన్న మడివే. పవిత్రతమములు - యతులకు గృహస్థులకువలె జాతాశౌచమృతాశౌచాదులు లేవు. వారు నిత్య పవిత్రులు. వారి మడి యాక్షేపించు వారికి శాస్త్రమర్యాద తెలియదని యర్థము.

'తథైవ చ గృహస్థస్య నిరాశో భిక్షుకో వ్రజేత్‌ |

ఇష్టం దత్తం తపో7ధీతం సర్వ మాదాయ గచ్ఛతి||'

ఏ గృహస్థుని యింటినుండి యతీశ్వరుడు నిరాశ జెంది వెడలునో ఆ గృహస్థు అదివరకు చేసిన యాగపుణ్యము, దాన పుణ్యము- తపస్సుచేసిన పుణ్యము, వేదాధ్యయనఫలము, ఆర్ష గ్రంథపారాయణపుణ్యము అంతయూ మూట కట్టి తీసికొని పోవుచున్నాడు కనుక యతిని తృప్తి పరచి పంపవలెను.

అత్రిః --

'భిక్షాం సత్కృత్య యోదద్యాత్‌ విష్ణురూపాయ భిక్షవే |

కృత్స్నాం వా పృథివీం దద్యాత్‌ తేన తుల్యం న తత్ఫలమ్‌||'

శ్రీమహావిష్ణుస్వరూపుడైన యతిని సత్కరించి పూజించి యెవడు భిక్షపెట్టునో అతడు ఈభూమండలమంతటిని భూదానముచేసినను అంతఫలము పొందలేడు. ఆరెండునూ సమానములు గావు. యతిభిక్షయే గొప్పది.

'కాలే వా యది వా7కాలే శ్రాద్ధం కుర్యా దతంద్రితః |

పితౄణాం తృప్తి కామ స్తు యతీన్‌ ప్రార్థ్య ద్విజోత్తమః ||'

శ్రాద్ధకాలమందు యతీశ్వరులు ప్రాప్తించినను, లేక అకాలమందు దొరికను పితృదేవతాతృప్తి కొరకు శ్రాద్ధక్రియను జరుపవలెను. అనగా పితృదేవతాతృప్తికొరకు యతికి భిక్ష పెట్టుచున్నా మని భావించవలెను. పితృకార్యములందు భోక్తల పంక్తిని యజమానుడు కూర్చొనడు వారి భోజనమైన తరువాతనే తాను తినును. అటులనే యతీశ్వరుల భిక్షయైన తరువాతనే యజమాని తినవలెను. యతులతో సపంక్తిని తినగోరువాడు శ్రద్ధారహితు డని తెలియవలెను. యతులు, గృహస్థులయిండ్లకు వచ్చినపుడు వారెటుల చెప్పిన యుటలనే నడతురు. వారి దేమియు పోదు. గాని గేస్తు తాను చేసిన పనికి పూర్తిగా ఫలము పొందినవాడగును. తద్దినంభోక్తకు యిచ్చిన విలువకూడ యతీశ్వరుని కివ్వనివాడు యేపాటి శ్రద్ధావంతుడగును. దానివలన గృహస్థుకే నష్టము ఫాసు మార్కులు రావన్నమాట.

శిష్టసంప్రదాయమున యతీశ్వరుల భిక్షలో మాషచక్రములు, క్షీరాన్నము చేయుట పితృదేవతలతృప్తికొరకే. యతీశ్వరుల భిక్ష చేయునపుడు గృహస్థులు బద్ధకించరాదు. అలసుడు కారాదు. కొంతమంది పిండివంటలు చేతురుగాని ఒక్క కూర మాత్రమే వండుదురు. ఇది కేవల మసాంప్రదాయకము. ఒకకొడుకు కొడుకు కాదు- ఒక కన్ను కన్ను గాదు- ఒక కూర కూర గాదని సామెత. సాధారణమైన యతిథి వచ్చినను రెండు కూరలు చేయుట శిష్టసంప్రదాయము. మహారాష్ట్రదేశమున పండరిపురమున దత్తజయంతినాడు యతిపూజ యవసర మని నేను తాత్కాలికముగా దొరకగా నన్నాహ్వానించిరి. మొదట పాదపూజ వస్త్రాదికము నిచ్చిన తరువాత వడ్డనలో 12 కూరలు, 12 పచ్చళ్లు, 12 పిండివంటలు గోచరించినవి. వారి శ్రద్ద అట్టిది. అన్నియు చక్కగా అలంకరించినట్లు వడ్డనచేసిరి. దీని వివరణ తరువాత చేతును. ప్రకృత మనుసరామః-

'అపచన్తం పరిత్యజ్య పచన్తం యస్తు భోజయేత్‌ |

అసురం త ద్భవేత్‌ శ్రాద్ధం పితౄణాం నోపతిష్ఠతి ||'

తా || యతీశ్వరులు వంటచేసికొనరాదు. నిప్పు ముట్టరాదు. గృహస్థులు వంట చేసినకొనవచ్చును. అట్టి యతీశ్వరులు ప్రాప్తించునపుడు వారిని విడచి గృహస్థుని శ్రాద్ధమందు నిమంత్రించినచో అతద్దినము తగులబడిన దని గ్రహించుము. అది రాక్షసులు తిని వేయుదురు. పితృదేవతలకు చెందదు. కనుక వారి యనుమతిని పొంది తద్దినము పెట్టవలెను. నిష్ఠగల యతి తద్దినమున నిమంత్రించిననూరాడు. కాన యతని యనుమతిని గోరి తద్దినము పెట్టిన పితృదేవతలకు చెందును నారద స్మృతియందిట్టి శ్లోకమే గలదు.

'యా వే యతీ ననాదృత్య భోజయే దితరాన్‌ ద్విజాన్‌ |

విజానన్‌ వసతో గ్రామే కవ్యం త ద్యాతి రాక్షసాన్‌ ||'

యతీశ్వరులు గ్రామమందు నివసించియున్నా రని తెలిసియు వారి ననాదరించి ఇతరులను భోక్తలగా నియమించిన యాశ్రాద్ధము, రాక్షసులకు చెందుచున్నది గాన వారి యనుమతి పొందుట ఉచితము. వాస్తవమున బ్రహ్మవిదులు పరమాత్మ స్వరూపులు గాన వారే ప్రతికర్మకు ఫలమునిచ్చువారు. వారి యనాదరణవలన ఏకర్మకు ఫలము రాదు.

దక్షః -

'వినా మాంసేన మధునా వినా దక్షిణయా శిఖామ్‌ |

పరిపూర్ణం భ##వేత్‌ శ్రాద్ధం యతిషు శ్రాద్ధభోజిషు ||'

మధుమాంసరహితముగా దక్షిణార్వాదములు మంత్రములు లేకుండగా యతీశ్వరుడు శ్రాద్ధమందు భుజించిన యా శ్రాద్ధముపరిపూర్ణ మగుచున్నది. అనగా సాధారణభిక్ష కూడ శ్రాద్ధమువంటిది అట్టి భావన యవసరము. శ్రద్ధయుండవలెను.

స్కందపురాణ శివవాక్యం-

'బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ ససాధ్యా మరుత స్తథా |

సకృద్భుక్తెన యతినా పితృదేవః స్సవాసవాః ||

సర్వే తే తృప్తి మాయాంతి దశనర్షాణి పంచ చ |'

బ్రహ్మవిష్ణుమహేశ్వరు లను త్రిమూర్తులు, సాధ్యగణము, మరుద్గణము, పితృదేవతలు, ఇంద్రుడు వీరందరూ ఒక్కసారి యతీశ్వరుడు భిక్ష చేసిన పదిహేనుసంవత్సరముల వరకు తృప్తినందుదురు.

'పరాన్నస్వామికో భిక్షు తసై#్మ న దీయతే |

చాంద్రాయణన శుద్ధి స్స్యాదితి చ స్మృతిశాసనమ్‌||'

యతీశ్వరులకు పక్వము చేసిన సిద్ధాన్నమునే భిక్షగా నియ్యవలెను. వండుకొన మని ముడిపదార్థముల నివ్వరాదు. యతులకు భిక్ష పెట్టని దోషము చాంద్రాయణవ్రతము చేసిన గాని పోదు.

'అకృతే వైశ్వ దేవే తు భిక్షుగే గృహ మాగతే |

ఉద్ధృత్య వైశ్య దేవాన్నం భిక్షుకంతు విసర్జయేత్‌ ||

వైశ్వదేవాకృతం దోషం భిక్షుః శక్తో వ్యపోహితుమ్‌ |

న హి భిక్షుకృతం దోషం వైశ్వదేవో వ్యపోహతి ||'

వైశ్వదేవము చేయుటకు పూర్వము యతి భిక్షకు వచ్చినచో వైశ్వదేవాన్నము వేరుచేసి యుంచి యతికి భిక్ష పెట్టి పంపవలెను. వైశ్వదేవము కాలేదని వారిని నిలుపరాదు- వైశ్వదేవము చేయని దోషమును యతి నశింపజేయగలడుగాని, యతికి భిక్షపెట్టని దోషమును వైశ్వదేవము నశింపజేయఁజాలదు.

'నివేశయతి యశ్శ్రాద్ధే పితృకర్మణి భిక్షుకమ్‌|

ఆకల్పకాలికీ తృప్తిః పితౄణా ముపజాయతే |'

పితృశ్రాద్ధమందు యతని కూర్చుండబెట్టినచో కల్పకాలపర్యంతము పితృదేవతలకు తృప్తి కలుగును. (కల్పమనగా 432 కోట్ల సంవత్సరములు)

'యతి హస్తే జలం చాన్నం న దత్తం యైర్న రాధమైః |

ఇక్షువత్‌ సంప్రపీడ్యం తే ముద్గరై ర్మునిసత్తమ||'

(సూ. సంహితా)

యతి హస్తమందు జలము, అన్నము యివ్వని నరాధములను చెరుకుగడలను గానుగలో పెట్టి పీడించునట్లు యమభటులు ముద్గరములతో చావమొత్తుదురు.

దక్షః -

'యోగాశ్రమపరిశ్రాన్తం యస్తు భోజయతే యతిమ్‌ |

నిఖిలం భోజితం తేన త్రైలోక్యం సచరాచరమ్‌|'

యోగాభ్యాసమున పరిశ్రమ చేయు యతికి భిక్ష పెట్టినచో మూడులోకములందలి చరాచరప్రాణికోటికి భోజనమిడినట్లే యగును. ఈవిధముగా యతీశ్వరుల భిక్ష ప్రశంసింపబడినది గాన వారును మనవలెనే భుజింతురుగాన వారి గొప్ప యేమి యని యనుకొనరాదు. మానవుడు తన కడుపు నిండుగా యెన్నాళ్లు భుజించిననూ లేశ##మైననూ పుణ్యము పుట్టదు. యతిభిక్ష పెట్టిన మహాపుణ్యము కలుగునని శాస్త్రము చెప్పుచున్నది. గాన శాస్త్రప్రమాణమునుస్త్ర అంగీకరించు ఆస్తికు డెన్నడూ యతుల గొప్పయేమి యని యనరాదు. అటులనువాడు నాస్తికుడే యగును. 'నాస్తి కో వేదనిందకః' యను సూక్తి ననుసరించి వేదశాస్త్రములను, వాటి వ్యవస్థను నిందించువాడు నాస్తికు డనబరగును.

పైగా యతులను నిందించువాడు నరకమును పొందును. 'యతినిందా కులక్షయః' యతులను నిందించిన కులక్షయ మగును. గాన యతినింద చేయరాదు.

'బ్రహ్మచారిసహస్రం చ వానప్రస్థశతాని చ |

బ్రాహ్మణానాం తు కోట్యాస్తు యతి రేకో విశిష్యతే ||'

వెయ్యిమంది బ్రహ్మచారులకన్న, నూరుమంది వాన ప్రస్థులకన్న కోటిమంది బ్రాహ్మణగృహస్థులకన్న యతీశ్వరుడు, విశిష్టుడు, గొప్పవాడగుచున్నాడు.

'దుర్వృత్తే వా సువృత్తే వాయ తౌ నిందాం న కారయేత్‌ |

యతిం దూషమాణస్తు నరకం యాతి దారుణమ్‌ ||'

చెడునడవడి గలిగియున్ననూ, మంచి ప్రవర్తన గలిగి యున్ననూ, యతిని నిందించరాదు. యతిని దూషించినవాడు దారుణమైన నరకమును పొందును.

హారీవతః -

'సర్వేషా మపరాధానాం యతినిందా గరీయసీ |

యతి ర్నారాయణః సాక్షాత్తస్మా త్తాం పరివర్జయేత్‌ ||'

ప్రపంచమున గల నేరము లన్నింటికంటె యతిని నిందించుటే గొప్పనేరము. అంతకన్న పెద్దపాప మింకొకటి లేదు. యతి సాక్షాన్నారాయణస్వరూపుడుగాన నింద చేయరాదు. వాస్తవము యతులలో దోషము లుండవుగాని గృహస్థులు దృష్టిదోషమున అవి దోషములుగా రూపొందించి ప్రచారము చేతురు. ప్రపంచమంతటిలో యత్యాశ్రమము, యతి గొప్పవాడు గాన వారిని నిందించుటయు మహాపాపమే యగును.

'సదోషం నిర్గుణం వాపి యతిం క్వాపి న కీర్తయేత్‌ |

అజ్ఞానా త్కీర్త యే ద్యస్తు స యాతి నరకం ధ్రువమ్‌ ||'

యతీశ్వరులయందు దోషము గోచరించిననూ నిందచేయరాదు. ఏగుణములు లేకపోయినను యెచ్చటను యెన్నడును నిందించరాదు. అజ్ఞానవశమున నిందించిన నరకము పొందుట నిశ్చితము. ఆయతి ఏమీ చదువుకోలేదండీ అని కూడ యనరాదు.

'యేనాపమానితో భిక్షుః తేనాహం చాపమానితః |'

తా || ఎవడు యతిని యవమానించునో అతడు నన్నవమానించినట్లే యని భావింతు నని భగవంతుడు పలికెను. (యతి నారాయణస్వరూపుడుగాన) యతీశ్వరులవలన లోకమున కేమి ప్రయోజనము మని కొందరు ప్రశ్నింతురు. దానికి సమాధానమే ముండకశ్రుతి చెప్పినది, 'తస్మా దాత్మజ్ఞం హ్యర్చయేత్‌ భూతికామః' యని. అనగా ఐశ్వర్యకాముడు యతీశ్వరులను పూజించిన వానిని బడయగలడు. ప్రపంచమున ప్రతివారు అష్టైశ్వర్యములలో నేదో యొకటి కావలెనని పాటుబడేవారే. కాని వారు యతిని పూజించి తమ యభీష్టమును పొందవచ్చును. ఇంతకన్న యేమి ప్రయోజనము కావలె నిష్కామభావముతో సేవచేసిన మోక్షము సిద్ధించును. జ్ఞానమునకై వారి నాశ్రయించిన దానిని పొందవచ్చును. ఒక్క యతికి భిక్షపెట్టి మూడులోకాలలో ప్రాణికోటిని తృప్తి పరచ వచ్చు. ఇంతకన్న సూక్ష్మంలో మోక్షమింకేమి యుండ గలదు. యతులవలన అనేక ప్రయోజనములు గలవుగాన సమాజమునకు యతులు, యత్యాశ్రమము అవసరమై యున్నవి గాన వాటి సంరక్షణయే వైదికధర్మరక్షణ యని తెలియవలెను. దానినే బ్రాహ్మణత్వరక్షణ మని శంకరభగవత్పాదు లనిరి.

యతులు లేనిచో, యతులను పూజించననిచో సమాజమున వ్యవస్థయే నశించును. మానవసమాజమున కొక వ్యవస్తయవసరము. అయ్యది యత్యాశ్రమమున్ననాడే సిద్ధించును. అది లేనిచో సిద్ధించదు. మానవులకు శాంతిసౌఖ్యములు అవసరము. అశాంతిసౌఖ్యముల స్వరూపమును యత్యాశ్రమము నుండియే గ్రహింపవీలగును. అన్యధా గ్రహింప వీలు లేదు.

మనుస్మృతియం దిట్లు గలదు-

'భూతానాం ప్రాణినః శ్రేష్ఠాః ప్రాణినాం బుద్ధిజీవినః |

బుద్ధిమత్సు నరా శ్ర్శేష్ఠాః నరేషు బ్రాహ్మాణాః స్మృతాః ||

బ్రాహ్మణషు చ విద్వాంసో విద్వత్సు కృతబుద్ధయః |

కృతబుద్ధిషు కర్తారః కర్తృషు బ్రహామవాదినః ||

బ్రహ్మవిద్భ్యః పరం కించి న్న భూతం న భవిష్యతి ||'

భూతములలో ప్రాణులు శ్రేష్ఠములని ప్రారంభించి బ్రహ్మవేత్తలనే అందరికంటే అధికులుగా నిరూపించి అంతకంటె అధికులు ఇదివరకు లేరు ఇక ముందుండబో రని నుడివెను. ఈక్రమమునే సూతసంహిత యనుసరించి-

'క్రిమికీటపతంగేభ్యః శ్ర్శేష్ఠాః పశ్వాదయస్తథా |

పశ్వాదిభ్యోనరా శ్ర్శేష్ఠాః నరేభ్యో బ్రాహ్మణాస్తథా | 29

(జ్ఞానయోగఖండే 9 అధ్యాయే)

బ్రాహ్మణభ్యో7ధ విద్వాంసో విద్వత్సు కృతబుద్ధయః |

కృతబుద్ధిషు కర్తారః తేభ్య స్సన్న్యాసినో నరాః || 30

తేషాం కుటీచకా శ్శ్రేష్ఠాః బహూదకసమాశ్రితాః |

బహూదకా తరో హంసో హంసా త్పరమహంసకః | 31

పమహంసా దపి శ్రేయా నాత్మవి న్నాస్త్యతో7ధికః |

తస్మా దాత్మవిదః పూజ్యాః సర్వదా సర్వజంతుభిః ||' 32

ఆత్మ వేత్తలైన పరమహంసలే అందరి కన్న శ్రేష్ఠులనియు, వారికన్న అధికులు లేరనియు వారే సర్వదా సర్వులచే పూజింపదగినవారనియు నుడివినది. ఇదే గతిసామన్యము భాగవతమందును గలదు- తృతీయే

'జీవాః శ్రేష్ఠా హ్యజీవానాం తతః ప్రాణభృత శ్శుభే |

27-28 అని ప్రారంభించి-

'తస్మా న్మయ్యర్పి తాశేషక్రియార్థాత్మా నిరంతరః |

మయ్యర్పితాత్మనః పుంసో మయి నన్న్యస్తకర్మణః ||

న పశ్యామి పరం భూత మకర్తుః సమదర్శనాత్‌ |' 33

సన్న్యాసించి సమదర్శియైన బ్రహ్మవేత్తకన్న శ్రేష్ఠులు లేరు అని కపిలుని వాక్కు. అన్నిటికన్న అధికులైన బ్రహ్మవేత్తలను పూజించిననాడే తమకంటె తక్కువవారు తమను గౌరవముగ చూతురు. తమకంటె అధికులైనవారియందు నిరాదరణ చూపిన తన కంటే నీచులు తనను నిరాదరణ చేయుట తథ్యము. చరిత్రను పరిశీలించిన ఈవిషయము స్పష్టము కాగలదు. మొగలాయీరాజకుటుంబమున చక్రవర్తులందరూ జైలులోనే చచ్చి రని చరిత్ర సాక్ష్యమిచ్చుచున్నది. ఒక చక్రవర్తి కొడుకు యువరాజై పదిమంది దర్బారు ఉద్యోగులను వశపరచుకొని తండ్రిని కారాగారమున కట్టి పడవేయును. అదే వరవడిని అతని పుత్రుడు ఇతనిని జైలులో బంధించును. ఈ విధముగా ఆతురకవంశములో పితృభక్తి లోపించి అందరు చక్రవర్తులూ బందిఖానాలలో మరణించవలసిన దుర్గతిని పొందిరి.

అదే విధమున ఉత్తమాశ్రమమైన యత్యాశ్రమమును బ్రాహ్మణగృహస్థులు, పండితులు రక్షణ చేసికొననిచో వారి కంటె నీచులు అధికారులై వారిని తలమీద తన్నిన సహించవలసిన దుర్గతి తప్పదు- రాజకీయములలో జరుగుచున్నదిదియే- జమిందారులందరూ జస్టిసుపార్టీని సృష్టించుకొని బ్రహ్మద్వేషమును ప్రచారము గావించుకొనిరి. ఈబ్రాహ్మణులకు భోజనము పెట్టిన లాభ##మేమి యనిభావించి సత్రవుల నెత్తివేసిరి. దాని పరిణామమే మనజమిందారులకే మోసము వచ్చెను. ఒక్క కలంపోటుతో జమీందారీలు ఎగిరి చక్కాపోయినవి. తరువాత సంస్థానాధీశ్వరులు 500 మంది తమ స్వాతంత్ర్యమును మట్టిలో కలుపుకొనిరి. కోట్ల కొలది రాబడి గల వారందరూ భరణాలకొరకు ప్రాకులాడుట పత్రికలలో అందరూ చదువుచునే యున్నారు. ఇవన్నియు బ్రహ్మవేత్తల నిరాదరణఫలితములే యని చెప్పవచ్చు, నిరాడంబర జీవులయిన పరివ్రాజకులను నిరాదరణ చేసిన ముందు ముందు యెట్టి పరిణామములు రానున్నవో సూచన యగుచునే యున్నది- ప్రాచీనభారతీయసంస్కృతిలో వారి కొక విశిష్టస్థాన మీయబడినది. విశ్వామిత్రునివంటి రాజసుడు 'ధిక్‌ క్షత్రి యబలం' యని నిందించి వశిష్టమహర్షి వద్ద గల 'బ్రహ్మ తేజో బలం బలం' అని ప్రశంసించక తప్పలేదు. విద్యారంగమున విద్యార్థులు ఉపాధ్యాయులను ధిక్కరించుటకూడ ఆఉపాధ్యాయులకు విద్యయనగా నేమియో తెలియక తమకు తెలిసినదే విద్య యనుకొని తమకంటె అధికులైన విజ్ఞానవేత్తలను, బ్రహ్మవేత్తలను ఆదరించుట తెలియకపోవుటయే అవ్యవస్థకు కారణము కాకపోదు. 'హరి జేరు మనియెడి తండ్రి తండ్రి' 'కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు' 'చక్రహస్తుని చదివించు చదువు చదువు' అను ప్రహ్లాదుని సూక్తులలో గల గంభీరమైన యర్థమును విద్యాశాఖాధికారులు గుర్చించుట అవసరమై యున్నది.

భారతీయసంస్కృతికి పట్టుకొమ్మ యైన వేదమున 'మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ' యని వైదికధర్మమండపమునకు నాల్గు ముఖస్తంభముల నేర్పరచిరి. అందు ఆచార్యకోటికి చెందినవారే పరివ్రాజకులు. వారి యాచార్యత్వము నంగీకరించుటకు నిరాకరించిన తమకంటె తక్కువవారి యాచార్యత్వము బలవంతముగ నంగీకరించక తప్పనిసరి యగును. సాంఘిక పరిణామ ములు చూచిన ఇది స్పష్టము గాగలదు. ఆనాలుగ్లుస్తంభములను రక్షించుకొనవలసిన బాధ్యత చాతుర్వర్ణ్యమునందేగాక ప్రతివ్యక్తియందును గలదు. వేదబోధితధర్మములు పరిమితవ్యక్తులకే కాదు. ఏ దేశమందైననూ, ఏకాలమందైననూ ఈధర్మముల నమలుజరుపుకొనిన యాదేశమువారు సకలశ్రేయస్సులు నందుదు రనుటలోసందేహము లేదు. జపానుదేశమున తల్లిని దైవముగా పూజించిన ఫలము కలుగదని చెప్పలేము. అటులనే జర్మనీదేశమందైననూ తండ్రిని దైవముగా పూజించి ఉచితఫలమును పొందవచ్చును. అట్టి అఖ్యాయిక లెన్నియో వారివారి భాషలందు గలవు. వేదధర్మములు కేవలము భారత దేశమునకే పరిమితము లని యనుకొనవలసిన యవసరము లేదు. మానవజాతి యంతయు భగవంతుని సంతానమే యని యనుకొనుటలో పొరబా టేమియు లేదు. వుండదు.

కాని యధికార మనునది పరిమితముగా నుండుట లోకమునందును, శాస్త్రమునందును గల సిద్ధాన్తము. అన్ని పనులయందు అందతరికీ అధికార ముండుట లోకమున కానరాదు. గ్రామములో కొన్ని వేలమంది జనాభాయున్ననూ మునసబుకరణాలు- పటేలుపట్వారీలు ఏయిద్దరుముగ్గురో యుందురుగాని ఆయధికార మందరికీ యుండదు. జిల్లాకు కలెక్టరు ఒక్కడే గాని వందలుగా నుండుట కానరాదు-రాష్ట్రానికి గవర్నరు ఒక్కడే. దేశానికి అద్యక్షుడు ఒక్కడే- అనేక కోట్ల జనాభా యున్ననూ అధ్యాక్షాధికారము ఒక్కనియందే యుంచుదురు. రిజిష్ట్రీ చేయు నధికారము ఒక్క సబ్‌ రిజిష్ట్రారుకే యుండును. గాని ఆయధికారము కలెక్టరుకికూడ నుండదు. గవర్నరు గారు రిజిష్ట్రీ చేసినా చెల్ల దందురు. రాష్ట్రపతికికూడ రిజిష్ట్రీ అధికార ముండుట మనము కానము. కనుక అధికారపంపకము జరుగుట కొక పద్ధతి యనుసరించబడుట గోచరించును. సర్వమానవసాధారణధర్మములు వేరు. ప్రత్యేకాధికారము గల వ్యక్తులు నిర్వహించవలసిన కార్యక్రమము వేరు. రాజకీయ వాతావరణమందున్నటులనే వేదమందుకూడ భగవంతుని పరిపాలనాపద్ధతిలో కొంత యధికారపంపకము జరిగెను. అది లోకశ్రేయస్సుకొరకే యని గుర్తించవలయును. క్రింది యధికారులు పైయధికారులను గౌరవించనిచో పరిపాలన నడువదు. రాజకీయవాతావరణము జీతములు పుచ్చుకొను ఉద్యోగులు యెవరి పని వారు నిర్వహించవలసినదే కాని ఒకరి పని యింకొకరు చేయుటకు వీలు లేదు. అటులనే సాధారణప్రజానీకమున కూడ ఎవరి పనులు వారు నిర్వహించుట ఆవశ్యకము అదియే వ్యవస్థ.

కాని నేటి రాజకీయనాయకులు చేయు మోసమంతయు నిచ్చుటనే గలదు. జీతములు పుచ్చుకొను సర్కారు ఉద్యోగులు యెవరి అధికారము వారు నిర్వహించవలెను- ప్రజానీకమునమాత్రము అందరికీ అన్నిటియందు అధికారము గల దని ఉపన్యాసము దంచవలె. దీనికి అర్థమేమనిన సర్కారు ఉద్యోగులలోనే కట్టుబాటు యుండవలె. ప్రజానీకము మాత్రము కొట్టుకొని చావవలె. అధికారముకొరకు ఒకరిమీద నొకరు కత్తులు దూసుకొని బయలుదేరవలె. ఇది సరియైన వ్యవస్థ గాదు. విద్యార్థులలో సహితము ఇదియే కలహము. స్కూలులో ఒందసీట్లుండిన వెయ్యి అప్లి కేషనులు వచ్చును. 900 మంది నిరాకరింపబడుదురు. వారు నిరుద్యోగులై నక్సలైట్లుగ తయారగుదురు.

ప్రాచీనభారతీయవ్యవస్థలో జీతములు లేని ప్రజానీకమందు వ్యవస్థ నేర్పాటు చేసిరి. వర్ణాశ్రమధర్మములలో ఎవరి వృత్తి వారు చేసుకొనవలె. బ్రాహ్మణులకు ఉద్యోగములే లేవు'న శ్వవృత్త్యా కదాచన' యని సేవకావృత్తి వారికి నిషేధింపబడినది. వారి నిత్యకృత్యముల కంతరాయము కలుగ కుండునటుల రక్షణ యుండెడిది. వారి పోషణభారము ఇతర వర్ణములపై నుండెడిది. అది యొక భారముగ వారి కుండెడిది కాదు. ఆర్థికసంపద దానధర్మములద్వారా పంపకము జరిగెడిది. విద్యాశాఖ బ్రాహ్మణుల యదీనమందున్ననూ వారికి జీతాలు లేవు. విద్యార్థులకు సూట్లకు బూట్లకు ఖర్చులు లేవు. వారాలతో ఖర్చు లేని ఆహారవ్యవస్థ. క్షత్రియవైశ్యులకు చదువు కొనుటకే అధికారముగాని, చెప్పుటకు లేదు. రక్షణశాఖ క్షత్రియలది, వాణిజ్యశాఖ వైశ్యులది, వ్యవసాయగోరక్షాదులు శూద్రులవి. ఇందు యెవరికీ జీతములు లేవు. యెవరి వృత్తివారు చేసుకొనుచు ఇతరులకు సహకారులుగ నుండెడి వారు. నేడు పరిపాలనాఖర్చు అపరిమితముగ పెరిగిపోవు చున్నదని యాందోళన చెందుచున్నారు.

యతీశ్వరుల నెందుకు పూజించవలె నని ప్రసంగము నడుచుచున్నదిగదా! దానికి వ్యావహారికమైన దృష్టాంత మివ్వబడినది. ఇంక శాస్త్రప్రమాణము కడకు వత్తము ఏశాస్త్రము సాలగ్రామమును పూజ చెయ్యవలె నని చెప్పినదో అదే శాస్త్రము యతీశ్వరులను పూజించవలెనని చెప్పుచున్నది. ఇందు ఒక వాక్యము ప్రమాణముగ స్వీకరించి రెంవడవాక్యమును ప్రమాణముగ స్వీకరించనిచో అర్థజరతీయదోషము పట్టును. శరీరమున కుడిచేతికి ముప్పదేండ్లు యెడమచేతికి ఇరువదేండ్లు యుండుట పొసగునా!రెండింటికి సమానవయస్సే యుండును. తేడా యుండదు. తేడా యుండు ననువాడు తెలియని వాడు. బలములో తేడా యుండవచ్చు. అది వేరు. వయసులో తేడా యుండదు. కోటిని పెంచువాడొకడు 'శాకాయ చార్థం ప్రసవాయ చార్థం' అని అనగా కూరకు సగము కోడిని కోసి గ్రుడ్లు పెట్టుటకు సగము కోడిని యట్టెపెట్టు కోనవచ్చు ననుకొనిన యతని భావము యెంత యసందర్భమైనదో తెలిసికొనుటకు ప్రత్యక్షముగా కోడిని కోసిన చాలును. అది యసంభవవిషయ మని తేలును. అటులనే శాస్త్రమందు కొంత ప్రమాణము, మిగతావిషయముప్రమాణము కాదు అనుట కూడ ఆశ్రేణికి చెందినదే.

ఇట్టి భావనతోనే ఆర్యసమాజము స్థాపించిన దయానందసరస్వతి మోసపోయి అసాఫల్యతను గాంచెను. వారు వేదము నుద్ధరింతు మని చాటుచు మంత్రభాగముమాత్రము ప్రమాణము, వేదములోనిదే యైన బ్రాహ్మణభాగము ప్రమాణము గాదనియు నుడివిరి. 'మంత్రబ్రాహ్మ ణాత్మకో వేదః' అని శిష్టాక్తి. అటులనే 'ఇతిహాసపురాణాభ్యాం వేదం సముపబృంహయేత్‌' అని యార్యోక్తి యుండగా అవి ప్రమాణములు గావనియు, ఏదో వెర్రిమొర్రిగా ప్రలపించెను. అవన్నియు భారతీయసంస్కృతికి విరుద్ధములే. పొసగని విషయములే.

అట్టి సంస్థలవలన వేదోద్ధరణ జరుగుట భారతీయసంస్కృతి పోషింపబడుట కుదరనిపనులు. వేదమందు, దేశమందు యభిమానముండుట మంచిదే. కాని యాయభిమానము సరిగా యమలుజరుగవలె. ప్రతితల్లి దండ్రులకు పుత్రులందు సంతానమందు తగని యభిమానముండును. అట్టిచో వారికి జబ్బుచేసిన డాక్టరు వద్దకు పరిగిడునుగాని, తాను మందివ్వలేడు కదా! రోగనిదానము తనకు తెలియదు. ఏరోగానికేది మందో తెలియదు. అట్టివాడు ఎట్లు మందివ్వగలడు. కనుక వైద్యుని సహాయ మపేక్షించవలసినదే- అటులనే అభిమానమున్నంత మాత్రమున దేశమును బాగుచేయుట కుపాయము తెలిసి పోవునా ! దేశమును బాగుచేయుటకు, సంస్కృతిని పోషించుటకు తద్విశేషజ్ఞులకడకు పోయి వారు చెప్పినట్లు నడచుకొనవలెను. వైద్యుడు చెప్పినట్లు పథ్యపానాదులు నడపనిచో రోగము కుదరనట్లు తత్త్వవేత్తలు చెప్పినట్లు నడచుకొనినచో దేశము బాగుపడదు. నేడు పాకిస్తాను సృష్టింపబడిన పంజాబులో ప్రజానీకము నుద్ధరించుటకే ఆర్యసమాజ మేర్పడెను. అటులనే తూర్పుబంగాలు దేశమున బ్రహ్మసమాజము స్థాపించి హిందూమతోద్ధరణ ప్రయత్నము చేయబడెను. కాని రెండు సమాజములలో వైదికమతవిరుద్ధములైన సిద్ధాంతము లెన్నియో గలవు. ప్రాతిపదికలు తప్పులగుటతోడనే సంస్థ చిరకాలము నిలువక స్వల్ప కాలమందే ఉచ్ఛిన్న మగును.

భారతీయసంస్కృతికి గల ప్రాతిపదికలు చాల కట్టుదిట్టమైనవి. వాటిని అంత తేలికగా పెరికిపారవేయుటకు వీలు లేనివి. ఆధునికులు వాటిని మేమనుసరించి మని వదరుచున్ననూ వాటినే పెరటిదారిని అంగీకరించక తప్పనిసరి యగుచున్నది. తాత్కాలికముగ ఒకటి రెండు దశాబ్దములు వేదవిరుద్ధమైనవి అమలు జరిగినట్టు కనుపించినను వాటిలో గల నిస్సారతయే వాటిని మూల ద్రోయును. బౌద్ధమతము, జైనమతము రెండునూ భారతదేశమున పుట్టినవియే. కాని అవి కొన్ని శతాబ్దములు రాజాశ్రయము పొంది బావుటా నెగురవేసినను సిద్ధాన్తమందు, విశ్వాసము లందు పటుత్వము లేకపోవుటచే భారతదేశమున వాటికి తావులేకుండ పోయెను. ఇతర దేశముల నాశ్రయించిన ఏదో ప్రాకులాడుచున్నవి. ఆదేశములందు శాంకరసిద్ధాన్తములు ప్రచారముసాగించగలవారున్నచో వాటికి ఆదేశమందుకూడ తావులేకుండ పోగలదు.

బుద్ధుడు క్షత్రియుకులసంజాతుడు. జైనుడు వైశ్యకులమున పుట్టినవాడు వీరిరువురు సన్న్యాసులవలె నటించి మత ప్రచారము గావించిరి. శాస్త్రీరీత్యా వారికి సన్న్యాసాధికారము లేకపోయినను గత్యంతరములేక బ్రాహ్మణులు సన్న్యాసించి గౌరవమర్యాదలు పొందుట చూచి వారును అశాస్త్రీయముగ కాషాయవస్త్రములు ధరించి బౌద్ధారామములు స్థాపించి సర్వులకు సన్న్యాసాధికారమున్నదంటూ వందల కొలది బౌద్ధభిక్షువులను తయారుచేసిరి. ఆబౌద్ధభిక్షువులే దేశ దేశాంతరముల కరిగి మతప్రచారము గావించిరి. బౌద్ధభిక్షువు లలో క్షత్రియులు ప్రధానులు. తక్కినవారు గౌణులు. అదేవిధమున జైనుడు వైశ్యుడు కనుక వైశ్యులందరూ అతనినభిమానించి ధనము విచ్చలవిడిగా ఖర్చుచేసి జైనారామములు స్థాపించి మత ప్రచారము గావించిరి. స్త్రీలకు పురుషులకు అందరకూ సన్న్యాసమిచ్చి బౌద్ధారామములలో ఆశ్రయమిచ్చుటతోడనే రెండు మతములు కొన్ని వందలయేండ్లలో నామమాత్రావిశిష్టములైనవి. ఆబౌద్ధజైనభిక్షువుల సంస్కారములే నేడు కూడ అచ్చట క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, కాషాయవస్త్రములు ధరించుటకు కారణమై యున్నవి. ఇందు కొంచెము మార్పు యేమనిన వీరందరూ శాంకరసిద్ధాన్తమునే యనుసరించుచున్నా మని పలుకుచూ సంస్కృతము కొద్దిగా చదివి ఆభాష్యములనే అధ్యయనము చేయుచూ లోలోపల కొంత వైదికమతవిరుద్ధము లగు సిద్ధాన్తములను ప్రచారము చేయుచున్నారు. స్త్రీలకు పురుషులకు అందరకు సన్న్యాసాధికారము గలదనియూ వేదము లందరూ వల్లెవేయవచ్చుననియూ వర్ణవివక్షత అవసరము లేదనియూ వాగుచున్నారు. సరే! యెవరెట్లు వాగిననూ వైదికమతసిద్ధాన్తముల కేమియు లోటురాదు. వాటి విలువ వాటి కుండనే యుండును. త్రాచుపాములు తలయెత్తి పడగ విప్పు యాడుచుండ లేవిడికపాములు తలయెత్తవచ్చు. మంటిబుక్కడములు, బురదబుక్కడములు తలయెత్తవచ్చు. కాని వీటికి పడగ యుండదు, విషముండదు. కరచినా యెవ్వరూ చావరు. వాటి విలువ వాటి కుండవచ్చు.

వీరి సిద్ధాన్తములలో లోటు యెట్లు యేర్పడినదో చూపబడుచున్నది. బౌద్ధులు ప్రత్యక్ష- అవమానములను రెండు ప్రమాణములనుమాత్ర మంగీకరించి వేదప్రమాణమును, శబ్దప్రమాణమును నిరాకరించిరి. అయితే వాదముకొరకు ఈమాట వారు నోటితో యనుచున్నారుగాని శబ్దప్రమాణమంగీకరించకపోయినచో వారు గ్రంథముల నెందుకు వ్రాయుచున్నారు. అవి చదివి యితరులు వారి సిద్ధాన్తములను తెలిసి కొనుటకే కదా. అనగా పెరటిదారిని శబ్దప్రమాణ మొప్పుకొనినట్లే కదా. వేదవాక్యములు నిరాకరింపబడిననూ బుద్ధుని వాక్యములను ప్రమాణముగా స్వీకరించుట మానినారా? అది తప్పనిసరిగా వారు ఒప్పుకొనిన శబ్దప్రమాణము నొప్పినట్లే. శబ్దమును ప్రమాణము గాదనిన వ్యవహారము జరుగనే జరుగదు. విద్యాలయములు అవసరము లేదు. ఉపాధ్యాయుడు చెప్పుట విద్యార్థి వినుట కుదరదు. వాణిజ్యవ్యాపారములు మూలబడవలసినదే. వార్తాపత్రిక లంతరించవలసినదే. కోర్టులలో సాక్షివిచారణ అవసరము లేదు. ఈసంస్థలన్నిటియందునూ శబ్దప్రమాణము నొప్పుకొనియే వ్యవహారము జరుగుచున్నది. వ్యక్తు లన్యోన్యము మాటాడుకొనునపుడు శబ్దప్రయోగము జరుగుచునే యున్నది ఆ శబ్దములవలన జ్ఞానము పొందుచుండిరనిన శబ్దప్రమాణము నంగీకరించినట్లే. ఊరక నోటితో శబ్దప్రమాణ మంగీకరించమని వాగిన నేమగును. ఇట్టి లోటుపాటులను సవరణ చేయుచూ కుమారిలభట్టు వేదప్రామాణ్యమును స్థాపించి వైదికమతము నుద్ధరించెను. వారి సిద్ధాన్తమునే శంకరభగవత్పాదులుకూడ ఆమోదించి 'వ్యవహారే భాట్టయః' యను వచనమును వేదాంతుల కందించిరి. కుమారిలుడు ఆరుప్రమాణముల నొప్పెను. అవే వేదాన్తమున కూడ వేదాన్త పరిభాషలో 8 ప్రకరణములు గలవు. అందు మొదట ఆరుప్రకరణములలో ఆరు ప్రమాణములు నిరూపింపబడినవి. చివరి రెండు ప్రకరణముల విషయము ప్రయోజనము. ఈవిధమున శంకరభగవత్పాదులవారు అద్వైతసిద్ధాన్తమున ఆరు ప్రమాణముల నొప్పరని తరువాత వారు ప్రచారము చేసుకొనిరి.

ఆర్యసమాజము, బ్రహ్మసమాజము హిందూమతోద్ధరణకు పూనుకొనిననూ సనాతనవైదికసిద్ధాంతములకు విరుద్దములైన విషయములను తాత్కాలిక ప్రయోజనము నపేక్షించి ప్రచారము గావించిరి. అందు విధవావివాహ మొకటి ప్రధానము. అందరకూ వేదాధికారము గలదు. అందరూ కలసి హోమములు చేయవచ్చు. వర్ణాంతరవివాహములు జరుపవచ్చు. ఇత్యాదులు- వీరి విశ్వాసములలో రోగమొకటి మందొకటిగా నుండును.

నేడు శంకరజయంతిగాన శంకరులవారు ఈసమస్యలను ఎట్లు పరిష్కరించిరో పరిశీలించుట యవసరము. గీతాభాష్యమున శంకరులు మొదటి అధ్యాయనమునకు రెండవ యధ్యాయమున 10 శ్లోకములకు వ్యాఖ్య వ్రాయనేలేదు. దానికి కారణమునువారే చిన్నమాటతో సూచించిరి. మొదటి అధ్యాయము అర్జునవిషాదయోగము. అందు అర్జునుడుయుద్ధము చేయ నని దాని కనేకకారణములను చూపెను. అన్నియు విన్న భగవంతుడు. 'ప్రహసన్నివ' అనగా అర్జునుడు వాకొనిన హేతువులన్నియు హాస్యాస్పదము లని భావించి. 'అశోచ్యా నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే' యని జ్ఞానోపదేశముప్రారంభించెను. ఇచ్చట శంకరులవారు భగవంతుని హృదయమును తెలిసికొని అర్జునుడు పలికిన ప్రజ్ఞావాదములను ఉన్మత్తప్రలాపము లని వ్యాఖ్యానించిరి. ఉన్మత్తుని ప్రలాపములకు ఎవరైన వ్యాఖ్యానము చేయుటకు ప్రయత్నింతురా? పిచ్చివాగుడు అన్నా ఉన్మత్తప్రలాపమన్నా ఒకటే. అర్జునుడు వాగినదంతయూ పిచ్చివాగుడుగా భగవంతుకి గోచరించినట్లే శంకరులవారికి గోచరించెను. గాన భగవంతుడు అర్జునుడు చూపిన కారణములలో నొకదానికి సమాధానము చెప్పక తన ధోరణిలో జ్ఞానోపదేశము ప్రారంభించెను. అటులనే శంకరభగవత్పాదులవారుకూడ అర్జునవాదమును పిచ్చివాగుడని దానికి వ్యాఖ్య యనవసరమని భావించి చిన్న భూమికలో అర్జునుని శోకమోహములు నిరూపించి వాటి నివృత్తికి వలయు జ్ఞానోపదేశముతో భాష్యము ప్రారంభించిరి.

సూతసంహితాయాం ముక్తిఖండే సప్తమోధ్యాయః

ఈశ్వర ఉవాచ-

అథాతః సంప్రవక్ష్యామి తవాహం పురుషోత్తమ |

విద్వచ్చుశ్రూషణఫలం శ్రుణు శ్రద్ధాపురస్సరమ్‌ ||'

తా|| హేపురుషోత్తమ- ఇక మీదట బ్రహ్మవేత్తలను శుశ్రూష చేసిన ఏమహాఫలము కలుగునో దానిని వచింతును. శ్రద్ధాపురస్సరముగ వినుము.

'పురా కశ్చిత్‌ ద్విజశ్రేష్ఠః శశివర్ణ సమాహ్వయః |

పాకయజ్ఞసమాఖ్యస్య తనయః పాపకర్మకృత్‌||'

తా|| పూర్వకాలమున పాకయజ్ఞు డను ద్విజశ్రేష్ఠుని పుత్రుడు శశివర్ణుడను వాడు మంచి కులమందు పుట్టిననూ పాపకర్మరతు డయ్యెను.

'త మోభిభూతచిత్త శ్చ బ్రహ్మవిజ్ఞానదూషకః |

వేదనిందాపర స్సర్వప్రాణిహింసాపరో7ధమః ||'

తా|| ఆశశివర్ణుడు తమోగుణముచే తిరస్కృతమైన చిత్తము గలవాడై, బ్రహ్మజ్ఞానమును దూషించుచూ- వేదముల నింద చేయుట, సర్వప్రాణులను హింసించుట ఇత్యాదులచే అధముడై యుండెను.

'శివనిందాపర స్సర్వ దేవతాదూషక స్సదా |

ధర్మనిందాపర స్తద్వత్‌ ధార్మిక స్యాపరాధకృత్‌ ||'

తా|| శివుని విశేషముగ నిందించుట, సమస్త దేవతలందు దోషాపణచేయుట, ధర్మమును నిందించుట, ధార్మికుల కపకారము చేయుట ఇత్యాది పనులలో తన తెలివిని ప్రదర్శించెడివాడు.

'వర్ణధర్మవినిర్ముక్తః తథైవాశ్రమవర్జితః |

మాతృహాభ్రాతృహా తద్వత్‌ పితృద్రోహీ యథాబలమ్‌|'

వర్ణాశ్రమధర్మములను విడిచినవాడై, తల్లిని కొట్టుట,

సోదరులకు ద్రోహముచేయుట, తండ్రికి ద్రోహమొనరించుట ఇత్యాదులను యథాశక్తి చేసెడివాడు.

'గ్నోఘ్రశ్చైవ కృతఘ్నశ్చ మహానాస్తికగర్వితః |

క్షేత్రదారహర స్తద్వ దగ్నిదో గరద స్తథా ||'

తా|| గోవులను కొట్టుట, కృతఘ్నుడైయుండుట, మహానాస్తికుడ నని గర్వించుట, ఇతరుల భూములను, భార్యలను హరించుట, ఇళ్లకు నిప్పుపెట్టుట, విషముపెట్టి చంపుట ఇతాది క్రూరకర్మల నెన్నో చేసెడివాడు.

'చండాలస్త్రీపతిస్త ద్వన్మధుమాంసాదిభక్షకః |

'మహాధీరో మహాపాపీ చచార పృథివీతలే||'

తా|| ఒకానొక చండాల స్త్రీకి పతియై- కల్లు మాంసము భక్షించుచు మహాధీరునివలె, మహాపాపాత్ముడై ఈభూమి యందు సంచరించసాగెను.

'పితర స్తస్య మూర్ఖస్య బ్రహ్మలోకగతా అపి |

స్వర్గలోకగతా శ్చాన్యే వివశా నరకం గతాః ||'

తా|| ఆమూర్ఖుని పితృదేవతలు కొందరు బ్రహ్మలోకమును పొందినవారును స్వర్గలోకమును పొందినవారును నేరుగా నరకమున వివశులైపడిరి.

'శశివర్ణో7పి కోలేన వ్యాధిభిః పీడితో7చ్యుత |

అపస్మారపిశాచాదిగ్రహగ్రస్తో7భవ ద్భృశమ్‌||'

తా|| కొంతకాలమునకు చెడుతిరుగుళ్ళవలన శశివర్ణుడు కూడ వ్యాధిగ్రస్తుడై మూర్ఖరోగముతో పిశాచబాధతో గ్రహబాధతో పీడింపబడుచూ అత్యంతదుఃఖము పొందసాగెను.

'పాకయజ్ఞః పితా తస్య మమ భక్తో మహత్తరః |

నిశమ్య తనయక్లేశాన్‌ నిర్గతప్రాణవ త్సుధీః ||'

తా|| శశివర్ణుని తండ్రియైన పాకయజ్ఞుడు- తనయుడెంత ద్రోహముతో ప్రవర్తించినను సరకుగొనక పుత్రుని బాధలను చూచి సహించలేకపోయెను. అతనికి నాయందు అపారమైన భక్తి గలదు. మంచి బుద్ధిశాలి- మహాపురుషుడు కనుక నే పుత్రుని దుఃఖము చూచి ఓర్వలేకపోయెను.

'పతితో భూతలే విష్ణో రోదమానో7తి దుఃఖితః |

తం దృష్ట్వా దేవభక్తాఖ్యో ముని స్సర్వార్థవిత్తమః ||

కృపయాపాకయజ్ఞాఖ్యం బభాషే వాక్యముత్తమమ్‌ |

ఉత్తిష్ఠోత్తిష్ఠ మా భైషీః పాకయజ్ఞ భవత్ర్పియమ్‌||

'త్వత్పుత్రస్యాపి వక్ష్యామి శ్రేయఃప్రాప్తి స్తు కారణమ్‌ |

తా|| పాకయజ్ఞుడు భూమిమీదపడి రోదనము చేయుచుండ అతని హితైక్షియైన దేవభక్తుడను మునీశ్వరుడు అన్ని విషయములు తెలిసినవాడుగావున పాకయజ్ఞుని దయతలచి ఓదార్చి ఈ క్రింది వాక్యములు పలికెను. 'నాయనా! పాకయాజ్ఞా!' ఈవిధముగా రోదనము చేసిన లాభ##మేమి. లెమ్ము నీకు ప్రియమైనదియు, నీపుత్రునికి శ్రేయఃప్రాప్తికి కారణమును అయిన విషయమును చెప్పెదను. సావధానుడవై వినుము' అని పలికి, గోపర్వతేశ్వరక్షేత్రమునకు పోయి శివునారాధించిన నీయభీష్టము సిద్ధించును. అచ్చటికి పొమ్ము- అది మహాక్షేత్రము అచ్చిటి మహానందపరాయణుడను ఒక శివయోగి కలడు అతని శుక్రూష చేసిన భక్తి ముక్తులు రెండును కలుగు' నని చెప్పెను.

ముక్తి ఖండే సప్తమః

'ఇత్యుక్తో దేవభ##క్తేన మునినా పంకజేక్షణ|

పాకయజ్ఞః పితా పుత్రం శశివర్ణసమూహ్వయమ్‌|'

తా|| పద్మాక్షా! దేవభక్తుడను ముని ఈవిధమున పలికిన విని తండ్రియైన పాకయజ్ఞుడు పుత్రుడైన శశివర్ణుని తోడ్కొని-

'ఆదాయప్రీతి మాపన్నః శ్రీమద్గోపర్వతం గతః |

పునః శ్శక్తేశ్వరం దేవం సహ పుత్రేణ పర్వణి ||

దృష్ట్వా ప్రదక్షిణీకృత్య శ్రద్ధయాష్టోత్తరం శతమ్‌ |

ప్రసాదా త్తస్య సర్వజ్ఞ జీవన్ముక్తం జగద్గురుమ్‌|'

తా|| అత్యంత సంతోషముతో శ్రీమద్గోపర్వతక్షేత్రమునకు పోయి అచ్చట శక్తీశ్వర మహాదేవుని మాసశివరాత్రి పర్వమున దర్శించి, పూజించి అష్టోత్తరశత (108) ప్రదక్షిణములు చేయుసరికి ఆశివానుగ్రహమువలన జగద్గురుడైన జీవన్ముక్తుని దర్శనము లభించెను.

'అతి వర్ణాశ్రమం ధీరం మహానందపరాయణమ్‌|

దృష్ట్వా హృష్టః స్వపుత్రేణ సహ భూమౌ ముహుర్ముహుః |

ప్రణమ్య దండవ ద్భక్త్యా పాకయజ్ఞః కృతాంజలి|

సర్వం విజ్ఞాపయామా స పుండరీకదళేక్షణ||'

తా|| మహానందపరాయణు డను పేరుగల యాధీర పురుషుడు అతివర్ణాశ్రమి. అతని చూచుటతోడనే సంతుష్టులై తండ్రికొడుకు లిరువురు భూమిపై అనేకసాష్టాంగదండప్రణామంబు లాచరించిరి. పుండరీకాక్షా! పాకయజ్ఞుడు అంజలి ఘటించి తన పుత్రుని వృత్తాంత మంతయు ఆమహానుభావునకు నివేదించెను.

'సో7పి సాక్షా న్మహాయోగీ మహాకారుణికోత్తమః |

స్వాత్మానందానుసంధానప్రమోదేన సహాచ్యుత ||'

తా|| అచ్యుతా! ఆమహాయోగికూడ మహాకరుణగల వారిలో శ్రేష్ఠుడు. అతడెల్లప్పుడూ స్వాత్మానుసంధానమందే యానంద మనుభవించుచుండును.

'విలోక్య పుత్రం పాపిష్ఠం శశివర్ణసమాహ్వయమ్‌|

శిష్యత్వే నాగ్రహీ ద్విష్ణో! బ్రహామవిద్యాబలేన తు ||'

తా || ఆమహాత్ముడు పాకయజ్ఞుని పుత్రుడైన శశివర్ణుని చూచి మాహపాపాత్ముడని తెలిసియు, బ్రహ్మవిద్యాబలమున శిష్యునిగా స్వీకరించెను. హేవిష్ణో! బ్రహ్మవేత్తల కసాధ్యమెద్ది కలదు ?

'తస్యావలోకనా దేవ శశివర్ణస్య కానిచిత్‌ |

వినష్టాని చ పాపాని తత్పరిగ్రహకారణాత్‌ ||

కానిచి త్కల్మషాణ్యస్య సో7పి నీరోగతాం గతః ||'

తా|| ఆహాపురుషుడు తన దృష్టిని ప్రసరించుట తోడనే శశివర్ణుని కొన్ని పాపములు తొలగిపోయెను. అతని శిష్యునిగా గ్రహించుటతో మరికొన్ని పాపములు నశించెను. అతని శరీరమందలి రోగములు పోయి ఆరోగ్యవంతుడయ్యెను. మహాత్ముల దృష్టి కంత శక్తి గలదు.

'పునః కాష్ఠం తృణం తోయం కందమూలఫలనాని చ |

దినే దినే సమాదాయ గురవే దత్తవా న్ముదా ||

తస్య గోరక్షణం చాపి శశివర్ణ స్సమాహితః |

అకరో త్తేన పాపాని నష్టాని సుబహూని చ||'

అటుతరువాత ప్రతిదినమందును ఆయోగీశ్వరుని కవసరమగు సమిధలను, కాష్ఠములను, గడ్డిని, దర్భలను, శుద్ధజలమును కందమూలఫలములను అతిశ్రద్ధతో తెచ్చి సమర్పించుచూ ఆనందముతో గురుశుశ్రూష చేయదొడగెను. ఆ బ్రహ్మవిదుని యాశ్రమమున గల గోవులను సేవించుట, వాటికి కావలసిన గడ్డిని, నీటిని సంరక్షణను గావించుచుండుట వలన అనేకములైన పాపములు తొలగెను.

'పునస్తద్గాత్రశుశ్రూషాం పాదమర్దన మచ్యుత |

తైలాభ్యగం చ వస్త్రాది శోధనం చాకరోత్తదా||'

తా|| పాపములు నశించినకొలది గురుసమీపమును చేరుట కవకాశము కలిగెను. అంత గురుశరీరశుశ్రూషకూడ లభించెను. గురువుగారి పాదములు మర్దించుట, వారిశరీరమునకు తైలాభ్యంజనము చేయుట, బట్టలను చక్కగా ఉతికి ఆరవేసి మడతపెట్టి రక్షించుట ఇత్యాది గురుగాత్రశుశ్రూష చేసెను.

' తేనైవ హేతునా ప్యస్య శశివర్ణస్య కేశవ|

మహత్తరాణి నష్టాని పాపాని సుబహూని చ||'

ఈగాత్రశుశ్రూషవలన శశివర్ణుని మహాపాపము లెన్నో నశించెను. కేశవా! గురుగాత్ర శుశ్రూష మహాఫలము గలది.

'తతః ప్రసన్నః సర్వజ్ఞో మహాయోగీశ్వరేశ్వరః |

స్వభుక్త శేషం కారుణ్యా ద్దదౌ తసై#్మ ప్రియేణ సః ||'

ఈవిధముగా స్థానశుశ్రూష, అంగశుశ్రూష, భావశుశ్రూష, ఆత్మశుశ్రూషలచే సర్వజ్ఞుడగు ఆమహాయోగీశ్వరుడు ప్రసన్నుడై శశివర్ణుని దయదలచి తన భుక్త శేషమును ప్రసాదముగా నిచ్చెను.

'తద్భుక్త శేషామృతపానశాంత

సర్వోపతాపో గురు మాదరేణ |

నత్వా చ శుశ్రూషణ మస్య శిష్య

శ్చక్రే తదాతీవ మహానుభావః ||'

తా|| గురుభుక్త శేషము అమృతతుల్యమైనది. దానిని పానముచేసిన సమస్తపాపములు నశించుచున్నవి. గురుప్రసాదము తినిన శశివర్ణుడు మహానుభావు డయ్యెను. శుశ్రూషయం దాదరము హెచ్చెను. గురువునకు సాష్టాంగవందన మాచరించి ప్రసాదమును తినెను.

'తతః ప్రసన్నో గురు రస్య విద్వాన్‌

సశిష్యమేనం శశివర్ణసంజ్ఞమ్‌,

ప్రణష్టపాపం పరిపక్వచిత్తం

ప్రగృహ్య భూత్యాసితయాస్య దేహమ్‌|

ఉద్ధూళ్య తసై#్మ ప్రదదౌ మహాత్మా

వేదాన్త విజ్ఞాన సునిశ్చితార్థమ్‌,

బుద్ధ్యా హృషీ కేశ మమ ప్రసాదా

చ్ఛిష్యో7పి మా మాత్మతయా7పరోక్షమ్‌||'

తా|| అటుతర్వాత గురుమూర్తి ప్రసన్నుడై శిష్యుడైన శశివర్ణుని పాపములన్నియు నశించినవనియు, పరిపక్వ చిత్తము గలవాడయ్యె ననియు గ్రహించి అతని శరీరముపై తెల్లిని విభూతిని చక్కగా పూసి వేదాన్త విజ్ఞానము సునిశ్చిత మైన జ్ఞానమును అతనికి ప్రసాదించెను. హృషీకేశా! నా యనుగ్రహము గుర్వనుగ్రహము, శాస్త్రానుగ్రహము అంతఃకరణానుగ్రహము లను అనుగ్రహచతుష్టయముచే ఆశిష్యుడు గురూపదిష్టజ్ఞానమును గ్రహించి నన్ను తనయాత్మగా చూచు అపరోక్షజ్ఞానవంతు డయ్యెను.

'ముక్తో7భవ త్తస్య పితాపి విష్ణో

శ్రద్ధాబలేనైవ మమ ప్రసాదాత్‌|

శుశ్రూషయా తస్య విలక్షణస్య

విద్యా మవాప్యాశు విముక్తి రూపామ్‌||

తా|| హేవిష్ణో! అతని తండ్రి కూడ శ్రద్ధాతిరేకమున నాయనుగ్రహమువలన ముక్తు డయ్యెను. విలక్షణుడయిన యా బ్రహ్మవేత్త శుశ్రూషవలన ముక్తిప్రదమైన జ్ఞానము అతనికి కలిగెను.

'పితర స్తస్య పరాత్మవిద్యయా

నరకా దేవ సముద్ధృతా హరే|

కుల మప్యస్య పవిత్రతాం గతం

పృథివీ పుణ్యవతీ విశేషతః ||'

తా|| పితాపుత్రులు తరించుటే కాక వారి పితృదేవతలుకూడ వీరి విద్యాబలమున నరకమునుండి ఉద్ధరింపబడిరి. వారి కులముకూడ పవిత్రమయ్యెను. వారు నివసించిన భూమికూడ మిక్కిలి పవిత్రమయ్యెను. పుణ్యక్షేత్రమయ్యెను.

'భుక్తా పురా తేన మహానుభావ

చండాలకన్యాపి దివంప్రవిష్టా|

దష్టాధరా భూధరనాకపృష్ఠె

విద్యాబలేనాస్య సుఖ ప్రయాతా |.'

తా|| శశివర్ణుడు పూర్వమందు అధర చుంబనము చేసి యనుభవించిన చండాలకన్య కూడ ఇతని జ్ఞానబలమున స్వర్గమును పొంది అచ్చట అనేకసుఖముల ననుభవించెను. మహానుభావా! విష్ణో! నీవు వరాహావతారమున పృథ్విని ధరించి తినికదా! ఆభూదేవి ఇట్టి మహాపురుషుల యునికివలన పవిత్రమైనదై సంతోషించుచున్నది.

(దీని తరువాత సుభగావేశ్యావృత్తాంతము వచ్చును. ఈ రెండుకధలలో ఒకపురుషుడు, ఒకస్త్రీ మహాపాపము లొనరించి బ్రహ్మవేత్తల నారాధించి తరించి రని వర్ణింపబడినది.)

శుశ్రూష పురుషులేగాని, స్త్రీలు చేయరాదను నియమము లేదు ఎవరుచేసినను తరించవచ్చును. అందరి పాపములు తొలగి పుణ్యలోకప్రాప్తి జ్ఞానము కలుగును. సందేహములేదు.

-బ్రహ్మవేత్తలను సేవించిన మహాఫలము-

శ్రుణష్వ చాన్య త్పరయా ముదా హరే,

తవాహ మద్వాభివదామి సద్గురోః |

విలక్షణ స్యాత్మవిదో మహాత్మన

శ్శరీరశుశ్రూషణ కర్మణః ఫలమ్‌|| 1

తా|| హేహారే!శ్రీమహావిష్ణో! ఇప్పుడు నీకు యింకొక ఇతిహాసమును చెప్పుదును. అందు ఒకానొక బ్రహ్మవేత్త యైన సద్గురువుయొక్క శరీరశుశ్రూషవలన గలిగిన మహా ఫలము వర్ణింపబడినది. ఆమహాత్ముడుకూడ విలక్షణమైన వాడు. లోకమందు గోచరించు యతులవంటివాడు కాడు. అతని చరిత్ర వినిన నీకు అధికమైన యానందము కలుగును. కనుక జాగ్రత్తగా వినుము.

'పురా మహాపాపబలా త్పురాతనా

నిహత్య వేశ్యా సుభగాభిధా పతీన్‌|

ధనాని తేషా మతివాంఛయా సదా

హరే సమాదాయ సుహృజ్జనై రపి ||' 2

తా|. హేహరే! పూర్వకాలమందు సుభగా యను పేరు గల వైశ్యయొకతె చిరకాలము వేశ్యావృత్తి చేసి పాపప్రాబల్యమున అనేకమంది పతులను, విటులను ధనమందతివాంఛచే హత్య గావించి వారి ధనములను తన బంధువులద్వారా హరించి తన యింట నున్న దాసదాసీజనములతో పుత్రులతో తల్లితో మహాసుఖమును అనుభవించెను.

'సదాసవర్గైః సహపుత్రకైస్వక్తైః

తదాంబయా భుక్తవతీ మహాసుఖమ్‌|

పిశాచికాభిః పరిపీడితా పున

స్సదా మహావ్యాధిభి రప్యతీవ సా,

నిద్రాపి నాభూత్‌ పురుషోత్తమాస్యాః

కష్టాందశా మాప సహ స్వకీయైః ||' 3

తా|| ఆమె బలవంతముగ చంపిన విటులందరూ పిశాచములై యామెను బాధించజొచ్చిరి. ఆమె శరీరముకూడ రోగములపుట్ట యయ్యెను. ఆమె బంధుజనులుకూడ పాపకర్మలవలన అనేకకష్టమములు పడుచుండిరి. పురుషోత్తమా! ఆ పిశాచబాధ,ఈరోగబాధలవలన ఆమెకు సరిగా నిద్రకూడ పట్టక మిక్కిలి కష్టదశను పొందెను.

'తస్యా గృహం చక్రధరాతివిద్వాన్‌

క్షుత్పీడితో 7సౌ వివశః ప్రపేదే |

అనేకజన్మార్జితపుణ్యకర్మాణా

విలక్షణం బ్రహ్మవిదం గృహాగతమ్‌||' 4

తా|| చక్రధరా!విష్ణో! ఆమె గృహమునకు ఒకానొక రోజున హఠాత్తుగా ఒకమహావిద్వాంసుడైన బ్రహ్వమేత్త ఆకలిచే బాధపడుచూ ఆయిల్లెవరిదో తనకు తెలియక వివశముగా వచ్చెను. మానవుడు కొన్ని పుణ్యములు, కొన్ని పాపములు చేయుచుండుట సహజముకదా! వాటి ఫలములు కూడ వాటికాలములందు కలుగుచుండును. అటులనే ఆవేశ్య అనేక జన్మలందు చేసిన పుణ్యకర్మల ప్రభావమున ఆవిలక్షణ మైన బ్రహ్మవేత్త ఆమెయింటికి దయచేసెను.

'విలోక్య సా భూమితలే సమాహితా

ప్రణమ్య తత్పాదసరోరుహద్వయమ్‌|

స్వాంతర్గృహే శీతలగంధతోయైః

ప్రక్షాల్య పాదోదక మాదరేణ

ఆదాయ పీత్వా సుభగా7భిముక్తా

పిశాచకాభిశ్చ సమస్తరోగైః ||' 6

తా|| ఆవిధముగ వచ్చిన బ్రహ్మవేత్తను చూచి ఆవేశ్య మంచి తెలివితేటలు గలదగుటచే అత్యంతసావధానముతో అతని పాదముల చెంత భూమిపై శిరము మోపి నమస్కరించి తనయింటి లోపల నున్న చల్లని సుగంధోదకము తెచ్చి యతని పాదపద్మద్వయమును అత్యంతాదరముతో కడిగి ఆపాదతీర్థమును శ్రద్ధతో పానముచేసెను. ఆబ్రహ్మవేత్త పాదతీర్థము ఆమె హృదయమును ప్రవేశించుటతోడనే ఆమె శరీరమును ఆశ్రయించి బాధించుచున్న పిశాచము లన్నియు పటాపంచలయ్యెను. శరీరమున గల రోగములు కూడ నశించిన యనుభవమును ఆవెశ్య పొందెను.

'తతః ప్రశాంతా సుభగా సువిస్మితా

మహానుభావం పరమార్థవేదినమ్‌ |

అపూపశాల్యోదనపూర్వకై ర్వరైః

సుశోభ##నైః కుంకుమ చందనాదిభిః || 7.

వసై#్త్రః సుసూక్ష్మైశ్చ సుగంధ పుషై#్పః

తాంబూలవల్లీదళపూర్వకైశ్చ |

ఆరాధ్య భక్త్యా సహ సుప్రసన్నా

తం ప్రార్తయామాస పరాత్మనిష్ఠమ్‌|| 8

తా|| అంత ఆసుభగావేశ్య మిక్కిలి ఆశ్చర్యముపొందినదై అత నెవరో మహానుభావుడై యుండనోవు నని భావించి అత డాకలి గొనియున్న వాడని గ్రహించి త్వరత్వరగా మధుర మైన పదార్థములతో శాల్యోదనమును, కుంకుమపువ్వు, పచ్చకర్పూరము ఇత్యాదిసుగంధద్రవ్యములతో తయారుచేసిన పక్వాన్నములతో యతని తృప్తుని జేసి అతనికి సన్ననూలు బట్టలను సమర్పించి సుగంధద్రవ్యములతో పుష్పములతో చక్కని తాంబూలములతో భక్తితో పూజించి మనసున అత్యంతానందమును పొంది ఆబ్రహ్మనిష్ఠుని యిట్లు ప్రార్థించెను.

'త్వద్దర్శ నేనైవ సమస్త రోగతో

విముక్త దేహాహ మతీవ నిర్మలా|

అతశ్చ మా మామరణాదపి ప్రభో

బుభుంక్ష్వ దాస్యం కరవాణి తే7ధునా||' 9

తా|| మహాత్మా! తమదర్శనమాత్రముచేతనే నేను సమస్తరోగములనుండి విముక్తురాలనైతిని. నా మన సెంతో నిర్మలముగా నున్నది. కనుక జీవితాంతము నన్ను నుభవించుడు. నేటినుండి మీదాసురాలనై సేవ చేసెదను. నాప్రార్థనను మన్నించుడు.

'ఇత్యేవం ప్రార్థిత స్సమ్యక్‌ తయాప్రీతో జనార్దన|

ప్రారబ్ధకర్మణా నీతః తథా చక్రే మతిం బుధః ||' 10

తా|| నిరాకరించుటకు వీలులేనంత చక్కగా ఆమె ప్రార్థించగానే ఆవిద్వాంసుడు సరే యట్లే యగుగాక యని అంగీకరించెను. జనార్దన! ప్రారబ్ధకర్మముచే ప్రేరితుడై యతడట్లొనరించెను.

'సా పినిత్యం మహావిష్ణో శ్రద్ధయా పరయా సహ |

అతీవ పూజయామాస స్వాత్మనా చ ధనేన చ ||'

తా|| ఆవేశ్యకూడ ప్రతినిత్యము అత్యంతశ్రద్ధతో కూడినదై ఆబ్రహ్మవిదునకు మనస్సు ప్రసన్నమగు నటుల చక్కగా పూజించెను. మహావిష్ణో - ఆమె పూజించునపుడు శరీరమునుగాని, ధనమునుగాని దాచుకొనలేదు. విత్త శాఠ్యము లేక పూజించెను.

'వత్సారాణాం త్రయంకృత్వా పూజాం తస్య మహాత్మనః |

నుభగా77పాతతో జ్ఞానం లబ్ధ్వా ముక్తా భ వద్దరే ||' 12

తా|| హే హరే ! విష్ణో! ఈవిధముగా నావేశ్య మూడు సంవత్సరములు ఆమహాపురుషుని పూజించి ఆపాతతః జ్ఞానమును పొంది ముక్తురాలయ్యెను. 'యాంతే మతిః స్సా గతిః'

'తస్యాః పుత్రాశ్చ పౌత్రాశ్చ సుహృదో బంధుబాంధవాః |

దాసవర్గాశ్చ మాతా చ స్వర్గలోకం గతా హేరే||' 13.

తా|| హేహరీ! ఆసుభగావేశ్య యొక్క తే ఆబ్రహ్మవిదుని సేవించినందువలన ఆమె కనుకూలురైన ఆమెపుత్రులు, పౌత్రులు, స్నేహితులు, బంధువులు, ఆబంధువులతో సంబంధించినవారు ఇంటిలో దాసదాసీజనము ముఖ్యముగా ఆమె తల్లి వీరందరూ స్వర్గలోకమును పొందిరి.

'బహవో బ్రహ్మవిద్వాంసం సమారాధ్య యథాబలమ్‌|

తేన బ్రహ్మాత్మ విజ్ఞానం వేదార్థం చ విముక్తి దమ్‌ || 14.

అపరోక్ష మవాప్యాశు విముక్త భవబంధనాత్‌|'

తా|| హే శ్రీహరీ! ఆవేశ్యయొక్క తెయే అట్లు ముక్తి పొందుట కాదు. ఇంకను అనేకమంది బ్రహ్మవేత్తల (యధాశక్తి ) నారాధించి వారిచే మోక్షప్రదమైన బ్రహ్మాత్మ విజ్ఞానమును అపరోక్షముగ పొంది సంసారబంధములనుండి విముక్తులైరి. వేదమునకు అంతియేకదా తాత్పర్యము.

'యత్రనిత్యం వసేత్‌ జ్ఞానీ తత్రాహం సర్వదా స్థితః |

సుదూరమపి గంతన్యం యత్ర మహేశ్వరో జనః ||'

తా|| ఏ ప్రదేశమందు జ్ఞాని నిత్యమూ నివసించి యుండునో అచ్చటనే నేనునూ సర్వదా నివసించియుందును. మహేశ్వరు నారాధించు బ్రహ్మవేత్త లెచట నుందురో అది చాల దూరదేశ##మైనను పోయి వారిని దర్శించవలెను.

'ప్రయత్నే నాపి ద్రష్టవ్యః తత్రాహం సర్వదా స్థితః |' 6.

'నిమేషం వా తదర్థం వా యత్ర జ్ఞానీ హరే స్థితః |

తత్ర సర్వాణి తీర్థాని తిష్ఠం త్యేవ న సంశయః ||' 17.

తా|| విశేష ప్రయత్నము చేసియైనను బ్రహ్మవేత్త లదర్శనార్థము పోవలెను. వారున్న తావునందు నేనునూ వుందును. జ్ఞానియైన పురుషుడు నిమేషమాత్రముగాని, అందు సగము కాలముగాని యెచ్చట నిలుచునో అచ్చట అన్ని తీర్థములు వచ్చి వాసము చేయును.

'యో7నిష్టం బ్రహ్మనిష్ఠస్య కరో త్యజ్ఞానతో7పి వా |

విమూడ స్స మమానిష్టం కరోత్యేవ న సంశయః ||' 18.

తా|| యెవడైతే అజ్ఞానవశమున బ్రహ్మనిష్ఠుడైన యతికి అనిష్టమును చేయునో ఆమహామూఢుడు నాకే యనిష్టమాచరించినవా డగును. నా కును బ్రహ్మవిదునకును తేడా లేదు. ఇందు లేశ##మైనను సంశయము లేదు.

' అంబికాయాః ప్రియో7త్యర్థం మమ జ్ఞానీ సదా హరే|

బహిష్ఠా స్సర్వదా సర్వైః జ్ఞానీ త్వాత్మై వ మేసదా||'

తా|| హేవిష్ణో! నాయర్థాంగియైన అంబికాదేవికంటె కూడ జ్ఞాని సర్వదా నాకు ప్రియమైనవాడు. తక్కినవారందరూ నాశరీరముకంటె వేరుగా నున్నవారై పరులుగా నున్న వారు. జ్ఞానిమాత్రము సదా నాయాత్మస్వరూపుడు. ఆత్మ అన్నిటికంటె ప్రియమైనది కదా! (గీతలలో కృష్ణపరమాత్మ కూడ 'జ్ఞానీ త్వా త్మైవ మేమతం' జ్ఞాని నా యాత్మ స్వరూపుడే యని పలికెను.)

'ఆత్మనిష్ఠం చ మాం విష్ణో విచ్ఛిన్నం ప్రవదన్తియే|

తే మూఢా ఏవ మనుజా నాత్రకార్యా విచారణా ||' 20.

తా|| ఆత్మనిష్ఠ గలిగిన యతినీ, నన్నును యెవరు వేరుగా జూతురో హేవిష్ణో! వారు మహామూర్ఖు లని గ్రహించుము. ఇందు విచారణ చేయవలసిన దేదియు లేదు.

'తస్మా దాత్మవిద స్సర్వైః పూజనీయ విశేషతః |

ఇతి వేదాన్త వాక్యానాం మయార్థః సంగ్రహేణ తు ||

కథిత స్సారభూతో7యం శేషో7న్యో గ్రంథవిస్తరః |'

తా|| పై కారణములవలన ఆత్మవిదులు అందరిచేతను విశేషముగ పూజింపదగినవారు. హేవిష్ణో! ఇంతవరకు వేదాన్త వాక్యముల తాత్పర్యార్థము సంగ్రహముగా చెప్పబడినది. ఇదియే అన్నింటికి సారభూతమైన విషయము. మిగిలిన దంతయు గ్రంథబాహుళ్యమేగాని వేరు గాదు. 'యస్య దేవే పరా భక్తిః యథా దేవే తధా గురౌ | తసై#్యతే కదితా హ్యర్థాః ప్రకాశ##న్తే మహాత్మనః' యెవనికి పరమాత్మయందు పరాభక్తి యుండునో, అట్టి పరాభక్తి యే గురువునందుండునో అట్టి వ్యక్తికే యీ చెప్పబడిన విషయముల యర్థము మనసు నందు ప్రకాశించును. (శ్వేతాశ్వతరోపనిషత్తు) భగవంతుడు గీతలలో 'ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన| నచా7శుశ్రూషవే వాచ్యం న చ మాం యో7భ్యసూయతి' యని పలికెను. అనగా ఈభగవద్గీతాశాస్త్రము తపస్సులేని వారికి చెప్పరాదు. భక్తి లేనివారికి యెన్నడూ చెప్పరాదు. శుశ్రూష చెయ్యనివారికి బోధించరాదు. నన్ను నా వారిని అసూయతో చూచువారికి అసలే వినిపించరాదు. జ్ఞాని, బ్రహ్మవేత్త, యతి, సన్న్యాసి, బ్రహ్మనిష్ఠుడు ఇవన్నియు పర్యాయపదములే. రూఢ్యర్థము గలవియే. వీటి యర్థమును అన్యధానయనము చేసిన అపార్థమగును. భాగవతమున ఏకాదశస్కంధమున ఉద్ధవునితో భగవానుడు ఇట్లు పలుకు చున్నాడు.

'న తథా మే ప్రియతమ ఆత్మ యోని ర్న శంకరః |

న చసంకిర్షణో నశ్రీర్నై వాత్మా చ యధా భవాన్‌||'

తా|| ఉద్ధవా ! నీవంటి మహాభాగవతోత్తముని యందు నాకెంత గాఢమైన ప్రేమ యున్నదో అంత ప్రేమ నాపుత్రుడైన బ్రహ్మదేవునియందుగాని, నాహృదయస్వరూపుడైన శంకరునియందుగాని, నాసహోదరుడైన బలరామునియందు గాని నాయర్థాంగియైన లక్ష్మీదేవియందుగాని చివరకు నా దివ్యమంగళవిగ్రహమగు శరీరమందుగాని లేదని నమ్ముము. ప్రేమభక్తులకంటె శ్రేష్ఠమైనవారు ఈప్రపంచమునందే లేరని తెలిసికొనుము.

యతీశ్వరులకు గృహస్థులు ఇంటిలోనే బసయివ్వవలెను. మిడిమిడి జ్ఞానము గల పండితులు యధా శక్తి యతీశ్వరులను నింద జేయుచూ అధర్మప్రచారముచేయుచుందురు. వారు ధర్మాచరణము చేయరు. ఇతరులను చేసుకోనివ్వరు. అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినా నివ్వదు. అను సామెతను సార్థకపరచుచుందురు. తాము భిక్ష పెట్టరు. భిక్షపెట్టువారిని కూడ నిరుత్సాహపరచుటకు యతులపై దోషముల నారోపించి ప్రచారము చేయుచుందురు. అందులో ముఖ్యముగా యతీశ్వరులకు ఇంటిలో బస యివ్వరాదనునది యెకటి. దీనికి శాస్త్రమునందాధారము కానరాదు. పైగా శాస్త్రమందు యింటిలోనే బస యిచ్చినవారి ప్రశంస గలదు. ప్రమాణ శ్లోకములు ఈక్రింది విధమున గలవు. ఈశ్లోకము లన్నియు యతిధర్మనిర్ణయములోనివి.

'యతి ర్యస్య గృహస్థస్య సంతుష్టో వసతే గృహే |

తుష్టో భవతి దైత్యారి ర్యావ దాభూతసంప్లవమ్‌||'

తా|| ఏగృహస్థుని యింటిలో యతీశ్వరుడు సంతుష్టుడై నివసించియుండునో దానివలన దైత్యారియైన శ్రీమహావిష్ణువు ప్రలయకాలపర్యంతము తృప్తుడై యుండును. సంధ్యావందనాదికర్మలు 'శ్రీపరమేశ్వరప్రీత్యర్థం' అని సంకల్పించి కదా గృహస్థులు చేయుచుందురు. అట్టి భగవంతుని తృప్తికి యతీశ్వరులను గృహమందు నివసింపజేయుట కారణమగుచున్నది.

' ఆశ్రమేషు యతి ర్యస్య ముహూర్త మపి విశ్రమేత్‌ |

కిం తస్యాన్యేన ధర్మేణ కృతకృత్యో హి స స్మృతః ||'

తా|| ఎవరి యింటియందు యతీశ్వరుడు ముహూర్త మాత్రము విశ్రమించిననూ ఆగృహస్థుడు ఇతరధర్మము లెవ్వియు నాచరించకపోయిననూ కృతకృత్యు డగుచున్నాడు. తరించుచున్నాడు.

'జన్మప్రభృతి యత్పాపం గృహస్థేన సంచితమ్‌|

తత్సర్వం నాశయ త్యాశు ఏకరాత్రోషితో యతిః ||'

(పద్మపురాణ)

తా|| పుట్టినది మొదలు యతీశ్వరునికి యింటిలో బస యచ్చిననాటివరకు గృహస్థు కూడబెట్టిన పాపమునంతటిని ఒక్క రాత్రి యతీశ్వరుడు గృహమందు నివసించినందువలన నశింపజేయుచున్నాడు.

'యస్యాశ్రమే యతి ర్నిత్యం వర్తతే మునిసత్తమ|

న తస్య దుర్లభం కించిత్‌ త్రిషు లోకేషు విద్యతే ||'

(సూతసం. జ్ఞాన. 6-34)

తా|| మునిసత్తమా! ఎవరియింటిలో నిత్యము యతీశ్వరులు నివసించియుందురో ఆగృహస్థునకు మూడులోకములందును దుర్లభ##మై దేదియు లేదు.

'యస్య గేహం సముద్దిశ్య జ్ఞానీ గచ్ఛతి సువ్రత |

తస్య క్రీడంతి పితరో యస్యామః పరమాం గతిమ్‌ ||'

తా|| ఎవనిగృహమునకు జ్ఞానియైన యతి స్వయముగా పోవుచున్నాడో ఆ గృహస్థుని పితృదేవతలు ఇంక తాము తరింతు మని ఆనందముతో నృత్యము చేయుచున్నారు.

'సంచితం యద్గృహస్థేన పాపమా మరణాన్తికమ్‌|

నిర్దక్ష్యతి హి తత్సర్వం ఏకరాత్రోషితో యతిః ||'

(కాశీఖండే 40-3)

తా|| పుట్టినదిమొదలు మరణపర్యంతము గృహస్థుపోగుచేసిన పాపము ఒక్క రాత్రి యతీశ్వరుడు గృహమందు నివాసము చేసి దహింపజేయుచున్నాడు. ఈవిధముగా యతీశ్వరులకు స్వంతయింటియందు బస యిచ్చుటను శాస్త్రము ప్రశంసించినది. అతని పాపము లన్నియు నశించుచున్నవి. 'యద్విధీయతే తత్‌ స్తూయతే' (ఏది విధానము చేయబడునో అది స్తుతి చేయబడును) అను న్యాయము ననుసరించి గృహస్థులు యతీశ్వరులకు యింటిలోనే బస యిచ్చి కాపాడవలెను. వారికి అవసర మగు సౌకర్యము లన్నియు కలుగజేయవలయును.

'శూన్యాగార, దేవగృహ, తృణకూట, వల్మీక, వృక్ష మూల, కులాలశాలాగ్నిహోత్ర, నదీపులిన, గిరుకుహర, కందర కోటర, నిర్ఘర,స్థండిలే ష్వని కేతవాసీ' అని జాబాలోపనిషత్తు, షష్ఠఖండే (ఇది యతులకుగాని గేస్తులకుగాదు) శూన్యాగారమన యెవ్వరు కాపురము లేని యిల్లు, దేహగృహము దేవాలయము, కులాలశాలా, కుమ్మరివాని గృహము, అగ్ని హోత్రశాల గృహమందొక భాగము. ఈయిళ్లలో బసచేయవచ్చు ననియే యున్నది. ఇది వేరు. భగవంతుడైన శ్రీకృష్ణుడు దుర్వాసునకు తన దివ్యభవనమందే బస యిచ్చి అతడు చేసిన పరీక్షలో నెగ్గెను. దుర్వాసుడు మహాకోపదారియైన జడదారి. యని కృష్ణునికి తెలియదా! తెలిసియే బస యిచ్చెను. అతడెంత యవకతవకగా ప్రవర్తించిననూ చివరకు పట్టమహిషిని, రుక్మిణిని తాను కూర్చొన్న రిక్షా లాగ మని నియోగించి దుర్వాసుడు కొరడాతో బాదినను కృష్ణు డేమియు అనలేదు. 'న కంచన వసతౌ ప్రత్యాచక్షీత' తైత్తి || భృగు వల్లీ 10-1 యింటికి వచ్చిన ఏ అతిథికి వసతి లేదని నిరాకరించ రాదు. అతిథులకు అన్నమిడవలెను. గాన యేదో విధమున అధికముగా అన్నసంపాదన చేయవలయు నని గృహమేధికి విధించుచున్నది. సాధారణులైన అతిథులకే బస నిరాకరించరాదనగా విశిష్ఠులైన యతీశ్వరుల కెట్లు నిరాకరించ మని శ్రుతి చెప్పగలదు.

గృహస్థుని భావపరంపర యెట్లుండవలయునో తైత్తిరీయ శ్రుతి సూచించినది. ఈవాక్యపంచకమునకు ప్రత్యేకవ్యాఖ్య అవసరము. ఇట సూక్ష్మముగా వివరింపబడుచున్నది.

ఆమాయస్తు బ్రహ్మచారిణః స్వాహా

విమాయస్తు ,, ,,

ప్రమాయస్తు ,, ,,

శమాయస్తు ,, ,,

దమాయస్తు ,, ,,

భారతీయసంస్కృతిలో నాలుగాశ్రమములు గలవు. అందు గృహస్థును విడచి తక్కిన మూడాశ్రమములకు బ్రహ్మచర్యము విహితము. గృహస్థునకు కొంత యభ్యనుజ్ఞ యున్నను అచ్చటకూడ బ్రహ్మచర్యము అవిహితము గాదు. విహితమే. కారణ మేమన 'యదిచ్చంతో బ్రహ్మచర్యం చరన్తి' యని బ్రహ్మపదార్థమును అందరూ కోరుదురుగాన దాని నభిలషించు వారందరు బ్రహ్మచర్య మవలంబించవలెను. భోగములకొరకు కొంత యభ్యనుజ్ఞ చూచుకొని గృహస్థు తనకు బ్రహ్మచర్యము విహితము కాదనుకొనుట పొరబాటు. భోగముస కభ్యనుజ్ఞ కూడ విధికాదు. అది తుష్యతు దుర్జనన్యాయేన ప్రయుక్తమైనది. భోగములు రాగతః ప్రాప్తములుగాన వాటికి విధియనవసరము. వాటి నివృత్తికి విధి యవసరము. ఈవిధిమర్యాదను తెలిసికొనినవాడే గృహస్థు తరించగలడు. 'బ్రహ్మచారులైన మూడాశ్రమములవారు ఇతరుల ఇండ్లకు పోక నాయింటికే వచ్చుచుందురుగాక- అన్ని దిశలనుండి విశేషముగ నాయింటికి వత్తురుగాక- వారు నాయింటియందే యుండి నేనిచ్చు అన్నపానాదులు స్వీకరించి శమదమాదులభ్యసింతురుగాక- జనులయందు సద్గృహస్థు డనుకీర్తిని బడయుదునుగాక యని యొక ఆదర్శమును చూపి తక్కినవారుకూడ ఆయాదర్శమునే యనుసరించవలె నని భావించినది. గృహస్థులు తమ యాశ్రమమును సమర్థించుకొనునపుడు- 'అందరూ అందలం( సావారిమేనా) యెక్కితే మోసేవా రుండొద్దూ. తక్కిన మూడాశ్రమాలవారికి యింత అన్నోదకాలు యివ్వాడానికి గృహస్థాశ్రమం అవసరంకదా' అని యనుచుండుట వాడుక. అతని యాశ్రమప్రశంసను సార్థకపరచుకొనవలె ననిన యతులకు యింటిలోనే బస యిచ్చి యాదరించవలె- దానివలన యాతని పాపములన్నియు తొలగుచున్న వని శాస్త్రము నొక్కి చెప్పుచుచున్నది. యతులు ఏదేవాలయమునందో బసచేయవలెననువారు హృదయము లేనివారు- భక్తిలేనివారు అని గ్రహించవలెను. పాపముల పోగొట్టుకొనవలె నని వారి కభిలాష లేదన్న మాట. ఇతరులు యితులకు యిండ్లలో బస యిచ్చుట చూచి వారిపుణ్యసంపాదన కసూయపడి యతుల కిండ్లలో బస యివ్వరాదని శాస్త్రవిరుద్ధప్రచారము చేయుచుందురు. తాను బస యివ్వడు, యితరులు యిచ్చిన ఓర్వలేడు. ఇదే అతని స్థితి-ఓర్వలేనితనముతో ఉచ్చరించిన యతని వాక్యము ప్రమాణ కోటిలో నెట్లు చేరగలదు. గాన అది ఆదరణీయము కాదు.

రెండవక్లాసు పిల్లవానికి నోటిలెక్కలు చెప్పుఉపాధ్యాయుడు ఇట్లు బోధించును.'అబ్బాయీ! మీనాన్న నీకు రూ20 లు యిచ్చా డనుకో, అందులో రూ10లు జీతముక్రింద స్కూలులో కట్టావనుకో, అన్నయ్యకు రు5లు చెల్లాయికి2రు. యిచ్చావనుకో. యింక నీవద్ద ఎంత మిగిలి వుంది? ' అని యనేక యారోపణలు చేసి బోధించుట అనుభవసిద్ధవిషయము. అటులనే యతీశ్వరునియందొక దోషారోపణ చేసి దానిపరిణామ మెట్లు వచ్చునో యూహించి గ్రహించిన శాస్త్రమర్యాద తెలియగలదు.

ఒక స్వామి మంచముపై పరుండె ననుకో, అది చూచి ఒక పామరుడు యతి మంచమున పరుండరాదు. కనుక యితనికి భిక్ష పెట్టరాదు. అని ప్రచారము సాగించును. దానిని విశ్వసించువారు భిక్ష పెట్టరు. యతి ఇంకొక గ్రామమునకు పోవును. ఇంతియే కదా సాధారణముగ జరుగుచుండును. ఇచ్చట పామరుని భాషను విమర్శించ వలెను. అతడు తన ప్రతిపాదన అనుమానప్రమాణము ద్వారా సాగించును. భిక్షపెట్టరాదని శాస్త్రమందెచ్చటను వుండదు. పామరుడు తన ద్వేషముచే భిక్షపెట్టరాదని నిశ్చయించును. తనసిద్ధాన్తమునే అందరిచే నమలు జరిపించుటకు ప్రయత్నించును. ఆపామరుని కన్న తక్కువశ్రేణికి చెందిన వారే యతని వాక్యమును విశ్వసింతురు. విజ్ఞులైనవారు యీ తుచ్ఛుడైన పామరుడు చెప్పుటయా యని నిరాకరించి శాస్త్రమునే యాలంబనము చేసుకొందురు. శాస్త్రమునందు యిట్లుండును.

'దుర్వృత్తోవా సువృత్తో వా మూర్ఖో వా పండితోపివా|

వేషమాత్రేణ సంన్యాసీ పూజ్య స్సర్వేశ్వరో యథా||'

(సూ. సం. జ్ఞాన. 7-36)

తా|| దుర్వృత్తి కలిగినవాడైననూ, సత్ప్రవర్తన నమందున్ననూ, ఏమియు చదువు రానిమూర్ఖుడైననూ, మంచి పాండిత్యము గలిగిన బ్రహ్మవేత్తయైనను వేషమాత్రమున (దండకమండలములున్నచాలు) సన్న్యాసి సర్వేశ్వరునివలె పూజింపదగినవాడు.

ఈశాస్త్రమందు విశ్వాసము గలవారు పూజింతురు. పామరుని వాక్యమందు నమ్మిక గలవారు వాని ననుసరింతురు. శాస్త్రవిశ్వాసి వికాసమును సాధించును. తరించును. పామరుని వాక్యమునందు శ్రద్ధగలవాడు అధోగతి పాలగును. పామరునికి శాస్త్రవిశ్వాసము లేదు. వానిని నమ్మినవాడును అట్టి వాడే.

' అంధేనైవ నీయమానా యధాంధాః' అనున్యాయమున గుడ్డి వాని నూతగొను గుడ్డివాడను గోతిలో పడును.

ఇచ్చట కొంత దార్శనికవిచారణ. యవసరము. పామరుని వాక్యమును దార్శనికభాషలోనికి మార్చి తూకము వేసి విలువ కట్టవలెను. అతని వాక్యమున 'యతికి భిక్షపెట్టరాదు. మంచముపై పరుండెను కనుక.' యని యుండును. ఇది యొక అనుమానప్రమాణము. సుప్రద్ధఅనుమానస్వరూపము ఇట్లుండును. 'పర్వతో వహ్నిమాన్‌ ధూమాత్‌' ఇందు మూడు పదములు గలవు. పర్వతము, పక్షము, వహ్నిమాన్‌ సాధ్యము. ధూమాత్‌ హేతువు. ఇందు హేతుసాధ్యములకు వ్యాప్తి యుండును. అదియే సాహచర్యనియమము. దానిరూపము 'యత్ర ధూమః తత్రాగ్నిః' అని యుండును (ధూమమున్న చోట అగ్ని యుండును) దృష్టాంతముగా వంటయింటిని చెప్పుదురు. ఈ అనుమానప్రమాణనియమములను పామరుని వాక్యమున పరిశీలించుట యవసరము. ఆవాక్యమున యతి పక్షము, భిక్షపెట్టరాదు, అన్నమిడరాదు, అని సాధ్యము. మంచమున పరుండుట హేతువు. హేతుసాధ్యములకు వ్యాప్తి యుండునుగాన యెచ్చట మంచమున పరుండుట యుండునో అచ్చట అన్నమిడరాదు. అని తేలును . దీనికి దృష్టాంతము దొరకదు. అనగా మంచముపై పరున్న వారందరూ అన్నము తినుచునే యున్నారు. యతిపై అమలుజరుపదలచిన సిద్ధాన్త మును సర్వత్ర అమలుజరుపుట ఉచితముకదా. అతడు వ్యాప్తిని అట్లు నిర్మించెను కదా? కనుక ఇంట గెలిచి రచ్చ గెలువ వలయును గాన తన శరీరము మంచముపై వాల్చుచుండును గాన మొదట తన శరీరమున కన్న మిడరాదు. తదుపరి తన భార్య మంచముపై పరుండును. కనుక ఆమె కన్న మిడరాదు. అనంతరము తన పుత్రులు, తల్లిదండ్రులు అందరూ మంచములపై పరుండువారే కనుక వారికీ అన్నంలేదు. యిరుగు పొరుగువారందరూ మంచములపై పరుండువారే కనుక వారి కెవ్వరికి అన్నము పెట్టరాదని పామరుడు ప్రచారము గావించవలెను. అది అతని సిద్ధాన్తముకనుక. ప్రచంచమున అందరూ మంచములపై పరుండువారే కనుక యెవ్వరికి అన్నము లేకుండవలె. ఈవిధముగా యతిపై నారోపించిన దోషణు ఎదురుతిరిగి ప్రపంచమొత్తముపై బడును. ఇది పామరుని కభీష్టమా! కాదు. తన సిద్ధాన్తము నమలుజరుపుటకు ప్రయత్నించినవానిని తలొక చెప్పు తీసికొని వాయించక యతియందు అమలుజరుపుదురే. వారికి భాషాపరిజ్ఞానమే లేదని తెలియవలెను. ప్రమాణపరిజ్ఞానముకూడ లేనివారే. అభిచారహోమమమందు శత్రువుపై ప్రయోగించిన దేవత ఆశత్రువు పరమ భాగవతోత్తముడైన, లేక బ్రహ్మవేత్తయైన అది ఎదురుతిరిగి యజమానినే పట్టి బాధించును. దుర్వాసుడు అంబరీషునిపై ప్రయోగించిన కృత్యను సుదర్శనచక్రము చంపి దుర్వాసుని చంపుటకు వెంటబడెనుకదా! సుదర్శనచక్రమే దర్శన శాస్త్రము. ఈ దర్శనశాస్త్రము పామరుడు ప్రయోగించిన వాక్యమును ఖండించి పామరుని హతమార్చుటకు ప్రయత్నించును. పామర వాక్యమున గల దోషమును ఎత్తి చూపి అది తప్పని నిరూపించునదే దర్శన శాస్త్రము. ఎచ్చటను అమలుజరుపుటకు వీలు లేని సిద్ధాన్తమును ఒక్క యతియందే అమలుజరుపుటకు ప్రయత్నించుటే దోషము. అతని వాక్యము విని భిక్ష చెయ్యని వారు మహాఫలము నుండి వంచితులగుట సంభవించును.

న్యాయశాస్త్రము ననుసరించి పామరుని వాక్యవిమర్శ జరిగినది. ఇక ముందు పూర్వమీమాంస ననుసరించి వాక్యపరిశీనమ జరుపబడునపామరు డిట్లనవచ్చును. 'మాకు మంచముపై పరుండుట కధికారము గలదు. యతులకు లేదు. శాస్త్రమున యతి మంచముపై పరుండుట నిషేధింపబడినదికదా!' ఈవాక్యరచన విమర్శించుటకు పూర్వమీమాంసాసాంప్రదాయము కొంత తెలియుట అవసరము. వేదములకు విధియందు తాత్పర్య మని పూర్వమీమాంసకు లొప్పదురు. ఆవిధిమూడువిధములుగా నుండును. అపూర్వవిధి, నియమవిధి, పరిసంఖ్యావిధి అని. ప్రత్యక్షముచే అనుమానముచే తెలియ బడని విషయమునే విధివాక్యము విధించును. విధివాక్యము ద్వారా అధికారము ప్రాప్తించును. రాగతః ప్రాప్తములైన వాటివిషయమున విధివాక్య ముండదు. ఎచ్చట విధివాక్యముండునో అచ్చట అపూర్వోత్పత్తి జరుగును. ఈ హద్దులు గుర్చించుకొనవలెను. పామరుడు మంచముపై పరుండుటకు విధివాక్య మవసరము లేదు. అది రాగతః ప్రాప్తముగాన ప్రత్యక్షసిద్ధము. ఏ దేశమున వేదములు లేవో అచ్చటి మానవులుకూడ మంచములపైపరుండుచునే యున్నారుగాన విధివాక్యమున్న నాడే మంచముపై పరుండవలె నను నియమము లేదుగాన అధికారము లేదు. పామరుడు మంచముపై పరుండుటకు నాకధికారమున్న దనుట పొరబాటు. ఈపొరబాటు నతడు గుర్తించలేదు. అధికారము విధివాక్యము ద్వారా ప్రాప్తించును. 'రాగతః' ప్రాప్తములైనవాటి విషయమున విధి యుండదుగాన అధికార మనుట పొరబాటు. నీ కిష్టమైనది కనుక నీవు పరుంటివి. అంతేకాని మంచముపై పరుండుట కధికార మవసరములేదు. సినీమాచూడ మని, గానము వినమని, మృష్టాన్నము తినమని, సెంటు వాసన చూడమని హంసతూలికాతల్పముపై పరుండమని విధులుండవు. వీటికి నిషేధ ముండును. అది తరువాత నిరూపింప బడును. విధి యున్నదని అంగీకరించిన అపూర్వోత్పత్తి యొప్పవలసియుండును. అట్టి అపూర్వోత్పత్తి మంచముపై పరున్నచో లేదు, రాదు, రావచ్చునంటివో పాశ్చాత్యులనేక రకముల మంచములపై పరుండుచున్నారు. గాన వారికి నీ కంటె అధికమైన అపూర్వోత్పత్తి లేకపోవలెను. అట్లు లేదు. మంచముపై పరున్న వారి కన్న పరుండని యతికి అపూర్వమధిక మని పామరుడే తన వాక్యముద్వారా ఒప్పు కొనుచున్నాడు- యెట్లనగా మంచముపైపరున్న యతి ఆధర్మాచరమ చేసినట్లు వాగెను కదా- పరుండని యతి ధర్మాచరణ చేసినట్లు గాన అధికాపూర్వము వరికుండుట యుచితము. ఈదోషములు రాకుండుటకై రాగతః ప్రాప్తములైన వాటి విషయమున విధిని శాస్త్రకారు లంగీకరించలేదు. ఇష్టమైన వారు పరుందురు. అది అధికారము కాదు. రాగము. రాగము నందు అపూర్వము లేదు విరాగమునందే గలదు. ఈ విధి మర్యాద ననుసరించి పామరుడు పేలిన ప్రలాపము తప్పు. మంచముపై పరుండుట కెవ్వరికినీ అధికారములేదు. దాని వలన పుణ్యము పుట్టదు. ఇంకొక్క విషయము గుర్చించ వలెను. మంచము యతికి ఎంత నిషిద్ధమో పామరునికీ అంతే నిషిద్ధము.

అదియెట్లంటేని సావధానముగావినవలయును. మానవులందరూ సుఖప్రాప్తి, దుఃఖనివృత్తికొరకు ప్రయత్నించుచుందురు. అట్లు యెందుకు చేయుదురనగా సుఖము జీవుని స్వరూపముకనుక యని సమాధానము. అట్టి జీవులకు అలౌకిక సుఖసాధనము వేద ముపదేశించును. దాని నేశ్రుతి. 'త మేవ విదిత్వా7తిమృత్యు మేతి | నాన్యః పంథాః విద్యతేయనాయ' అని పలికెను. ఆపరమాత్మను తెలిసికోనియే మృత్యువు నతిక్రమించును. దాని కింకక మార్గము లేదు. అనియెను. గాన పామరునికి గాని, పండితునికి గాని యతికి, తదితరులకుగాని, వేదమార్గ మొక్కటియే- అనేకమార్గములు లేవు- సుఖప్రాప్తికి యతికి ఏవి విహితములో ఏవి నిషిద్ధములు. వారికి నిషిద్ధములు తమకు విహితము లనుకొనువారు అజ్ఞానులు. రాగతః ప్రాప్తములైన వాటికి విధులు లేవు. నిషేధ ముండును. ఎట్లనగా గీతలో--

'యే హి సంస్పర్శజాః భోగాః దుఃఖయోనయ ఏవ తే |

ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః ||'

తా|| శబ్దస్పర్శరూపరసగంధములను శ్రోత్రత్వక్చక్షుః జిహ్వాఘ్రాణములద్వారా సేవించిన భోగములు దుఃఖమునకే కారణములుగాని, సుఖమునకు కాదు. వాటి కాద్యంతములు గలవు. కనుక కాంతేయా! వాటియందు విద్వాంసుడు రమించడు.

ఏయే భోగములను పామరు డనుభవించదలచెనో అని యన్నియు దుఃఖమునకే కారణము లని శాస్త్రమునకు వేదమునకు తెలివియునుగాన వాటిని విధించి జీవులను దుఃఖమున ముంచుట వేదమున కభీష్టము గాదు. కనుకనే తీవ్ర సాధన చేయు యతులకు వాటిని నిషేధించి వారిని యాదర్శముగా తక్కినవారు యనుసరించవలెనని వేదాతాత్పర్యము. కనుక వారికి నిషిద్ధములైనవి తమకు విహితములనుకొను పామరభావన సరియైనది కాదు. వారికి నిషిద్ధములైనవి తమకును నిషిద్ధములే యని గ్రహించుట యొప్పు. ఆదియే శాస్త్రమునకు తాత్పర్యము.

'యత్రోభయోస్సమో దోషః పరిహారః సమస్తయోః |

నైకః పర్యనుయోక్తవ్యః ||'

మంచముపై పరుండిన దోషము యతికివలె ఇతరులకు గలదుగాన యతీశ్వరుని విషయమున యేపరిహారము ఊహింప బడినదో యది యాదోషమున్న చోటులందెల్ల పరిహారము కావలయును గదా! పామరసిద్ధాంతరీత్యా- కనుక మంచముపై పరుండువారి కెవ్వరికి అన్నమిడరాదని తేలును. కాని యట్లు జరుగుట ప్రపంచమున కానము. గాన యనుభవవిరుద్ధము- ఇదియొక హెత్వాభాస- అగ్ని రనుష్ణః ద్రవ్యత్వాత్‌ జలవత్‌' వ్యభిచారి.

మానవకల్పితవిధినిషేధముల కిట్టి గతియే పట్టును. మానవుడు అర్థవాదములను విధినిషేధములు పోషించుటకు కల్పన చేసికొనవచ్చునుగాని, విధినిషేధములు కల్పించుట కవకాశములేదు- అవి కేవల వేదైక సమధిగమ్యములు. వాటిని యున్నదున్నట్టుగ స్వీకరించి యాచరణలోనికి తెచ్చుకొని తరించుట యుచితము. కొత్తవి కల్పించుకొనవలసిన పనిలేదు.

గణితశాస్త్రమున అభ్యాసము లున్నటుల మరికొన్ని హేత్వాభాసలను కల్పించుకొని బుద్ధిని సానబట్టవచ్చు. యతిని పూజించరాదు. ద్రవ్యమును ముట్టుచున్నాడు కనుక- అట్లే స్త్రీలతో మాట్లాడుచున్నాడు కనుక- శాస్త్రనిషిద్ధవాక్యముల నాధారముగ చేసికొని పామరు డిట్టి దోషారోపణ చేయరాదు. అట్టి దోషమును తన యిరుగుపొరుగువారిలో కోట్ల సంఖ్యలో కానవచ్చినను సహించగలుగుచూ ఒక యతీశ్వరునియందే సహించలేకపోవుటయే మానవునిలోని దౌర్భల్యము- వికాసహీనత, పశుత్వము. అట్టివానినే గోఖరశబ్దముచే భగవంతుడు వాడెను. వ్యాఖ్యాతలు 'పశూనాం పశురిత్యర్థ' యని వినరించిరి. శాస్త్రవాక్యము వాత్సల్యపూరితము. పామరప్రయోగము అసహనశీలము- ద్వేష పూరితము- తాహతుకు మించిన పని. వేదాంతభవనమునకు ముక్తి యను యునది అంతిమ అంతస్థు. క్రింద మెట్లపైనున్న వారికినీ అదే గమ్యస్థానము. గాన వారి విధినిషేధములు వీరును పాటించదగినవే- వారికి నిషిద్ధములైనవి తమకు విహితము లనుకొనుటే పొరబాటు. అభ్యనుజ్ఞావాక్యములుకూడ విధివాక్యములవలెనే యుండునుగాని కావు. అభ్యనుజ్ఞావాక్యముల వలన యాపూర్వోత్పత్తి యుండదు. యొప్పలేదు.

విద్యారణ్యస్వామి పంచదశిలో మాయను నిరూపించుటకు మూడు దృష్టికోణముల నాశ్రయించెను. శ్రుతి, యుక్తి, లౌకికదృష్టి. కోణములలో మాయారూపము క్రమముగా తుచ్ఛము, అనిర్వచనీయము, వాస్తవము అని తేల్చిరి. అదేవిధమున పామరుని భాషను లౌకికదృష్టికోణముద్వారా విచారించవచ్చు- దార్శనికదృష్టి నాశ్రయించి తూచవచ్చు. శ్రుతిస్మృతుల ప్రమాణము ననుసరించి కూడ విలువ కట్టవచ్చును. లౌకికదృష్టి నాశ్రయించిన పామరుని భాష, వ్యవహారము చాల అసభ్యముగా నుండు నని తేలును. దార్శనిక విచారణలో యుక్తికి కిట్టని పిచ్చివాగుడ అని తెలియగలదు. శబ్దప్రమాణము నాశ్రయించిన చూచిన పామరుడు మహాపాపమును మూడగట్టుకొనుచున్నాడని నిరూపణ యగును. ఇచ్చట ఒక శాస్త్రీయమైన శంక కలుగవచ్చును. ధర్మశాస్త్రమున అనేకవిధులు గలవు. వాటికి వైయుర్ధ్యము రావచ్చుననునది యొకటి. సంధ్యావందనాదికము యతులకు విహితములుగావు. తక్కిన మూడాశ్రమములవారికి విహితములై యున్నవే. యనిన నిజమే. ఆకర్మలకు కూడ నివృత్తియందే తాత్పర్యము చెప్పుకొనుట యుచితము. స్వాభావికప్రవృత్తి విముఖీకరణార్థమై విథికి తాత్పర్యము చెప్పుకొనవలె.

ఇంకొకదిశగా సమర్థించవచ్చు. రాగతః ప్రాప్తములైన విషయములు యతులకెంత నిషిద్ధములో తదితరులకు అంతే నిషిద్ధములు. విధులు యతులకు తదితరులకు వేరుగా నుండవచ్చును. అవి రాగతఃప్రాప్తములు కావు- రాగము సాంసారికము నిషిద్ధము. భగవద్విషయకరాగము భక్తి యగును. ప్రాపంచికవిషయ రాగమును విడచి భగవంతునియందు రాగమును పెంచుకొనవలె, అది స్వాభావికము కావలెను. నిషేధించినను దొలగరాదు. దానినే ప్రహ్లాదుడు కోరెను.

'యా ప్రీతి రవివేకానాం విషయే ష్వనపాయినీ |

త్వా మనుస్మరత స్సా మే హృదయా న్నాపసర్పతు |'

శాస్త్రమందు భక్తివిశ్వాసములు గలవారికి శాస్త్ర తాత్పర్యము గోచరించును. అది లేనివారికన్నియు విపరీతార్థములుగానే యుండును.

ఒక దివ్యజ్ఞానసమాజసభ్యు డన్నాడు గదా- భగవన్నా మసంకీర్తన చేయరాదని భాగవతంలోనే యున్నదని- ఒక భక్తుడు ఆశ్చర్యముతో ప్రశ్నించెను. ఎచ్చట నున్నదో చెప్పగలవా, చూపగలవా? ఓ మహారాజులా చూపుతాను. సప్తమస్కంధంతియ్యండి అన్నాడు- అందులోహిరణ్యకశిపుడు చెప్పలేదా? యనగానే భక్తుడు పక్కున నవ్వెను. భక్తునకే కాదు. భాగవతం విన్న వారి కందరికీ నవ్వువచ్చును. దివ్య జ్ఞాన సమాజసభ్యుని విజ్ఞానము ఎవరైననూ అంచనాకట్టవచ్చ- ఏది పూర్వపక్షమో ఏది సిద్ధాన్తమో తెలియనివారి విమర్శజ్ఞాన మిట్లే యుండును. ఏది విశ్వసింపదగినదో ఏది విశ్వసింపరానిదో తెలిసికొనుట యవసరము. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని తిట్టలేదా- రాక్షసవంశనాశకరుడనలేదా. కనుక ప్రహ్లాదుడు పితృభక్తుడు కాడు కనుక ఆదర్శప్రాయుడు. కాడు కనుక ఆతని మాటల విశ్వసించుటకు వీలులేదనువారు ఎంత వివేకముగలవారో విజ్ఞులూహించవచ్చును. దూషణవాక్య ములు నిందావాక్యములు వినినంతనే స్వబుద్ధి నుపయోగించి ఔచిత్యవిచారణ చేయవలె. అట్లుగాక దున్నయీనినదన దూడనుకట్టుమనువాడు ఎద్దు మొద్దునరపతిగాక వివేకియగునా !

అట్లే రాముడు పనికిమాలినవాడని రామాయణ మందు గలదు. ఎవరన్నా రనిన రావణుడన లేదా యనువాడు ఎంత రామభక్తుడో అందరకీ తెలియగలదు.

భారతమున శిశుపాలుడు కృష్ణుని పరిపరి విధముల నిందించెను- దూషించెను. ఆదూషణ ప్రమాణ మగునా? రాముని వాలికూడ దూషించెను. ఈవిధముగా నిందా వాక్యములు కొల్లలుగా వాఙ్మయమున గోచరించును. అవి ఎంతవరకు విశ్వసనీయములో విజ్ఞు లెరుగనిది కాదు.

యతీశ్వరులను కూడ అనేకమంది నిందింతురు. ఆనిందా వాక్యములు ప్రమాణములా- విశ్వసనీయములా? అట్టి నిందను చేయువారు సాధారాణముగా నీచులే యగుచుందురు. అనీచుల మాటలను విశ్వసించువారు నీచాతినీచు లగుదురు. విశ్వాసమెప్పుడు తనకన్న యున్నత భూమికయందున్న వారి యందు కలుగును. విమర్శించునపుడు మూడు వికల్పముల చేయవచ్చును. సిద్ధపురుషుడు ప్రపంచము నంతటిని తన స్వరూపముగా లేక భగవన్మయముగా చూచును. భగవంతునికన్న యతిరిక్తమైన దేదియు లేదు గాన దోషము వారి దృష్టిలో యుండనే యుండదు. 'దోషా బ్రహ్మగుణో బ్రహ్మ' యని ఉపనిషత్తు చెప్పులున్నది. గాన దోషము బ్రహ్మమే, గుణము బ్రహ్మమే. బ్రహ్మాతిరిక్త వస్తువే లేనివాడు దోష మెటనుండి వచ్చును? కనుక దూషణ యుండదు.

జిజ్ఞాసువు దోషముల నుగ్గడించునా యనిన అతడును దోషములు చూడడు. చూచుట కతనికి సమయమే దొరకదు. సర్వకాలములందు సాధనయందే యుండును. గానదోషదృష్టి కవకాశ##మే లేదు. ఇంక మిగిలినవాడు పామరుడు. ఇతనిలో దుర్గుణము లన్నియు మూర్తీభవించి యుండును. హర్ష, ద్వేషము, అసూయ, అసహనము ఇత్యాది దోషముల కన్నిటికి యతడు ఆశ్రయుడు. అట్టివాడే దోషారోపణ చేయను దానిని విశ్వసించువాడు అతనికన్న నీచులే ఐయుందురు. నీకన్న పెద్దవారి మాటలందే నీకు విశ్వాస ముండును. గాని నీకంటే నీచుల వాక్యములును నీవు పెడచెవిని పెట్టుదువు. నీచుడెవడైన నీకు బుద్ధి గరపుటకు ప్రయత్నించిన 'పోరా వెధవా! నువ్వా మాకు బుద్ధి చెప్పేది' యని మందలింతువు.

యతులపై దోషారోపణ చేయువారు పరమ నీచులై యుందురు. అట్టి నింద చేయరాదని శాస్త్రము నిషేధించు చున్నది. అట్టి నిషిద్ధకర్మ చేయువాడు ఉత్తము డెట్లగును. నీచుడే. అట్టి నీచుని మాటలను నమ్మువాడు కూడ నీచాతినీచు డగును. ఆనీచుల మాటలువిని తమ జీవితనిర్మాణము గావించుకొనువారు 'అంధేనైవ నీయమానా యధాంధాః' యని పతితులగుదురు. నరకమున బడుదురు. ఇదియే మానసిక తత్త్వశాస్త్రము.

యతుల నిందించు వానికి లాభ##మేమైన కలుగునా యని యోచించిన ఏదియూ గోచరించదు. అట్టి నిష్ప్రయోజన కర్మచేయువాడు విజ్ఞు డెట్లగును. అతడు సోమరితనముతో నుండును గాన ఏవో ఉత్పన్న నినష్టబుద్ధుడు కలుగుచుండును Idlers Brain is a Devilis work shop. నిందావాక్యమునకు ఒకవస్తువును తక్కువ పరచు శక్తి లేదు. అది ప్రమాణముచే నిశ్చయింపబడును. శివుని వైష్ణవులు నిందించరా యని ఎంత మంది శివునిభక్తి మానుకుంటున్నారు.

-' భగవంతునికి బ్రహ్మవేత్తలయెడ గల భావని శేషము'-

శ్రీభగవానువాచ - భగవంతు డిట్లు పలుకుచున్నాడు.

శ్లో|| 'ఏతౌ తౌ పార్షదౌ మహ్యం జయో విజయ ఏవ చ |

కదర్ధీకృత్య మాం య ద్వో బహ్వక్రాన్నా మతిక్రమమ్‌ |'

(భాగ|| 3-16-2)

తా| ఈ జయవిజయు లిరువురు నాపార్షదులు. వీరు నన్నేమియు లక్ష్యపెట్టక మివిషయమున గొప్ప అపరాధము గావించిరి.

'యసై#్వతయో ర్ధృతో దండో భవద్భి ర్మా మనువ్రతైః |

స ఏవానుమతోస్మాభిః మునయో దేవహేలనాత్‌ |' 3.

తా|| మిరు నాకు ఆంతరంగికభక్తులు. సనకాదులారా! మిరు నాస్వరూపభూతులు గాన ఈయపరాధము నన్ను చేసినట్లే. ఇట్లు దేవహేలనము గావించినందులకు మిరు వీరికి విధించిన శక్షను నేను అనుమోదించుచున్నాను.

త' ద్వః ప్రసాదయా మ్యద్య బ్రహ్మ దైవం పరం హి మే |

తద్ధీత్యాత్మకృతం మన్యే యత్స్వపుంభి రసత్కృతాః| 4.

తా| బ్రహ్మస్వరూపులైన బ్రహ్మవేత్తలు నాకు పరమారాధ్యులు. వారే నాకు దైవము- నాయనుచరులద్వారా మికు తిరస్కారము లభించినది. ఆతప్పు నావలన జరిగినదిగా భావించుచున్నాను. కనుక మిరు ప్రసన్నులై నాతప్పును క్షమించవలసినదని ప్రార్థించుచున్నాను.

'యన్నామాన చ గృహ్ణాతి లోకో భృత్యే కృతాగసి |

సోసాధువాదస్త త్కీర్తిం హన్తి త్వచ మివామయః |'

తా| సేవకులు అపరాధము చేసినపుడు ఫలానావారి నైకరు తప్పుచేసె నని యజమాని పేరును (వాకొని) పలుకుదురు. (శ్వేతకుష్ఠు) బొల్లిదోగము శరీరమును పాడుచేయునట్లు యజమాని కీర్తిని నైకరులు చేయు తప్పు నశింపజేయును.

య స్యామృతామలయశ శ్శ్రవణావగాహః |

సద్యః పునాతి జగ దాశ్వపచా ద్వికుంఠః |

సోహం భవద్భ్య ఉపలబ్ధసుతీర్థకీర్తిః

ఛింద్యాం స్వబాహుమపి వః ప్రతికూలవృత్తిమ్‌ |' 6.

తా| నానిర్మలమైన కీర్తి యనెడి అమృతజలములందు స్నానమాచరించినచో చండాలపర్యంతము సమస్తజగత్తు పవిత్ర మగుచున్నది. కనుక నేనును వికుంఠు డను పేరు గలవాడ నైతిని. ఇంత పవిత్రమైన కీర్తి నాకు మివలన లభించినది. కనుక లోకమం దెవరైనను మీకు వ్యతిరేకముగ ప్రవర్తించినచో నాబాహువైనను సరే (అధవా బాహు స్థానీయులైన లోకపాలురైనను) వెంటనే దానిని ఛేదించి పారనేయుదును.

'యత్సేవయా చరణపద్మపవిత్రరేణుమ్‌,

సద్యః క్షతాఖిలమలం ప్రతిలబ్ధశీలమ్‌ |

న శ్రీ ర్విరక్త మపి మాం విజహాతి యస్యాః

ప్రేక్షాలవార్థ ఇతరే నియమాన్‌ వహన్తి |'

తా| తమబోటి బ్రహ్మవేత్తల సేవ చేయుటవలననే నాచరణములందలి ధూలిరేణువులకు అవి సోకిన వెంటనే సమస్తపాపములనశింపజేయు పవిత్ర ప్రాప్తించినది. ఇంకొక విశేష మేమునః నేను ఔదాసీస్యమును వహించియున్నను ఈ లక్ష్మీదేవి ఒక్క క్షణమైనను విడువక నన్నంటిపెట్టుకొని యున్నదన- ఇదియు మిసేవాప్రభావమువలననే. లోకమున ఈలక్ష్మీదేవి కృపాకటాక్షము నభిలషించియే బ్రహ్మేంద్రాది దేవతలు నియమవ్రతములు సలుపుచుందురు. ఆమెమాత్రము నన్ను విడువదు.

'నాహం తథాద్మి యజమానహవిర్వితానై-

శ్చ్యోతత్‌ ఘృతప్లుతమదన్‌ హుతభుఙ్ముఖెన |

యద్బ్రాహ్మణస్య ముఖతో చరతోనుఘాసం,

తుష్టస్య మయ్యవహితైః నికర్మపాకైః |

తా| తన సంపూర్ణకర్మఫలములను నాయందర్పించి నిత్యతృప్తుడగు బ్రహ్మవేత్త ప్రతికబళమునందును తృప్తుడగుచు నేతిలో మునిగి తేలు యాహారపదార్థమును భుజించునపుడు నాకు అతని ముఖముద్వారా కలుగు తృప్తి- యజ్ఞయాగాదు లాచరించు యజమానులు అగ్ని ముఖమున నా కిచ్చు ఆహుతులను గ్రహించునపుడు కలుగదు.

యతిర్యస్య గృహే భుంక్తె తస్య భుంక్తె హరిః స్వయమ్‌ |

(యతి యెవరింట భిక్ష చేయునో వారింట సాక్షాత్తు హరి భుజించినట్లె. వారిరువురకు భేదము లేదు.)

'యేషాం బిభ ర్మ్యహ మఖండనికుంఠయోగ

మాయావిభూతి రమలాంఘ్రిరజఃకిరీటైః |

విప్రాం స్తు కో న విషషేత యదర్హణాంభః

సద్య పునాతి సహ చంద్రలలామలోకాన్‌ |' (3-16-9)

తా| యోగమాయకు సంబంధించిన అఖండమైన ఐశ్వర్యమునికుంఠితమై (మొక్కవోవనిదై) నాయందు అపారముగ గలదు. నా పాదములదు పుట్టిన గంగాదేవి చంద్రుని శేఖరముగా ధరించిన శంకరునితో సహా సమస్త లోకములను పవిత్రము చేయుచున్నది. అట్టి పరమవిత్రుడనైన నేను పరమేశ్వరుడనయ్యు యే బ్రహ్మవేత్తల నిర్మలపాదధూళిని నాకిరీటములందు ధరింతునో అట్టి బ్రహ్మవేత్తల కర్మలను యొవరు సహించరు? అనగా అందరూ సహించవలెను. ననున చయనరాదు) భగవంతు డీమాట నోటితో చెప్పుట మాత్రముగాదు. దుర్వాసుని దుండగములను తాను స్వయముగా సహించి ప్రపంచమునరకు ఆదర్శమును చూపెను. తాను పలికిన మాటలను అక్షరశఃఅమలుజరిపినాడు.

'యే మే తనూ ర్ద్విజవరాన్‌ దుహితీ ర్మదీయా

భూతా న్యలబ్ధశరనాని చ భేదబుద్ధ్యా |

ద్రక్ష్యం త్యఘక్షతదృశో హ్యమిమన్యవ స్తాన్‌

గృధ్రా రుషా మమ కృషం త్యధిదండనేతుః ||' 10.

తా| బ్రహ్మవేత్తలు, పాలిచ్చుగోవులు, దిక్కులేని ప్రాణులు ఇ యే నాశరీరములు- పాపముల ప్రాబల్యమున వివేకదృష్టి నష్టమగుటవలన యేనరాధములు వీరిని నాకంటె వేరుగా జూతురో వారిని నాచే నియమింపబడిన యమధర్మరాజు తనకంకపక్షులవంటి దూతలను ప్రేరణచేయుగా వారు త్రాచుపాములవంటి కోపముగలవారై తమ యినపముక్కులతో పొడిచి పొడిచి పీకి లాగి బాధింతురు.

'యే బ్రాహ్మణాన్‌ మయి ధియా క్షిపతోర్చయంత

న్తుష్యద్ధృదః స్మితసుధోక్షితపద్మవక్త్రాః |

వాణ్యానురాగకలయా ೭೭త్మజవత్‌ గృణన్తః

సంబోధయం త్యహ మివామ ముపాహృత సై#్తః | 3-1-11,

తా | బ్రహ్మవేత్తలు విదలించుచు కటువుగా మాటాడినను వారిని నన్నుగా భావించి ఎవరు ప్రసన్న హృదయులై అమృతము వంటి మందహాసముతో తడిసిన ముఖకములముతో యాదరింతరో కోపముతో నున్న తండ్రిని పుత్రునివలె. లేక నేనును మీబోంట్లనువలె ప్రేమపూరితవాక్కులతో సంబోధించుచూ, ప్రార్థించుచూ, ప్రశంసించుచూ శాంతింప జేయుదురో వారు నన్ను వశపరచుకోనుచున్నారు.

'త న్మె స్వభర్తు రవసాయ మలక్షమాణౌ

యుష్మద్వ్యతిక్రమగతిం ప్రతిపద్మ సద్యః |

భూయో మమాంతిక మితాం తదనుగ్రహో మే

యత్కల్పతా మచిరతో భృతయో ర్వివాసః |' 3-16-12.

తా| ఈ నా సేవకు లిరువురు తమ ప్రభువునైన నా యభిప్రాయము నెరుగక మిమ్ముల నవమానించిరి. మీరు నాప్రార్ధనను మన్నించి అనుగ్రహించవలసిన దేమనః వీరి నిర్వాసనకాలము శీఘ్రముగ సమాప్తమై తమ యపరాధము నకు తగిన యధమగతిని వెంటనే యనుభవించి త్వరలో నావద్దకు చేరునట్లు దయ చూడుడు ఇంతియే నేను మిమ్ము లను కోరునది.

'నైషాం మతి స్తావ దురక్రమాంఘ్రిమ్‌

స్పృశ త్యనర్థాపగయో యదర్థః |

మహీయసాం పాదరజోభిషేకమ్‌

నిష్కించనానాం న వృణిత యావత్‌ |' 7-5-32.

తా | ఎవరి బుద్ధి భగవంతుని చరణకమలములను స్పృశించునో వారి జననమరణరూప అనర్ధమలు సర్వదా నశించుచన్నవి. కాని యెవరైతే అకించనులును, భగవద్భక్తులును అగు మహాపురుషుల పాదధూళిలో స్నానముచేయలేదో వారి బుద్ధి భగవంతుని పాదపద్మములను స్పృశింపజాలదు.

తతో దుస్సంగ ముత్సృజ్య సత్సు సజ్జేత బుద్ధిమాన్‌ |

సంత ఏతస్య భిందంతి మనోస్యాసంగముక్తిభిః |' 1-26-26

తా| కనుకనే బుద్ధిమంతుడైనవాడు పురూరవునివలె దుష్టసాంగత్యమును విడిచి మహానుభౄవులైన సత్పురుషులను ఆశ్రయించవలెను. వారు తమ సదుపదేశములద్వారా మన మున గల ఆసక్తులను తొలగించి మానవలును తరింపజేతురు.

'అకించనస్య దాంతస్య శాంతస్య సమచేతసః |

మయా సంతుష్టమనసః సర్వా సుఖమయా దిశః |'

సర్వవిధములైన పరిగ్రహరహితుడును, ఇంద్రియముల జయించినవాడును, శాంతస్వభావుడును సమదర్శియు అనగా నన్ను పిందినందువలన సంపూర్ణానందమును అనుభవించు భక్తునకు అన్ని దిశలందు ఆనందము నిండుగా లభించును.

'మద్భక్తి యుక్తో భువనం పునాతి.' 11-14-24

'వా గ్గద్గదా ద్రవతే యస్య చిత్తం

రుద త్యభీక్‌ష్ణం హసతి క్వచిచ్చ |

విలజ్జ ఉద్గాయతి నృత్యతేచ

మద్భక్తి యుక్తో, భువనంపునాతి |'

తా| ఎవనివాక్కు ప్రేమభక్తిచే గద్గదిక మగుచున్నదో ఎవని చిత్తము కరిగి నీటివలె ప్రవహించుచున్నదీ - రోదనము క్షణకాలమైన యాగకుండునో ఒకప్పు డవిలక్షణముగ పకపక నవ్వుచుండునో సిస్గు (లజ్జ) విడిచి బిగ్గరగ గానము చేయుచుండునో- ఒకప్పుడు ఆనందముతో నృత్యము చేయుచుండునో ఉద్ధవా! అటువంటి నాభక్తుడు తననే కాక లోకముల నన్నిటిని పవిత్రము చేయుచుండును.

'సాధవో హృదయం మహ్యం

సాధూనాం హృదయం త్వహమ్‌ |

మదన్య తై న జానంతి

నాహం తేభ్యో మనాగపి |' 68,

తా| దూర్వాసా! నీతో విశేషముగ నేమి చెప్పదురు. సాధువులు (జ్ఞానులు భక్తులు) నాహృదయమే యునుకొనుము. సాధువుల హృదయముకూడ నేనే. మాయిరువురకు అట్టి ఘనిష్ఠమైనదాని నెరుగరు. నేనుకూడ విరికంటె వేరైన దానిని కొంచెమైన నెరుగను.

దుర్వాసా ఉవాచ -

'యన్నా మశ్రుతిమాత్రేణ పుమాన్‌ భవతి నిర్మలః |

తస్య తీర్థప్రదః కిం వా దాసానా మవశిష్యతే |' 9-5-16

తా| ఏభగవంతుని మంగళకరమైన నామమును శ్రవణము చేసినంతనే జీవుడు నిర్మలు డగుచున్నాడో అట్టి భగవంతుని పవిత్రపాదములను సేవించు దాసులకు కర్తవ్యశేషమేమి మిగిలియుండును.

శ్రీభగవా నువాచ

'త్రిః సప్తభిః పితా పూతః పితృభి| స్సహ తేనఘ |

యత్‌ సాధోస్య గృహే జాతో భవాన్‌ వైకులపావనః |

యత్ర యత్ర చ మద్భక్తాః ప్రశాన్తాః సమదర్శినః |

సాధవః సముదాచారా స్తే పూయంత్యపి కీటకాః |

సర్వాత్మనా న హింసన్తి భూతగ్రామేషు కించన |

ఉచ్చావచేషు దై త్యేంద్ర మద్భావేన గతస్పృహాః |'

తా| శ్రీనృసింహభగవాను డిట్లు పలికెను - పాప రహితుడ వగు ప్రహ్లాదా! నీతండ్రి మరణించి పవిత్రుడై తరించెను. ఇందు చెప్పవలసినది లేదు. అతనికి కులములు వరకు పితృదేవతలున్నచో వారుకూడ తరించెడివారే. దీనికి కారణమేమనగా నీవంటి కులదీపకుడు వంశపావనుడు అతనికి పుట్టుటయే. నీ సాధుస్వభావము ప్రశంసనీయము. ఏ యే ప్రదేశములందు శాంతస్వభావులు, బ్రహ్మవేత్తులు, సదాచార పరాయణులు, సాధువులు, సన్న్యాసులు అగు నాభక్తులు నివసింతురో ఆప్రదేశములు కీకటదేశములైనను పవిత్రతమములగును. దైత్రేంద్రా! భక్తి భావముచే కోరికలు నశించినవారు సర్వత్రా ఆత్మభావన గలవారు అగుదురుగాన చిన్నదైనను పెద్దదైనను యేప్రాణిని యేవిధముగానూ బాధ (పెట్టరు) కలుగజేయరు.

శ్రీభగవానువాచ -

'అహం భక్తపారాధీనో హ్యస్వతంత్ర ఇవ ద్విజ |

సాధుభిర్గ్రస్తహృదయో భ##క్తై ర్భక్తజనప్రియః |' 9-4-63.

తా| హేదుర్వాసమహర్షీ ! నేను సర్వదా భక్తపరాధీనుడను- స్వతంత్రములేనివాడను. భక్తులు సాధుపురుషులు నాహృదయమును కట్టి తమచేతియందుంచుకొందురు. బక్తజనులు నాకు ప్రియమైనవారు. నేనునూ వారికి ప్రియమైనవాడనే.

'నాహ మాత్మాన మశాసే మద్భక్తైః స్సాధుభి ర్వినా |

శ్రియం చాత్యంతికిం బ్రహ్మన్‌ యేషాం గతి రహంపరా | 64.

యే దారాగారపుత్రాప్తాన్‌ ప్రాణా న్విత్త మిమం పరమ్‌ |

హిత్వా మాం శరణం యాతాః కధం తాం స్త్యక్తు ముత్సహే | 65.

మయి నిర్బర్ధహృదయాః సాధవ స్సమదర్శనాః |

వశీకుర్వంతి మాం బక్త్యాసత్‌ స్త్రియ స్సత్పతిం యధా, |

తా| బ్రాహ్మణోత్తమా! దుర్వాసా! నాభక్తులు నన్నే యాశ్రయించియుందురు. సాధుస్వభావముగలిగిన నాభక్తులను విడచి నాశరీరమునుగాని, నాస్వార్థమునుగాని నేను కోరను. నా యర్ధాంగి యేన లక్ష్మీదేవిని, నాశరహితమైన సంపదను కూడ నాభక్తులను విడిచి నేను కోరను. వారితోడిదే నా లోకము. ఏభక్తులు, జ్ఞానులు, భార్యలను, పుత్రులను, ఇల్లు వాకళ్లను, బంధువర్గమును, ప్రాణములను, ధనధాన్యాది సంపదలను, ఇహలోకపరలోకములను వీటినిన్నటిని విడచి కేవలము నన్నేశరణు పొందియున్నారో అట్టివారిని విడచుటకు నేనెట్లు సంకల్పించగలను - సాధ్వీమణియైన స్త్రీ తన పాతి ప్రత్యపాలనమున సదాచారవంతుడైన పతిని వశపరచుకొను నటుల సమదర్శులైన బ్రహ్మవేత్తలు భక్తులు నాయందు వారి హృదయమును భక్తిరజ్జువుతో బంధించి అమితమైన ప్రేమతో నన్ను స్వాధీనమందుంచుకొందురు- వరి ప్రేమచే నేను బద్ధుడను.

'మత్సేవయా ప్రతీతం చ సాలోక్యాదిచతుష్టయమ్‌ |

నేచ్ఛంతి సేవయా పూర్ణాః కుతోన్యత్‌ కాలవిద్రుతమ్‌ |'

తా| నాయందు అనన్యమైన ప్రేమ గల భక్తులు నాసేవచేతనే తాము కృతకృత్యులైనట్లు, పరిపూర్ణులైనట్లు భావింతురు. నాసేవకు ఫలముగా వారికి సాలోక్యసామీప్యసారూప్యసాయుజ్యములను నాలుగు ముక్తులు లభించును. కాని వానినికూడ స్వీకరించుట కిష్టపడరు. అనినచో కాలవశమున నశించు తుచ్ఛభోగములను స్వీకరించ రని వేరే చెప్ప వలయునా,

శ్రీభగవానువాచ -

'న రోధయతి మాం యోగో న సాంఖ్యం ధర్మఏవ చ |

న స్వాధ్యాయ స్తపస్త్యాగో నేష్టాపూర్తం న దక్షిణా |

వ్రతాని యజ్ఞ శ్చందాంసి తీర్థాని నియమా యమాః |

యథావరుంధే సత్సంగ స్సర్వసంగాపహోహి మామ్‌ |'

(11-12-102)

ఉద్ధవా! జగత్తునందు అనేకరకములైన ఆసక్తులు గలవు. మమకారములు గలవు. అవే వాస్తవికబంధములు. వాటి నన్నింటిని సత్పురుషులతొడి సాంగత్యము నశింపజేయును. ఈసత్కసాంగత్యము నన్నేవిధమున వశపరచునో ఆవిధముగా అన్యసాధన లేవియు చేయలేవు. యోగము, సాంఖ్యము, (జ్ఞానము) ధర్మాచరణము, స్వాధ్యాయము, తపస్సు, త్యాగము, ఇష్టాపూర్తకర్మలు, దానదక్షిణలు, వీటి వలన నేను ప్రసన్నడను కాను- సత్సంగమహిమను సే నెంతని వర్ణింతురు. వ్రతములు, యజ్ఞముల, వేదములు తీర్థములు, యమనియమాదులు ఇవన్నియు సత్సంగముతో సమానముగ నన్ను వశపరచుకొనుటకు సమర్థములు కావు.

'మత్కామా రమణం జారం అస్వరూపవిదోబలాః |

బ్రహ్మ మాం పరమం ప్రాపుః సంగాచ్ఛతనహస్రశః |' 1-12-13.

తా| ఉద్ధవా! ఆగోపికలలో చాలమంది నావాస్తవిక స్వరూపమును యెరుగనే యెరుగరు. వారు నన్ను భగవంతునిగా భావింపక - వరికి ప్రేమాస్పదుడ నని భావించి జార భావముతోడనే నన్ను కలియుటకు ప్రయత్నించుచువచ్చిరి. ఏ యాధ్యాత్మికసాధలులేని యాయబలలు వందలువేల సంఖ్యలో నున్నవారు కేవల సాంగత్యబలప్రభావమున (పరబ్రహ్మ) పరమాత్మ నగు నన్ను పొందిరి.

'తస్మాత్‌ త్వ ముద్ధవోత్సృజ్య చోదనాం ప్రతిచోదనామ్‌ |

ప్రవృత్తం చ నివృత్తం చ శ్రోతవ్యం శ్రుత మేవ చ |

మామేక మేవ శరణ మాత్మానం సర్వదేహినామ్‌ |

యాహి సర్వాత్మభావేన యయాస్యాహ్యకుతోభయః |

తా| కనుక ఉద్ధవా! శ్రుతిస్మృతులను, విధినిషేధములను, ప్రవృత్తినివృత్తులను వినదగిన దానిని, ఇదివరకు విన్న దానిని వీటన్నిటిని విడిచి సర్వప్రాణులలోను ఆత్మరూపమున నున్న నన్నొక్కనినే సర్వాత్మభావనతో శరణుపొందుము. నాశరణు పొందుటవలన నిర్భయ స్థానమైన మోక్షమును పొందగలవు.

దుర్లభో మానుషో దేహో దేహినాం క్షణభంగురః |

తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనమ్‌ |' (11-2-29)

తా| జీవులకు మనుష్యశరీరము లభించుట చాల కష్టము. దైవానుగ్రహ మున్ననాడు గాని లభించదు. అది ప్రాప్తించినను నీటిబుడగవలె క్షణభంగురము- దానికి 'నిత్యం సన్నిహితో మృత్యుః' ప్రతిక్షణము మృత్యుదేవత శిరసుపై తాండవమాడుచుండును. ఏక్షణము మరణము వచ్చునో యెవరూ చెప్పజాలరు- ఇట్టి అనిశ్చితమైన మనుష్యజన్మమందు భగవంతుని ప్రేమించి అతనిచే ప్రేమించబడు భక్తు దర్శనము ఇంకను దుర్లభము.

దుర్లభం త్రయ మే వైతత్‌ దైవానుగ్రహకారకమ్‌ |

మనుష్యత్వం ముముక్షుత్వం మమాపురుషసంశ్రయః |

(శంకరభగవత్పాదులు-వివేకచూడామణి)

తా| ప్రపంచమునందు మూడువిషయములు అత్యంత దుర్లభములు. ఇవి దైవానుగ్రహమున్న గాని లభించవు. అందు మొదటిది మనుష్యత్వము. ఇది లభించినను మోక్షము కావలెనను కొరిక విశేష దైవనుగ్రహమున్న గాని లభించిదు. 'ఈశ్వరానుగ్రహాదేవ పుంసా మద్వైతవాసనా' ముముక్షుత్వము కలిగినను దానిని సాధించుటకు సత్పురుషులగు సన్న్యాసుల సాంగత్య మవసరము. అత్యధికమైన దైనానుగ్రహమున్న గాని య ది లభించదు. సత్సాంగత్యముతో అన్నియు సమకూడును.

'భజంతి యే యథా దేవాన్‌ దేవా అపి త థైవ తాన్‌ |

ఛాయేవ కర్మసచివా స్సాధవో దీనవత్సలాః |' 11-2-6

మానవులు దేవతలను యెట్టి భావనతో భజింతురో దేవతలుకూడ ఆభావన కనుకూలమైన ఫలముమాత్రమునిత్తురు. ప్రతిబింబము బింబముచే నుండునట్లు- ఛాయ మానవుననుసరించి యుండునట్లు దేవతలు కర్మకు మంత్రులు. అనగా అధీనులు. కాని సాధువులు దీనులందు వాత్సల్యము గలవారు సాంసారిక సంపత్తి గాని, సాధనసంపత్తి గాని లేనివారలను కూడ ఆదరింతురు.

'సాధూనాం సమచిత్తానాం సుతరాం మత్కృతాత్మనామ్‌ |

దర్శనాన్నో భ##వే ద్బంధః పుంసోక్షఓః సవితుర్యధా |' 10-10-41

తా| శ్రీభగవా నువాచ - సమాన చిత్తము గల సాధువులు అందునా తమను, హృదయమును సంపూర్ణముగ భగవదర్పితము గావించిన సాధువులు వారి దర్శనమాత్రమున బంధము తొలగిపోవును. సూర్యోదయ మగుటతోడనే మానవుని నేత్రములనుండి అంధకారము పటాపంచ లగునటు సాధుదర్శనమాత్రము (అజ్ఞానము) బంధము తొలగిపోవునున.

శ్రీభగవా నువాచ--

'ప్రసంగ మజరం పాశ మాత్మనః కపయో విదుః|

స ఏవ సాధుషు కృతీఓ మోక్షద్వార మపావృత్తమ్‌ |'

బ్రహ్మవేత్తలైనవారు ప్రసంగమును (ఆసక్తినే ఆత్మకు అచ్ఛేద్యమైన బంధమునుగా భావించుచున్నారు కాని ఆ సాంగత్యమునే (యాసక్తినే) బ్రహ్మవేత్తలయం సత్పురుషుల యందుంచినవాడు తెరచియున్న మోక్షద్వారముగా తయారగుచున్నది.

'తితిక్షవః కారుణికాః సుహృద స్సర్వదేహినామ్‌ |

అజాతశత్రవ శ్శాంతాః సాధవ స్సాధుభూషణాః |' 3-25-26

మయ్యనన్యేన భావేన భక్తిం కుక్వంతి యే దృఢామ్‌ |

మత్కృతే త్యక్తకర్మాణః త్యక్తస్వజనబాంధవాః | 22.

మదాశ్రయాః కథామృష్టాః శ్రుణ్వంతి కథయంతి చ |

తపన్తి వివిధా స్తాపాః నైతాన్‌ మద్గతచేతసః |' 23.

తా| సహనశీలురు, దయాళువులు, సమస్తప్రాణులకు అకారణహితులు ఎవరితోను శత్రుభావము లేనివారు, శాంత స్వభావులు, సాధువులు సాధువులను సన్మానించువారు- నా యందనన్యభావముతో ప్రేమదార్ఢ్యముగలవారు. నన్ను పొందుటకొరకు సమస్తకర్మలను బంధువర్గమును విడిచినవారు. నన్నే యాధారముగ నెంచుకొని పవిత్రమైన కధలు వినుచూ చెప్పుచూ నున్నవారు. నాయందే చిత్తము సమర్పించినవారు. ఇట్టి బ్రహ్మవేత్తలను సాంసారికి తాపములు తపింపచేయలేవు.

'త ఏతే సాధవః సాధ్వి సర్వసంగనివర్జితాః |

సంగ స్తె ష్వధ తే ప్రార్ధ్యః సంగదోషహరా హి తే |' 3-25-24

తా| సాధ్వీశిరోమణీ! అమ్మా! అట్టి సర్వసంగపరిత్యాగులైన సన్యాసులే సాధువులు. వారే బ్రహ్మవేత్తలు. వారితో సాంగత్యమునే నీవు ప్రార్ధించి సంపాదించవలయును. అంతకుముందు జరిగిన సాంగత్యదోషము లన్నియు వారు హరించగలరు.

'అర్చాయా మేవ హరయే పూజాం యః శ్రద్ధయేహతే |

న తద్భకైషు చాన్యెషు స భక్తః ప్రాకృతః స్మృతః |' 11-2-47

తా| భగవంతుని అర్చామూర్తులనుమాత్రము శ్రద్ధతో పూజించుచు భగవద్భక్తులను, జ్ఞానులను సేవాశుశ్రూషలు చేయనివాడు ప్రాకృతభక్తు డనబడును. అనగా చాల నిన్ను శ్రేణికి చెందిన భక్తు డనబడును.

'యధోసశ్రయమాణస్య భగవవన్తం విభావనుమ్‌ |

శీతం భయం తమోప్యేతి సాధూన్‌ సంసేవత స్తధా |' 11-26-31

తా| బ్రహ్మవేత్తలను సేవించుటవలన కర్మజడత్వము, సంసారభయము, అజ్ఞానము మూడును పూర్తిగా నశించును. అగ్ని హోత్రుని ఆశ్రయించినవానికి చలి, భయము, చీకటి, యెట్లు నశించునో అట్లుగానే సత్సేవవలన (అడవిలో నెగడు పెట్టినచోటికి క్రూరమృగములు రావుకనుక భయముపోవును)

'నిమజ్జతోన్మజ్జతాం ఘోరే భవాబ్ధౌ పరమాయనమ్‌ |

సన్తో బ్రహ్మవిదః శాంతా నౌ ర్దృబేవాప్సు యజ్జతామ్‌ |'

తా| ఈభయంకరమైన సంసారసాగరమందు మునిగి తేలుచు దరి గానక బాధపడుచుండు జీవులకు బ్రహ్మవేత్తలైన సత్పురుషులు శాంతులే వారికి నౌవకంటివారు. నీటిలో మునుగుచున్న వానికి పడవ లభించిన అనాయాసముగ ఆవలిదరి చేరగలిగినటులు బ్రహ్మవేత్తలు పరమాశ్రయముగా పొందిన వారు సంసారసముద్రమునుండి తరింతురు.

'అన్నం హి ప్రాణినాం ప్రాణో ఆర్తానాం శరణం త్వహమ్‌ |

ధర్మోవిత్తం నృణాం ప్రేత్యసంతోర్వాక్‌ బిభ్యతోరణమ్‌|'

తా| ప్రాణులకు ప్రియమైన ప్రాణములు అన్నముల వలన రక్షింపబడుచున్నది. ఆర్తుల బాధల హరించుటకు నేనే శరణ్యుడను. (ద్రౌపది, గజేంద్రుడు, ప్రహ్లాదుడు, విభీషణుడు సుగ్రీవుడు) 'ధర్మోవిత్తం నృణాం ప్రేత్య భౌతికధనము పరలోకమునకు పనికిరాదు. ఈధనమును ధర్మముగా మార్చుకొనిన అది పరలోకమున వాడుకొనవచ్చును. ధర్మమే పరలోకధనము. సంసారమున తాపత్రయముతో బాధపడువారై మృత్యుభయగ్రన్తులైనవారికి బ్రహ్మవేత్తలే పరమాశ్రయులు.

'సంతో దిశంతి చక్షూంషి బహి రర్కః సముత్థితః |

దేవతా బంధవాః సంతః శ్చా ఆత్మాహ మేవ చ |' 11-26-34

తా| సూర్యుడదయించి లోకులకు జగత్తును తనను చూచుటకు నేత్రములను దానముచేయుచున్నాడు. అట్లే బ్రహ్మవిదులైన సాధువులు జీవులకు తమ యాత్మను తాము చూచుకొనుటకు భగవంతుని చూచుటకు అంతర్దృష్టిని (జ్ఞాన నేత్రమును) ప్రదానము చేతురు. వారే అసలైన దేవతలు. వారే వాస్తవమైన బంధువులు. వారు అందరి హృదయము లందు విరాజిల్లు ఆత్మస్వరూపులే. అధికముగా వచింపనేల. నేనే వారు, వారే నేను, నాకును, బ్రహ్మవేత్తలకును లేశ##మైనను తేడా లేదు.

శ్రీభగవానువాచ-

'సంతోన పేక్ష్యా మచ్చిత్తాః ప్రశాన్తా స్సమదర్శినః |

నిర్మమా నిరహంకారాః నిర్ద్వంద్వా నిష్పరిగ్రహాః |' 11-26-27

తా| ఉద్ధవా! బ్రహ్మవేత్తలైన సత్పురుషుల లక్షణ మీవిధముగ నుండును. వారు యెన్నడు యేవస్తువును అపేక్షించరు. వారి చిత్తము నాయందే లగ్నమై యుండును. వారిహృదయము తరంగరహితమైన సముద్రమువలె ప్రశాంతముగ నుండును. 'నిర్దోషం హి సమం బ్రహ్మ' యనుగీతోక్తి ననుసరించి వారు సర్వత్ర సమదర్శులుగ నుందురు. 'పండితాః సమదర్శినః' వారికి అహంకారము. (దేహాదులం దాత్మాభిమానము) లేశ##మైన యుండదనిన, మమకారమునకు అసలే తావు లేదు. శీతోష్ణములు, సుఖదుఃఖములు, లాభా లాభములు, జయాపజయములు, మానావమానములు ఇత్యాది ద్వంద్వములందు వారు చలింపక ఏకరూపమున నుందురు. వారు పరిగ్రహరహితులు.

'తేషు నిత్యం మహాభాగ మహాభాగేషు మత్కథాః |

సంభవంతి హితా నౄణాం జుషతాం ప్రపునంత్యఘమ్‌ |'

తా| పరమభాగ్యశాలినగు ఉద్ధవా ! బ్రహ్మవేత్తల మహిమను ఎవరు వర్ణించగలరు? వారివద్ద నిరంతరము భగవంతుని లీలలు, గాధలు ప్రవచనములు జరుగుచుండును అవి యన్నియు మానవులకు హితకములే - వాటిని యెవరు సేవింతురో వారి పాపము లన్నియు కడిగివేయబడును.

'యే చ శృణ్వంతి గాయంతి హ్యనుమోదన్తి చాదృతాః |

మత్పరాః శ్రద్దధానాశ్చ భక్తిం విందంతి తే మయి |' 11-26-29

తా| మహాపురుషల సన్ని ధానమందు జరుగు పురాణ ప్రవచములను భగవంతుని లీలలను యెవరు శ్రద్దతో (ఆదరముతో) వినుచున్నారో, గానము చేయుచున్నారో, అనుమోదించుచున్నారో వారు నాయందు అనన్యమైన ప్రేమ భక్తిని పొందుచున్నారు.

'భక్తిం లబ్ధవత స్సాధోః కిమన్య దవశిష్యతే |

మయ్యనంతగుణ బ్రహ్మ ణ్యానందానుభవాత్మని |' 30

తా| భక్తిని పొందిన సాధుపురుషునకు పొందదగినదేదియు మిగిలియుండదు. అన్నియు లభించినట్లే- ఉద్ధవా! నేను అనంతకల్యాణగుణగణములకు ఆశ్రయుడను. కేవలానందమే నాస్వరూపము. నేను ప్రతివాని హృదయమున ఆత్మరూపమున అనుభవింపబడుచునే యున్నాను. నేనే సాక్షాత్పరబ్రహ్మను. అట్టి నాయందు భక్తిని పొందినవారు కృత కృత్యులైనారని యెరుగుము.

దేవహూ త్యువాచ- దేవహూతి యిట్లు పలికెను--

'సంగం యో సంసృతేర్హేతుః అసత్సు విహితో ధియా |

స ఏవ సాధుషు కృతో నిస్సంగత్వాయ కల్పతే |' 3-23-55

తా| తెలివితక్కువవలన సత్పురుషులతో చేయు సాంగత్యము సంసారమునకు కారణ మగును. అదియే సాధువులతో బ్రహ్మవేత్తలతో చేసిన నిస్సంగత్వమునకు కారణముగును నిస్సంగత్వమే మోక్షము.

'నేహ యత్కర్మ ధర్మాయ న విరాగాయ కల్పతే |

న తీర్థపదసేవాయై జీవన్నపి మృతో హి సః |' 56.

తా| ఏపురుషుని కర్మవలన ధర్మసంపదగాని, వైరాగ్యోత్పత్తిగాని, భగవంతుని సేవారూపమైన భక్తి గాని కలుగదో ఆపురుషుడు జీవించియున్ననూ చచ్చినవానితో సమానుడు.

'తస్మా న్మయ్యర్పితాశేష క్రియార్థాత్మా నిరంతరః |

మయ్యర్పితాత్మనః పుంసో మయి సన్న్యస్తకర్మణః |

న పశ్యామి పరం భూత మకర్తు స్సమదర్శనాత్‌ |' (3-29-33)

తా| నిష్కామధర్మాచరణ చేయువానికన్న - సమస్త కర్మములు, వాటి ఫలములు తన చిత్తమును నాకే యర్పించి, భేదబావము లేనివాడై నన్ను పాసించువాడు శ్రేష్ఠుడు. ఈవిధముగా చిత్తము కర్మలు సమర్పించి అకర్తయై, సమదర్శియైన పురుషునికంటె శ్రేష్ఠుడు నాకు కానరాడు. అనగా అందరికంటె అతడు శ్రేష్ఠుడు, గొప్పవాడు. అతనికన్న గొప్పవారు లేరు.

'న చ మయ్యర్పితధియాం కామః కామాయ కల్పతే |

భర్జితా క్వథితా ధానా ప్రాయో బీజాయ నెష్యతె |' (22-26)

తా | ఏవరై తే తన మనః ప్రాణములను నాయందర్పించి యున్నాడో అతనికోరికలు కామనలు సంసారమువైపు ఈడ్చుకొనిపోవునని కావు. వేయించిన - లేక ఉడకబెట్టిన ధాన్యాది బీజములు, విత్తనములు మొలకెత్తుటకు యోగ్యములు కావు.

'నిరపేక్షం మునిం శాంతం నిర్వైరం సమదర్శనమ్‌ |

అనువ్రజా మ్యహం నిత్యం పూయే యేత్యంఘ్రిరేణుభిః |'

తా| దేనియందును అపేక్షలేనివాడును, జగచ్చింతనము విడిచి భగవచ్చింతనమందే సర్వదా లీనమై యుండువాడును, శాంతస్వభావుడును, యెవరితోను వైరభావము లేనివాడును, రాగద్వేషరహితుడై సర్వత్ర సమదర్శనము కలవాడును అనగా బ్రహ్మవేత్తయైన మహానుభావుని వెనుకవెనుక నేను నిరంతరము తిరుగుచుందును. అతని పాదరేణువులు నామీద పడి నన్ను పవిత్రుని చేయవలె నని అభిలషింతును.

'యెపయాతి శ##నై ర్మాయా యోషిదేవ వినిర్మితా |

తా మీక్షే తాత్మనో మృత్యుంతృణౖః కూపమివావృతమ్‌ |'

తా | భగవంతునిచే నిర్మితమైన ఈస్త్రీరూపమాయ సేవయును మిషతో మెల్లమెల్లగా సాధుకుని సమీపించును. ఆమెను తన మృత్యుదేవతగా భావించవలెను. ఆమె గడ్డితీగెలచే కప్పబడిన బావి వంటిది. అందు జారిపడిన బయటకు వచ్చుట కష్టము.

'యాం మన్యతే పతిం మోమాత్‌ మ న్మాయామృష భాయతీమ్‌ |

స్త్రత్వం స్త్రీసంగతః ప్రాప్తో విత్తాపత్యగృహ ప్రదమ్‌ |

తా మాత్మనో విజానీయాత్‌ పత్యపత్యగృహాదికమ్‌ |

దైవోపపాదితం మృత్యుం మృగయో ర్గాయనం యథా |'

తా| ముముక్షువైన పురుషునకు స్త్రీసంగతి త్యాజ్యమైనటులే తీవ్రమోక్షేచ్ఛ గల మహిళకు కూడ పురుషుని సంగతి త్యాజ్యము. స్త్రీయందు అత్యంతఆసక్తి కలిగినచో పురుషుడు మరుజన్మమున స్త్రీగా పుట్టును. ఆసక్తి అధిక మగుటవలన అంత్యకాలముందును ఆమెనే ధ్యానించుచు చనిపోవును. గాన స్త్రీజన్మ తప్పదు. 'యాంతే మతిః సాగతిః' అత్యంతకాలమందు యెట్టి భాడవనయుండునో అట్టిజన్మ వచ్చును. జడభరతుడు లేడిని పెంచి దానినే స్మరించుచు చనిపోయెను. గాన లేడిజన్మ వచ్చెను.

'యం యం వాపి స్మరస్‌ భావం త్యజ త్యన్తే కళేబరమ్‌ |

తం త మేవైతి కౌంతేయ సదా తద్భావభావితః |' గీ|

తా| ఏయే భావముల మనుసునం దిడుకొని స్థూల దేహమును విడిచి మరణించునో, మరుజన్మమున ఆభావానురూపమైన జన్మ వచ్చును. ఈవిధముగా స్త్రీత్వము పొందిన జీవీఉడు పురుషరూపమున ప్రతీత మగుచు ధనము, పుత్రులు, గృహాదికము నిచ్చుచూ భర్త యనబడు వ్యక్తిని దైవదత్తమైన మృత్యుదేవతగా తెలియవలెను. వేటగాని గానము విని సమీపించిన లేడి అతనిచే మరణము పొందినట్లు, భర్త, పుత్రులు, గృహము ఇవన్నియు మధురములుగా నుండుచూ తన నాశనముకే కారణము లగుచున్నవి.

శ్రీభగవా నువాచ --

'బ్రహ్మన్‌ తే నుగ్రహార్థాయ సంప్రాప్తాన్‌ విద్ధ్యమూన్మునే |

సంచరన్తి మయా లోకాన్‌ పునంతః పాదరేణుభిః |'

తా| శ్రుతదేవా! ఈమునీశ్వరులు, బుషీశ్వరులు అందరూ నిన్ను అనుగ్రహించుటకే నీయింటికి వచ్చిరి. వీరు తమ పాదధూళిచే లోకములను, లోకులను పవిత్రముచేయుచూ నాతో సంచరించుచున్నారు.

'దేవాః క్షేత్రాణి తీర్థాని దర్శనస్పర్శనార్చనైః |

శ##నైః పునంతి కాలేన తద ప్యర్హత్తమేక్షయా |' 52.

తా | దేవతలు, పుణ్యక్షేత్రములు, తీర్థములు, దర్శన స్పర్శన అర్చనలద్వారా మెల్లమెల్లగా చిరకాలమునకు పవిత్రము చేయును. అవి (యైనను) మహాపురుషుల దర్శనము చేతనే పవిత్రము చేయును. తీర్థములకు, దేవతలకు మహాత్ముల దర్శనముచేతనే పవిత్రముచేయుశక్తి కలుగుచున్నది.

'బ్రాహ్మణో జన్మనా శ్రేయాన్‌ సర్వేషాం ప్రాణినా మిహ |

తపసా విద్యయా తుష్ట్యా కిము మత్కలయా యుతః | 53.

తా| శ్రుతదేవా! బ్రాహ్మణుడు జన్మచేతనే అన్ని ప్రాణులకంటే శ్రేష్ఠుడు. అతడు తపస్సు, విద్యాసంతుష్టి, నాయుపాసనా, నాభక్తి కలిగినవాడైనచో చెప్పెడిదేమి.

'న బ్రాహ్మణా న్మెదయితం రూ మెత చ్చతుర్భుజమ్‌ |

సర్వవేదమయో విప్రః సర్వదేవమయో హ్యహమ్‌ |'

తా| నాకు చతుర్భుజరూపముకూడ బ్రాహ్మణుల కన్న ప్రియమైనది కాదు. బ్రాహ్మణులు సర్వవేదమయులు. నేను సర్వదేవమయుడను.

'దుష్ప్రజ్ఞా అవిదత్వైవం అవజానం త్యసూయవః |

గురుంమాం విప్ర మాత్మాన మర్చాదా విజ్యదృష్టయః |'

తా | బుద్ధిహీనులైన వారు ఈవిషయము నెరుగక కేవలమూ ర్త్యాదులందు మాత్రము పూజ్యబుద్ధి నుంచుకొని గుణము లందు దోషారోపణ చేయుచు నాస్వరూపులైన బ్రహ్మవేత్తలను, జగద్గురువులను అవమానింతురు. వారు వారి యాత్మ స్వరూపులే యని యెరుగరు.

'చరాచర మిదం విశ్వం భావి యే చాస్యహేతవః |

మద్రూపాణీతి చేత స్యాధతై విపరో మదీక్షయా |'

తా | బ్రహ్మవేత్త నాసాక్షాత్కారము పొంది ఈ చరాచరజగత్తు- దీనికి సంబంధించిన భావపరంపర, దీనికి కారణభూతములైన ప్రకృతి, మహత్తత్వాదికము ఇవియన్నియు ఆత్మస్వరూపుడైన భగవంతుని రూపమే యని మానసమున నిశ్చయించుకొనును.

'తస్మాత్‌ బ్రహ్మబుషీ నేతాన్‌ బ్రహ్మన్‌ మచ్ఛ్రద్ధయార్చయ | ఏవం చే దర్చితోన్మ్యద్ధా నావ్యథా భూరి భూతిభిః |'

తా | కనుక శ్రుతదేవా! ఈబ్రహ్మమహర్షులను నా స్వరూపముగా భావించి సంపూర్ణమైన శ్రద్ధతో పూజించుము. అట్లు చేసిననాడే నీవు నన్ను సాక్షాత్తుగా పూజించినట్లగును. అట్లు పూజించనిచో నీవు ఎంతగా గొప్పసామగ్రితో ఎంత సమారోహముతో విగ్రహములందు పూజచేసినను అది నా పూజగాదు. నాకు తృప్తి నివ్వదు.

'కిం స్వల్పతపసాం నౄణాం అర్చాయాం దేవచక్షుషామ్‌ | దర్శన స్పర్శన ప్రశ్న ప్రహ్వపాదార్చ నావికమ్‌ |' 10-84-10

తా| ఎవరైతే స్వల్పమైన తపస్సు చేసి యున్నారో అచ్చామూర్తులందే దేవతాబుద్ధిగలవారై యున్నారో అట్టి వారికి తమబోటి మహాత్ముల దర్శనము, స్పర్శనము, కశల ప్రశ్నచేయుట, వందనము చేయుట, పాదపూజ చేయుట మొదలగు మహాభాగ్యములు ఎట్లు లభించగలవు.

'అహోవయం జన్మభృతో లబ్ధం కాత్స్న్యాన తత్ఫలమ్‌ | దేవానామపి దుష్ప్రాపం యద్యోగేశ్వరదర్శనమ్‌ |' 9.

తా| ఆహా! నేడుగదా మాజీవితము సఫలమైనది. పురుషులుగా పుట్టినందుకు పూర్తిఫలము లభించినది. మీబోటి యోగేశ్వరుల దర్శనము దేవతలకుకూడ దుర్లభ##మైనది. నేడు మాకు లభించినది.

'న హ్యమ్మయాని తీర్థాని న దేవా మృచ్ఛిలామయాః |

తే పునం త్యురుకాలేన దర్శనా దేవ సాధవః |'

తా| కేవలజలమయతీర్థములే తీర్థములు కావు. మృత్తికతో రాతితో తయారైన మూర్తులే దేవతలు కారు. వాస్తవమున సత్పురుషులే తీర్థములు, దేవతాస్వరూపులు. కారణమేమన తీర్థములు- దేవతామూర్తులు చిరకాలము సేవించిన గాని పవిత్రము చేయజాలవు. కాని సత్పురుషులు, సాధువులు, బ్రహ్మవేత్తలు దర్శనమాత్రమున పవిత్రము చేయుదురు. (ఇచ్చట దర్శనము తత్కర్తృకము, తత్కర్మకము ఉభయధా జ్ఞేయము.)

'నాగ్ని ర్న సూర్యో నచ చంద్రతారకా, న భూర్జలం శ్వసనోవాధ వాఙ్మనః | ఉపాసితా భేదకృతో హరం త్యఘంవిపశ్చితో ఘ్నంతి ముహూర్తసేవయా |' 12.

తా| అగ్ని, సూర్యుడు, చంద్రుడు, తారలు, భూమి, జలము, ఆకాశము, వాయువు, వాణి, మనసు. వీటి అధిష్ఠాతృదేవతలను ఉపాసించిననూ పాపమును పూర్తిగా నశింప చేయలేవు. వారి నుపాసించిన భేదబుద్ధి నశింపకపోగా వృద్ధియగును. కాని జ్ఞానులు, బ్రహ్మవేత్తలు మహూర్త మాత్రసేవచేతనే సమస్తపాపములను నశింపచేయుచున్నారు. వారు భేదబుద్ధిని నశింపజేయుదురు.

మ హా త్ము లా రా ! సభాసదులారా! ఏమానవుడు వాతపిత్త శ్లేష్మములను మూడు ధాతువులతో నిరమితమై, శవతుల్యమైన శరీరమునే ఆత్మగా భావించునో స్త్రీపుత్రాదులను తన వారిగా, మట్టి, రాయి, కాష్ఠము ఇత్యాది పార్థివపదార్థములనే ఇష్టదైవముగా భావించునో, కేవల జలమునే తీర్థముగా భావించునో, జ్ఞానులైన బ్రహ్మవేత్తలందు ఈనాల్గుభావములు పెట్టడో, యతడు మనుష్యాకారమున నున్నను ఎద్దువంటివాడు- గాడిదవంటివాడు.

--- ఈ ప్రపంచమంతయు బ్రహ్మవేత్తలదే ---

భగవంతుడు అఖిలాండకోటిబ్రహ్మాండనాయకుడు - అతడే సృష్టిస్తితిలయములు చేయువా డని భారతీయవాఙ్మయమున సర్వత్ర గోచరించును. ఈబ్రహ్మాండమున అతనికి సర్వాధికారములు గలవు. ఎవరు దేనిని తయారచేయుదురో వారికి దానియందు అధికార ముండుట సహజమే కదా. భగవంతునితో సమానులు బ్రహ్మవేత్తలు గాన ఈబ్రహ్మాండమున వారికి నీ సర్వహక్కులు గలవు. వారి యనుసంధానము కూడ 'మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం' అనగా (ఈప్రపంచమంతయు నాయందే పుట్టుచున్నది. నాయందే నిలచి లీనమగుచున్నది) అని యుండును. కనుక ప్రపంచమందీతనకి అధికారము గలదు. ప్రతివ్యక్తియు శరీరమును నాది యనుకొని తనదిగా భావించుచున్నాడో అట్లే భార్యాపుత్రాది సంపదయందు నాది యను కొని అని తనదిగా నుండవలె నని కోరుచున్నాడో - నేటి రాజకీయవేత్తలు ఈరాష్ట్రము మాది యనుకొని , అది తమదిగానే యుండవలె నని యభిలషించు చున్నారో, అఉలనే బ్రహ్మవేత్త బ్రహ్‌మాండ మంతయు నాదే, నేనే. నాకంటె అతిరిక్తముగా లేదని ధ్యానబలమున తనదిగా చేసుకొనుచున్నాడు. కనుకనే యతడు స్వామి యని పిలువబడుచున్నాడు.

ప్రతివ్యక్తి శరీరము తా ననుకొనుట, తనదనుకొనుట, భార్యపుత్రాదులను తనవారనుకొనుట పొరబాటే. వాస్తవమున శరీరము తాను కాడు. అది తనది కాదు. అట్లే భార్య పుత్రాదులు తన వారు కారు. ఇది యంతయు భ్రాంతివలననే జరుగుచున్నది. ఈభ్రాంతిని తొలగించుటకే శాస్త్రము ప్రవర్తించుచున్నది. ఇట్టి భ్రాంతిని తొలగించుకొని తన వాస్తవస్వరూపమైన పరమాత్మయే తానని బ్రహ్మ వేత్త భావించును. ఈప్రపంచ మంతయు పరమాత్మయందు రజ్జు సర్పమువలె కల్పితము. అనగా బ్రహ్మవేత్త స్వరూపమునందే కల్పితము. కల్పితసర్పము రజ్జువుదే యైనటుల బ్రహ్మవేత్తలో కల్పితప్రపంచముకూడ బ్రహ్మవేత్తదే. ఈ భావమునే భాగవతమున చతుర్థస్కందమున పృథుచక్రవర్తి ప్రకటించియున్నాడు. (సర్గ 22-42)

ఒకప్పుడు యాదృచ్ఛికముగా నసకాదులు పృథుచక్రవర్తిని చూచుటకు రాగా చక్రవర్తి వారిని యధోచితముగ పూజించి శ్రేయోమార్గమునుగూర్చి ప్రశ్నింప వారు జ్ఞానోపదేశము గావించిరి. తదనంతరము పృథుచక్రవర్తి యిట్లనియె--

'కృతో మేనుగ్రహః పూర్వం హరిణా೭೭ర్తానుకంపినా |

తమాపాదయితుం బ్రహ్మన్‌ భగవన్‌ యూయ మాగతాః |'

తా| భగవత్స్వరూపులారా! పూర్వమందు హరి యజ్ఞాంతమందు అనుగ్రహించియున్నాడు. ఆ యనుగ్రహము రూపొందించుటకు తమరు దయచేసిరి. (భగవదనుగ్రహము లేనిదే సత్పురుషుల సాంగత్యము దొరుకదు.)

'నిష్పాదితశ్చ కార్స్న్యై భగవద్భిర్ఘృణాలుభిః |

సాధూచ్ఛిష్టం హి మే సర్వం ఆత్మనా సహ కిందదే |' 43.

తా| మీరు దయాసముద్రులు. మీ రాకకు ప్రయోజనము జ్ఞానము కలుగటయే కదా. అది మీరు పూర్తిగా నిర్వహించిరి. దీనికి బదులుగా నేనేమి యివ్వగలను. నా యీశరీరము, దీనికి సంబంధించిన సర్వమూ బ్రహ్మవేత్తల యుచ్ఛిష్టమే. వారు నాకనుగ్రహించినదే.

'ప్రాణా దారా సుతా బ్రహ్మాన్‌ గృహాశ్చ సపరిచ్ఛదాః |

రాజ్యం బలం మహీ కోశ ఇతి సర్వం నివేదితమ్‌ |' 44.

తా| బ్రహ్మస్వరూపులారా! నాప్రాణము, పుత్రులు భార్యయు, ధనకనకవస్తువాహనములతో తులతూగు భవనములు, రాజ్యము, సైన్యము, భూమి, ఖజానా, ఇది యంతయు వాస్తవమున మీదే. దానినే మరల నేను మీచరణకమలము లందు సమర్పించుచున్నాను.

'సైనాపత్యం చ రాజ్యం చ దండనేతృత్వమేవ చ |

సర్వలోకాధిపత్యం చ వేదశాస్త్రవి దర్హతి |' 45.

తా| వాస్తవమున సేనాపతిత్వము, రాజ్యము, దండ విధానము, సమప్తలోకములను శాసించు యధికారము వేదశాస్త్రముల నెరిగిన బ్రహ్మవేత్తలకే కలదు.

'స్వ మేవ బ్రాహ్మణో భుంకై స్వం వస్తె స్వం దదాతి చ |

తసై#్యవానుగ్రహే ణాన్నం భుంజతే క్షత్రియాదయః |'

తా| బ్రహ్మవేత్త తన స్వంతహక్కు గల అన్నాదికమునే యనుభవించుచున్నాడు. తనవైన వస్త్రాదికమునే ధరించుచున్నాడు. తన స్వంతద్రవ్యమునే ఇతరుల కిచ్చుచున్నాడు. అతని యను గ్రహమువలననే క్షత్రియాదులు అన్నాదికము ననుభవించుచున్నారు. వాటియందు వారికి స్వత్వమేమియు లేదు. బ్రహ్మవేత్తల ద్రవ్యమునే వారనుభవించుచున్నారు. వారికి దానమందు స్వాతంత్ర్యమే లేదు. వారికి సొత్తే లేనినాడు దాన మేడ?

'యైరీదృశీ భగవతో గతి రాత్మవాదే,

ఏకాన్తతో నిగమిభిః ప్రతిపాదితా నః |

తుష్యం త్వదభ్రకరుణాః స్వకృతేన నిత్యం

కో నామ తత్ప్రతికరోతి వినోదపాత్రమ్‌ |' (22-47)

తా| ద్రవ్యమాత్రమే బ్రాహ్మణస్వామికము. నా స్వత్వముగల ద్రవ్యమే లేదు. మీరు నిగమాంతపారగులు. భగవంతునితో యభేదభక్తియే అతని పొందుటకు ప్రధాన సాధన మని మీరు అధ్యాత్మతత్త్వమును చక్కగా విచారణచేసి నిశ్చితరూపమున సెలవిచ్చిరి. మీ కరుణ యపారము. ఈ దీనోద్ధరణరూపకర్మచేతనే మీరు సర్వదా సంతుష్టులు కండు. ఈ మహోపకారమునకు ప్రతిగా యెవరు యేమి యివ్వగలరు? యేమిచ్చినను అది హాస్యాస్పదమే యగును. గుడ్డి గవ్వ నిచ్చి ఏనుగును కొనదలచినవాడు హాస్యాస్పదుడు గాక యేమగును? అమూల్యవస్తువునకు మూల్య మెవ రివ్వగలరు? అది యసంభవము. అట్లు చేయుటకు ప్రయత్నించిన అమూల్యత్వము న కే హాని కలుగును. కేవల మంజలి ఘటించుట కన్న నేనేమి యివ్వగలను? నా దేమియు లేనిదే.

ఈవిధమున పృథుచక్రవర్తి ఈబ్రహ్మాండ మంతయు బ్రహ్మవేత్తలదే యని నిరూపించియున్నాడు. యతీశ్వరులకు భిక్ష పెట్టువారు తమ దేమియి పెట్టుట లేదు. వరాదే వారికి పెట్టుచున్నారు. నీరు భగవంతునిచే సృజింపబడినది. అతని నీటినే అతనిపై పోసి నేనభిషేకించితి నని యభిమానించును. 'తవై వ వస్తు గోవింద తుభ్య మేవ సమర్పయే' యనునట్లు యతడు సృష్టించిన పుష్పములనే యతనిపై వైచి నేను పూజించితి ననును. యతులదే యతుల కిచ్చి తానిచ్చితి ననుటకూడ అట్టిదియే. ఇదియే సరియైన భావన. ఇట్టి భావనవలననే బుద్ధికి వికాసము కలుగును. అది లేనినాడు శాంతిసౌఖ్యములు కలుగనేరవు. దానినే గీతలో -- 'న చాభావయత శ్శాంతి రశాంతస్య కుత స్సుఖం' భావనచేయలేనివానికి శాంతి రాదు. శాంతిలేనివారికి సౌఖ్యము లేదు. తస్మా దాత్మజ్ఞం హ్యర్చ యేత్‌ భూతికామః' యని ముండకశ్రుతి యర్చనమును విధించుచున్నది. దానినే స్మృతి యగు నూతసంహిత ఉపబృంహణము చేయుచున్నది. 'ఇతిమాసపురాణాభ్యాం వేదాన్తార్థః ప్రకాశ్యతే' యని శిష్టోక్తి. అది యిట్లనుచున్నది. (నూత సంహితాయాం శివమాహాత్మ్యఖండే 6 అధ్యాయే)

'వక్ష్యే పూజావిధిం విప్రాః శివభక్తస్య సాదరమ్‌ |

శ్రుణుధ్వం శ్రద్ధయోపేతాః కురుధ్వం యత్నత స్సదా |

ఓ బ్రాహ్మణోత్తములారా! శివభక్తునకు జేయు పూజా విధిని చెప్పెదను. దానిని సాదరముగ విని శ్రద్ధాయుక్తులై యాచరింపుడు.

యేన కేన ప్రకారేణ శికభక్తస్య జాయతే |

మనస్తృప్తి స్తదా కుర్యా త్పూజా సైవ (ప్రకీర్తితా) మయోదితా |

ఏవిధముగ శివభక్తునకు మనస్తృప్తి కలుగునో యా విధముగా పూజింపవలెను.

శుద్ధతోయం సమాదాయ శివభక్తస్య సాదరమ్‌ |

పాదౌ ప్రక్షాలయే త్సాపి పూజా విప్రా గరీయచసీ | 3.

పరిశుభ్రమైన పవిత్రమైన జలమును స్వీకరించి దానిచే శివభక్తుని పాదములను కడిగిన యదియు గొప్ప పూజ యగును.

తైలాభ్యంగం తథా పూజాం ప్రవదన్తి మనీషిణః |

గాత్రమర్దన మప్యన్యే శివభక్త స్య సువ్రతాః | 4.

ఇట్లే తైలాభ్యంజనమును గాత్రమర్దనము గూడ గొప్ప పూజనుగ పండితులు చెప్పుచున్నారు.

అన్న దానప్రదానం చ పూజా ప్రోక్తా గరీయసీ |

అర్థదానం చ పూజా స్యా ద్వస్త్రదాన మపి ద్విజాః | 5.

ఇట్లే శివభక్తునికి అన్నదానము అర్థము నిచ్చుటయు వస్త్రదానము గొప్పపూజ యగును

స్రక్చందనాదిదానం చ వనితాదాన మేవచ |

ఇట్లే స్నాతకవ్రతుడై కన్య నపేక్షించి వచ్చిన శివభక్తుడగు బ్రహ్మచారికి స్రక్చందనాదులను, కన్యను యిచ్చుటయు, మహాపూజా ఫలప్రదము.

భూమిదానం చ గోదానం తిలదాన మపి ద్విజాః | 6.

జలపాత్రప్రదానం చ గృహదానం తథైవ చ |

తాళవృంతప్రదానం చ యాత్రాదానం తథైవ చ | 7.

ఛత్రపాదుకయో ర్దానం శయ్యాదానం తథైవ చ |

శివభక్తస్య పూజేతి ప్రవన్తి నిపశ్చితః |' 8.

ఇట్లే భూమిదానము, గోదానము, తిలదానము, జలపాత్రదానము, గృహదానము, తాళవృంతదానము, ఛత్రమును, పాదుకలను యిచ్చుట, శయ్యాదానము మొదలగు దానము లన్నియు ప్రతిగ్రహ యోగ్యు డుగ శివభక్తుడు గోరినవాని నిచ్చినచో ననంతపూజా ఫలప్రదము లగును.

---- శివమాహాత్మ్యఖండే సప్తమాధ్యాయే ---

'మనోహరం మఠం కృత్వాదత్త్వా చ శివయోగినే |

నిత్యం ప్రపూజయామాస శివభక్తా నతిప్రియః | 37.

ధనేన ధాన్యేన తిలేన తండులై స్తథైవ తైలేన తధౌదనేన చ |

దుకూలపుష్పాభరణౖ రపి ద్విజోత్తమాః మనోనుకూలేన వధూజనేన చ |

ఏవం సంవత్సరేతీతే పుత్రోనిరోగతాం గతః |

పూజయా శివభక్తానాం నివృత్తో బ్రహ్మరాక్షసః | 39.

బ్రహ్మరక్షస్సుచే భాధింపబడిన తన కుమారుని దుస్థితి చూచి యొక వైశ్యపుంగవుడు పైన చెప్పిన విధమున మనోహమగు మఠమును నిర్మించి దానిని ప్రతిగ్రహయోగ్యుడగు శివయోగికీచ్ఛి ధనధాన్యదికముచే యధాశాస్త్రముగ యధార్హముగ శివభక్తులను పూజించుచుండగా నొకసంవత్సరమగుసరికి శివభక్త పూజామాహాత్మ్యముచే దన పుత్రుడు బ్రహ్మరక్షస్సుచే విడువబడి యారోగ్యవంతు డయ్యెను.

జ్ఞాని యైన సన్న్యాసిని భక్తుడు కాదనరాదు. భగవద్గీతలో -

'చతుర్విధా భజంతే మాం జనా న్సుకృతినోర్జున |

ఆర్తో జిజ్ఞాను రర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ |'

తా| అనియున్నది. గాన జ్ఞానికూడ భక్తుడే. అతడందరికంటే యధికుడు. అతనిని- జ్ఞానీ త్వాత్మైవ మే మతం' 'జ్ఞాని యనగా నేనే' యని నాభావ మని భగవంతుడు నుడినియున్నాడు.

---- 1 సన్న్యాసాశ్రమ విషయమున మహాపురుషుల భావవిశేషములు ---

1. సన్న్యాస మనగాThe simplest life with highest dignity అని నిర్వచించవచ్చు. వారికి స్థిరచరాస్తు లేమియు నుండవు. కాని చక్రవర్తులుసహితము వారికి సాష్టాంగముగ నమస్కరించవలసినదే. అదియే ఆర్షసంపద్రాయము. భగంతుడుకూడ తాను స్వయముగ ఆచరణ చేసి చూపిన దిదియే. నారదాదిమహర్షులు వచ్చినప్పుడు అర్ఘ్యపాద్యాదులతో నర్చించి వరా యవసరములను ముందు తీర్చెడివాడు. వార 3-5-7 ఇళ్లలో మధుకరమును గ్రహించి ''భిక్షాన్న మాత్రేణ చ తుష్టిమన్తః- కౌపీనవంతః కలు భాగ్యవంతః'' యని భావించి తృప్తి నందుదురు. భారతీయసంస్కృతిలో వైరాగ్యమునకై విలువ.

''న వైరాగ్యా త్పరం భాగ్యం న బోధా దపరః సఖా |

న హరే రపర స్త్రాతా న సంసారా త్పరో రిపుః |''

ఇత్యాదిభావములకు ప్రశంస గలదు. వైరాగ్యముకన్న గొప్పభాగ్యము లేదు. జ్ఞానముకన్న మిన్నయైన మిత్రుడు లేడు. శ్రీహరికంటే వేరు రక్షకుడు లేడు. సంసారముకంటె గొప్ప శత్రువు వేరొకడు లేడు. అని శ్లోకభావము.

2. పరివ్రాజకులను భగవంతుని పంచమాంగదళముగా భావించినను, పొరబాటేమియు నుండదు అది యొక (C. I. D) సి. ఐ. డి. డిపార్టుమెంటు వారు పర్యటించునపుడు ప్రజానీకమున జరుగుచుండు పొరబాటులను వీక్షించి ''అది మంచిదికాదని'' మనసులో భావించవచ్చు - లేదా మాటతో మదలించవచ్చు. వారి మాటలకు, భావములకు విశేషమైన విలువ కలదు. వారి యనుగ్రహమునకు పాత్రులైనవారు ప్రహ్లాదుని వంటివా రగుదురు. వారి యగ్రహమునకు గురియైనవారు హిరణ్యకశిపునివలె తయారగుదురు. వారి ప్రెస్‌ రిపోర్టును చిత్రగుప్తుడు చిట్ఠాలో జమచేసికొనును. జీవుల పాపపుణ్య పరిగణనము చేసి శిక్షించుటకు ఆకవిలెకట్ట యుపయోగింతురు. సమవర్తి సభలో సన్న్యాసులుకూడ సభాసదులుగా నియమింపబడియుందురు. అంతిమనిర్ణయము వారిదేనట. వారి తీర్పునే ప్రమాణముగా భావించి అమలుజరుపుట జరుగును. జయవిజయులశాపము, యాదవముసలము, ఇంద్రద్యమ్న మహారాజుకి అగస్త్యు డిచ్చిన గజేంద్రశాపము, బృహస్పతి యింద్రునికిచ్చిన శాపము ఇత్యాదు లన్నియు ఈకోవకు చెందినవే. ''బుషీనాం పున రాద్యానాం వాచ మర్థోను ధావతి'' అని మహాకవినూక్తి - ''సత్యం విధాతుం నిజభృత్య భాషితం'' అనివ్యాసుని వాక్కు. భాగ. 7-10

3. క్రింది (జిల్లా) కోర్టులోని దావాతీర్పు వాదిప్రతివాదులలో యెవరికి నచ్చకపోయినను హైకోర్టుకి అప్పీలు చేయుదురు. అచ్చటి తీర్పుకూడ నచ్చనిచో సుప్రీంకోర్టుకి పోవుదురు. అక్కడ నిర్ణయములకు అప్పీలు లేదు. అది అమలు జరుగవలసినదే. అ దేవిధమున మూడు వేదముల నెరిగిన ప్రాడ్వివాకులు కేసును విచారణచేసి ధర్మనిర్ణయము చేయుదురు. అది నచ్చనివారు బ్రహ్మవేత్తవద్ద అప్పీలు చేసుకొనవచ్చు. అతడొక్కడైనను అతని పరిష్కారమే శిలాశాసనము. దానికి తిరుగు లేదు. ఇది ఆర్షసంప్రదాయము-- కొందరు దీనికి కారణమే మని ప్రశ్నించవచ్చు.

సమాధానమిదిగో --

4. ఒక దావాలో వాదిప్రతివాదులో యెవరికి జడ్జీ చుట్టమైననూ రెండవవారు దావాను ఇంకొకకోర్టుకి-- వాది ప్రతివాదులతో సంబంధములేని జడ్డీవద్దకు (ట్రాన్సఫర్‌) బదిలీ చెయ్యవలసినదిగా కోర్టువారికి దరఖాస్తు దాకలు చేయుదురు. జడ్డీ యెవరికి బంధువైననూ వారిపక్షమున తీర్పు రావచ్చు నను భయమే దానికి కారణము. ఎవరితోను సంబంధము లేని వ్యక్తియైనచో తీర్పు సరిగా నుండు నని యొక విశ్వాసము. అటులనే యెవ్వరితోను సంబంధము లేని బ్రహ్మవేత్తలు అసంగులు గాన సమస్యను సరిగా చూచి సరియైన న్యాయనిర్ణయము చేయగలుగుదురు. అట్లు గాక దారేషణ, ధనేషణ, పుత్రేషణలతో సతమతమగుచున్నవారి బుద్ధి సరియైన స్థితిలోనుండదు గాన వారు కేసు సరిగా పరిష్కారము చేయుజాలరు. వాసనాత్రయము, ఈషణాత్రయము, అంతఃకరణమును విక్షిప్తము చేయును. చంచలమైన నీటిలో సూర్యప్రతిబింబము స్పష్టముగా కానరానటుల వారిబుద్ధికి ధర్మము న్యాయము సరిగా భాసించదు. కాన వారి నిర్ణయములు కొన్ని మార్చుకొనవలసిన యవసరముండును. బ్రహ్మవేత్త నిశ్చలబుద్ధిగలవాడుగాన ధర్మబ్రహ్మములు నిశ్చలముగా అతనికి భాసించును. కనుక అతని నిర్ణయము అంతిమ మనుట యుచితము. దానికి తిరుగు లేదు. అట్టి నిర్ణయములే వ్యాసులవారి బ్రహ్మసూత్రములందు గలవు. వాటికి అప్పీలు లేదు. అమలు జరుగట అందరికీ మంచిది.

5. యతీశ్వరులు, బుషీశ్వరులు, మునీశ్వరులు అని భారతీయసంస్కృతిలో వ్యవహరించబడు వ్యక్తులు ఈమూడు లోకాలకు ప్రభువైన ఈశ్వరునితో సమానులు. House of lards- కోవకు చెందినవారు. వారి సంకల్పములే శాసనములు- వారందరూ ఈశ్వరుని ఆధికారికపురుషులు- వారు ఓట్లతో యెన్నికైనవారు కారు. వేదచోదితమైన తపస్సు చేసి అధికార స్థానమున నిలచిరి. ఇంగ్లండులో రాజుండగా భారతదేశమున రాజప్రతినిధి యున్నట్లు వైకుంఠమున విష్ణువుండగా యతని ప్రతినిధులు భూలోకమున స్వాముల పేరుతో నుందురు. ప్రజాస్వామ్య మను పదము నేడు బహువ్యాప్తి చెందియున్నది. దాని కర్థము ప్రజాప్రభుత్వమనియు- నేటిపరిపాలనాపద్ధతికి ప్రజలే ప్రభువులనియు వ్యాఖ్యానించుచుందురు. వారు ప్రభువులైననూ కాకపోయినను సన్న్యాసులను మాత్రము స్వామి యని యందరూ వ్యవహరింతురు. స్వామి యనగా ప్రభువనియే అర్థము. ఈస్వామికి వేదమే ఉపదేశాధికార మిచ్చినది. ''త ద్విజ్ఞానార్థం స గురు మేవాభిగచ్ఛే త్సమిత్పాణిః శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం'' ఇందు బ్రహ్మనిష్ఠ శబ్దము సరోజమువలె రూఢ్యర్థము గలది. బ్రహ్మనిష్ఠు డన సన్న్యాసియే. తదితరుడు కాడు. సన్న్యాసి లేనిచో జ్ఞాన మెవ్వరికీ లేదు.

6. ఒక వ్యసనముకలవా డింకొక వ్యసనిని వారించు టకు వీలులేనట్లు ఈషణాత్రయ వాసనాత్రయ విశిష్టులు వాటి నివారణ కుపదేశింపజాలరు. కనుక తద్రహితమైన సన్న్యాసాశ్రమ మవసరము. వాసనానాశ##మే కదా మోక్షము. కనుకనే కఠోపనిషత్తులో ''న నరేణావరేణ ప్రోక్త ఏషనువిజ్ఞేయః'' అనగా వాసనావిశిష్టుడై తక్కువ శ్రేణికి చెందిన నరుడుపదేశించిన తత్త్వము సరిగా తెలియబడదని నుడివినది. ఈతురీయాశ్రమ మున్ననాడె జ్ఞానపరంపర యవిచ్ఛిన్నముగా నుండుట కవకాశము. వాసనావిశిష్టుల చేతిలోబడిన దానికి వికృతరూపము వచ్చును. కళ్లజోడు అద్దాలు యే రంగులోనున్న ప్రపంచ నూరంగులో నున్నట్లు కనుబడుట సహజమే కదా.

7. చక్రవర్తిగా పుట్టవలెనన్న విశేష పుణ్యము చేయవలసియున్నది. సన్యాసమునకు యోగ్యమైన జన్మ రావలె ననిన అంతకన్న విశేషపుణ్య మవసరము. దానినే గీతలో ''ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్‌'' అని భగవంతుడు పలికెను. కనుక చక్రవర్తుల కిచ్చు గౌరవముకన్న పరివ్రాజకులనే అధికమైన గౌరవముతో చూచుట యుచితము. నిరాదరణ చూపరాదు.

8. ప్రపంచమున వ్యవహార మంతయు ప్రమాణమును పరిగణించియే జరుగుచున్నది. మానము కొలత, తూనిక అన్ని వ్యవహారములదునూ అవసరమే. పంచభూతములను కొలుచుటకు మీటర్లు సృష్టించిరి. కొళాయిలో నీటివాడకమునకు, కరెంటికి, మోటారు వేగమునకు యంత్రములు చేయు పనికి మీటర్లు కొలతలు గలవు. జ్వరానికి ధర్మామీటరు గలదు. కాంతి వర్షముద్వారా నక్షత్రదూరమును కొలుతురు. గడియారము ద్వారా కాలమును కొలుతురు. భౌతికపదార్థము లను కొలుచుటకు మానములు సృష్టింపబడినను - ఆధ్యాత్మిక పదార్థముల కొలచుటకు ప్రమాణము లేదేశమందును సృష్టికాలేదు. అది భారతదేశమున సృష్టింపబడినది. 'ప్రమాకరణం ప్రమాణం' అని నిర్వచనము. యధార్థజ్ఞానమునకు అసాధారణకారణ మని దాని కర్థము. మానవనిర్మిత మనములు దేశకాలవ్యక్తులచే భిన్నములై మారునట్లు భగవంతునిచే నిర్మితమైన ప్రమాణమున కట్టి మార్పలేదు-- రాదు. అవసరము లేదు. నేత్రముద్వారా రూపజ్ఞానము కలుగుట భగవంతునిచే కల్పితమైన మానము. ఇది యే దేశమందైననూ యేకాలమందైననూ, యేవ్యక్తి యందైననూ మార్పలేనిది. అదియే దానిలోని ప్రకృష్టత్వము, అట్టి ప్రమాణములపై యేనాధాఆరపడినది భారతీయసంస్కృతి- మన్వంతరములు మారినా ఈప్రమాణములు మారవు. ఇట్టి ప్రమాణముల విచారణయే వేదాన్త పరిభాష యందు నూత్రప్రాయమున గలదు. దాని వివరణ దీనిరెండవ భాగమున గలదు. ప్రస్తుతమున ప్రమాణముల బలాబల విచారణమున వేదమే పరమ ప్రమాణ మని యొప్పిరి. ఆవేదముచే విహితమైనదే సన్న్యాసాశ్రమము- దానినే శంకర భగవత్పాదులు కట్టుదిట్టము చేసిరి. వ్యవహారమున ఈప్రమాణ మెంతయో అవసరము.

9. నేడు సైన్సుసబ్జక్టులలో థియరీ యని ప్రాక్టికల్‌ అని రెండు విభాగము లుండును. అందు థియరీని మాష్టరు ద్వారా క్లాసులో చదివి, దానిని అనుభవములోనికి తెచ్చుకొనుటకు లేబరేటరీలో ప్రవేశించి పరిశోధనలు చేయుదురు. అటులనే వైదికవిజ్ఞానమునకూడ గ్రంథాధ్యయనమును థియరీగా పరిగణించి అభ్యాసవైరాగ్యసంన్యాములు ప్రాక్టికల్‌ కోర్సలో చేర్చుకొనవలెను థియరీలో ఎన్ని యెక్కువమార్కులు వచ్చినా ప్రాక్టికల్‌ చేతకాకపో తేపరీక్షపోయినట్టే. పట్టా రాదు. అటులనే వాచాపాండిత్య మెంత సంపాదించినను సన్న్యానము, వైరాగ్యము లేనిచో అది యంతయు వ్యర్థము. 'జ్ఞానం సన్న్యాసలక్షణము' అని భగవంతుడు అతనుగీతలో నుడివెను. వైరాగ్యమే బుద్ధివికాసమునకు గుర్తు. 'అధీత్య చతురో వేదాన్‌ సూక్ష్మం బ్రహ్‌మ న విందతి. వేద భారభరాక్రాంతః సవిప్రో గర్ధభః స్మృతః' అని సనత్సుజాతీయము.

10. అరుదైన వస్తువునకు విలువ యధికము కోహినూర్‌, కల్లినన్‌ వంటి వజ్రము లెన్ని గలవు. ప్లాటినమ్‌ లోహము బంగారుకంటె విలువైనది. మట్టికంటె బంగారము విలువ అధికము. అది అరుదుగా దొరుకుటయే దానికి కారణము. అటులనే భారతదేశమున 5 లక్షలగ్రామాలలో శాస్త్రీయముగా సన్న్యాసమును గ్రహించినవారెంతమంది దొరుకుదురు? వారిలో విద్వత్సన్న్యాసు లెంత యరుదుగా నుందురు. ఈ దృష్టికోణముచే వారి విలువ అత్యధికము. అంతకంటె విలువైనది- గొప్పది యింకొకటి లేదని శాస్త్రము పలుకును. గీతాభాషలో ''మనుష్యాణాం సహస్రేషు కశ్చి ద్యతతి సిద్ధయే | యతతా మపి సిద్ధానాం కశ్చి న్మాం వేత్తి తత్త్వతః' అని కశ్చిత్‌ శబ్దముచే అత్యంతఅరుదని నిర్ణయించె. గ్రామాని కొక దేవాలయముండవచ్చు, గ్రామాని కొక సన్న్యాసిదొరుకడుకనుక గుళ్లోదేవునికన్న అతడెక్కుడు.

11.రాజకీయమున ద్రవ్యమానములో ఒక కాగితముపై 10 రూ| ముద్ర, ఇంకొక దానిపై 100 రూ| ముద్ర, మరొక దానిపై 1000 ముద్ర వేసి విలువ నిచ్చి చలామణి చేయుచున్నారు. ఈకాగితపుముక్కకు ఎందుకింత విలువ యని ప్రశ్నించకయే వ్యవహరించుచున్నాము. అదేవిధము వేద ప్రమాణముద్వారా నిర్ధారణచేయబడిన మానముచే యతీశ్వరులకు విలువ విలువ గలదు. ఇచ్చటకూడ ఎందుకంత విలువ. యన్ని ప్రశ్న వేయక విలువ తగ్గించక వ్యవహరించుటబుద్ధిమంతుల లక్షణము. ఇట్టిదియే భారతీయసంస్కృతి. నోటు విలువ తగ్గించి వ్యవహరించువారు నేరస్థులుగా పరిగణింపబడుదురు. అసలువిలువ తగ్గించుట కెవడునూ వప్పుకోడు. పరమప్రమాణమైన వేదము యిచ్చిన విలువనుమాత్రము యెందుకు తగ్గించవలె. తులసి, అశ్వత్థము, గోవు, ధాత్రీ, సాలగ్రామము, నర్మదాబాణము ఇత్యాదులకు వైదికవిలువలు గలవు. అల్పజ్ఞులైన జీవులు కల్పించిన మానములకే గుడ్డినమ్మకముతో విలువ నిచ్చి వ్యవహారము చేయుచూ సర్వజ్ఞమైన వేదకల్పనలకు విలువ తగ్గించట బుద్ధిమంతుల లక్షణము గాదు. తప్పుకొలతలతో దొంగనోట్లతో వ్యవహారముచేయుట నేరమే కదా! ఆహారపదార్థములను కల్తీ చేయువారు దోషులు, శిక్షార్హులు అని యందురుకదా! శుద్ధమైన వేదప్రమాణమును వప్పుకొని దేశమునకే యారోగ్యము. బజారులో కల్తీతైలములతో వండి ఈగలు ముసురుచుండు అపరిశుభ్రమైన యాహారము ఆరోగ్యమును పాడుచేయును. దీని వివరణ చాల గలదు. రెండవ భాగమున చూడ దగును.

12. యత్యాశ్రమము మానవసమాజమున కొక గీటురాయి. ఉత్తమాశ్రమవిషయమున మానవులకు కలుగు భావ పరంపర ననుసరించి అంతఃకరణవికాస మనుమిత్ర మగును. దేహమందాత్మబుద్ధి, పుత్రమిత్రకళత్రాదులందు తనవారిని, ఆప్తులని భావించుట మృచ్చిలాదులందు పూజ్యబుద్ధి, సలిలములందు తీర్థబుద్ధి కలిగియున్న మానవుడు యతులయందు ఈ నాల్గుభావములు పెట్టనిచో వాడు పశువుకన్న నికృష్టుడు- అని భగవద్వాక్యము (భాగ 10-84-13) వారే యాత్మ స్వరూపులు. వారే అసలైన బంధువులు. వారే పూజ్యులు. వారి స్నానములవలన గంగాదినదులు తీర్ధములైనవని భావించవలెను.

''నామగోత్రాదిచరణం దేశం కాలం శ్రుతం కులమ్‌ |

వయో వృత్తం శీలం ఖ్యాపయే న్నైవ సద్యతిః '

తా| యతీశ్వరులు తన పేరు, గోత్రము, (పూర్వాశ్రమ విషయము) వేదశాఖ, దేశము, కాలము, చదివిన విద్య, ఆచార్యకులము, వయస్సు, ప్రవర్తన, ఉపాసన, స్వభావము ఇత్యాదులను వెల్లడి చేయరాదు. కనుక ఇతరు లడుగరాదు. కాషాయ, దండ, కమండలువులు చూచి వారిని యాదరించుట కర్తవ్యము.

శంకరభగవత్పాదులు-- 'సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వే | నిర్మోహత్వె నిశ్చలతత్త్వం, నిశ్చల తత్వే జీవన్ముక్తిః'' ''సంగ స్సత్సు విధీయతామ్‌'' ''త్రిజగతి సజ్జనసంగతి రేకా భవతి బవార్ణ వతరణ నౌకా'' అని నుడివిరి. సత్పదార్థమును సొందుటకు తమ జీవితము నంకితముచేసిన సన్న్యాసులే సత్పురుషులు. వారి సాంగత్యమే సంసార సముద్రమును తరించుటకు నౌక. సురక్షితముగ దాటవచ్చు.

హరిః ఓం తత్సత్‌.

శ్రీశంకరజయంతి-- ప్రథమభాగము సమాప్తము.

Sri Sankara Jayant  Chapters    Last Page